EPAPER

IPL 2025: పంజాబ్, ఢిల్లీ, గుజరాత్, కోల్ కతా.. ఐపీఎల్ కోచ్ లు మారుతున్నారు..

IPL 2025: పంజాబ్, ఢిల్లీ, గుజరాత్, కోల్ కతా.. ఐపీఎల్ కోచ్ లు మారుతున్నారు..

Punjab, Delhi, Gujarat, Kolkata Teams Set To Have New Head Coach Ahead of IPL 2025: ఐపీఎల్ లో 17 ఏళ్లుగా కొన్ని జట్లకు టైటిల్ అందని ద్రాక్షగానే ఉంది. వాటిలో ప్రధానంగా విరాట్ కొహ్లీ ఉన్న ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్, ఢిల్లీ రెండు జట్లకు హెడ్ కోచ్ లు మారనున్నారని అంటున్నారు. ఆర్సీబీ అయితే ఏకంగా కెప్టెన్ ని మార్చనుందని అంటున్నారు.


మరికొన్ని నెలల్లో ఐపీఎల్ మెగా వేలం ఉండటంతో కోచింగ్ సిబ్బందితో సహా జట్లను ప్రక్షాళన చేయాలని దాదాపు అన్ని ఫ్రాంచైజీలు నిర్ణయించుకున్నాయని అంటున్నారు. వీరందరూ కూడా ఈ దెబ్బతో ఒక బలమైన జట్టును నిర్మించి ఐపీఎల్-2025లో విజేతగా నిలవాలని పట్టుదలతో కార్యచరణ మొదలుపెట్టారు.

ఈ నేపథ్యంలో ఎవరిని జట్టులో ఉంచుకుంటారు? ఎవరిని వదులుకుంటారనేది ఫ్రాంచైజీల నుంచి ఐపీఎల్ నిర్వాహకులు వివరాలు కోరనున్నారు. ఈ దెబ్బతో అన్ని జట్లలో భారీ మార్పులు జరగనున్నాయని అంటున్నారు.


ఇకపోతే పంజాబ్ కింగ్స్.. తమ ప్రధాన కోచ్ ట్రెవర్ బేలిస్ ను వదిలించుకోనున్నారు. ఆయన స్థానంలో ఆర్సీబీ మాజీ బ్యాటర్ వసీం జాఫర్ ను నియమించడం దాదాపు ఖాయమని అంటున్నారు. అయితే వీరిచ్చే ఆఫర్ మరి జాఫర్ కి నచ్చుతుందో లేదో తెలియాల్సి ఉంది. జాఫర్ గతంలో పంజాబ్ కింగ్స్‌తో కలిసి పనిచేశాడు. 2021 సీజన్ వరకు జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు అందించాడు.

Also Read: పారిస్ ఒలింపిక్స్ ఓపెనింగ్ అదుర్స్, జట్టును లీడ్ చేసిన పీవీసింధు, శరత్

ఇప్పటివరకు పంజాబ్ కేవలం రెండు సార్లు మాత్రమే ప్లేఆఫ్స్‌కు చేరింది. గత పది సీజన్లుగా లీగ్ దశలోనే ఇంటిముఖం పడుతోంది. 2014లో రన్నరప్‌గా నిలవడమే పంజాబ్ అత్యుత్తమ ప్రదర్శన అని చెప్పాలి.

ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ ప్రాంఛైజీల్లోనూ కోచింగ్ సిబ్బందిలో మార్పులు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ తమ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్‌ను తప్పించింది. గుజరాత్ టైటాన్స్ కూడా హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ విక్రమ్ సోలంకితో తమ ఒప్పందాన్ని ముగించుకోనుందని అంటున్నారు.

అలాగే కోల్ కతా కూడా కొత్త మెంటార్, ఇతర సిబ్బంది కోసం వెతుకుతోంది. గౌతం గంభీర్ వెళుతూ కోల్ కతా జట్టులోని కొందరిని తనతో తీసుకువెళ్లిపోవడంతో షారూఖ్ ఖాన్ తలపట్టుకున్నాడని అంటున్నారు. ముంబయి కూడా దాదాపు అందరినీ మార్చేలాగే కనిపిస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే పది ఫ్రాంచైజీలు కూడా తమ జట్లలో నూతన జవసత్వాలు నింపేందుకు ప్లాన్లు వేస్తున్నారు.

Related News

Vinesh Phogat Bajrang Punia: ‘వినేశ్ ఫోగట్ చీటింగ్ చేసి ఒలింపిక్స్‌కు వెళ్లింది’.. బిజేపీ నాయకుడి వివాదాస్పద వ్యాఖ్యలు

Duleep Trophy 2024: మళ్లీ ముంబై బ్యాటర్ వచ్చాడు.. అదరగొట్టిన ముషీర్ ఖాన్..181

Paralympics Hokato Hotozhe: పారాలింపిక్స్ లో భారత్ పతకాల సంఖ్య 27!.. హై జంప్ లో గోల్డ్, షాట్ పుట్ లో కాంస్యం!

Wrestlers: బ్రేకింగ్ న్యూస్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన రెజ్లర్లు వినేష్ ఫొగట్, బజరంగ్ పునియా

US Open 2024: యూఎస్ ఓపెన్..నెంబర్ వన్ ర్యాంకర్ ఓటమి

Duleep Trophy 2024: ముషీర్ ఖాన్ సెంచరీ.. అక్షర్ పటేల్ అదుర్స్

Rishabh Pant: అంతర్జాతీయ క్రికెట్ లో ఒత్తిడి తప్పదు: రిషబ్ పంత్

Big Stories

×