EPAPER

Sarabjot Singh: బాగా ఆకలిగా ఉంది.. ప్లీజ్.. కాంస్య పతక విజేత సరభ్ జ్యోత్ సింగ్

Sarabjot Singh: బాగా ఆకలిగా ఉంది.. ప్లీజ్.. కాంస్య పతక విజేత సరభ్ జ్యోత్ సింగ్

Please give me Something to eat,” Sarabjot Singh first Request after Winning Bronze: ప్లీజ్.. బాగా ఆకలిగా ఉంది.. అని మన భారతీయ క్రీడాకారుడు అడిగాడు. అరే.. ఏమిటిది? అని ఆశ్చర్యపోతున్నారా? పారిస్ ఒలింపిక్స్ లో మనోళ్లకి తిండి పెట్టడం లేదా? అని  సీరియస్ అవుతున్నారా?  ఆగండాగండి.. నిజానికి ఒలింపిక్స్ కమిటీ తిండి బాగానే పెడుతోంది. కాకపోతే ఆటగాళ్ల కోచ్ లు ఉన్నారే.. వారు మాత్రం సైంధవుల్లా అడ్డు పడుతున్నారంట. గేమ్ అయ్యేవరకు అది తినొద్దు, ఇది తినొద్దు.. అది తింటే వాంతులవుతాయి. ఇది తింటే వికారంగా ఉంటుంది. లేదంటే అజీర్తి పుట్టి,  ఆట మీద కాన్ సంట్రేషన్ తగ్గిపోతుందని కంట్రోల్ చేస్తున్నారంట. ఒక సెకన్ నువ్వు ఇన్ హెల్తీతో ఇబ్బందిపడ్డా.. ఇంత కష్టం వృధా అయిపోతుందని అని అంటున్నారంట. దీంతో క్రీడాకారులు కూడా నోరు కట్టీసుకుని పోటీల్లో పాల్గొంటుంటారు.


అయితే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్ డ్ టీమ్ విభాగంలో మను బాకర్ తో కలిసి పతకం సాధించిన సరభ్ జ్యోత్ సింగ్ గేమ్ అయిపోయిన తర్వాత ఇండియా హౌస్ కి వెళ్లి.. బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఉంటే ఇవ్వండి.. అని అడిగాడు. దీంతో నిర్వాహకులు హడావుడిగా పానీ పూరీ, భేల్ పూరీ, దోసె, ఇంకా రకరకాల వంటలు వేడివేడిగా రెడీ చేసి ఇచ్చారంట.

ఇంతకీ ఒలింపిక్స్ లో కొలువైన ఇండియా హౌస్ ఎవరిదో తెలుసా? ఇంకెవరిది మన ముఖేష్ అంబానీ రిలయన్స్ గ్రూప్ ది.. అంతేకాదు రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతూ అంబానీ, పలువురు భారతీయులు అక్కడే ఉండి, ఇండియన్ ప్లేయర్స్ కి స్వాగతం పలుకుతున్నారు. ఇక మెడల్ సాధించి వచ్చినవాళ్లకి అక్కడే ఘన సత్కారాలు ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటూ సంతోష సంబరాలు చేస్తున్నారు.


Also Read: ఆమెనా? అతడా?.. పోటీ పడలేక వైదొలగిన మహిళా బాక్సర్

భారతీయ సంస్క్రతీ సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ ఇండియా హౌస్ స్టాల్ ని ఏర్పాటు చేశారు. అంతేకాదు ఇక్కడ భారతీయ వంటకాలన్నీ క్షణాల్లో సిద్ధమవుతాయి. భారతదేశంలోని ప్రముఖ చెఫ్ లు పలువురు ఇక్కడే ఉన్నారు. వీరితో పాటు సిబ్బంది కూడా ఉన్నారు. అంతకాలం నోరు కట్టుకుని కష్టపడే క్రీడాకారుల కోసం ఒలింపిక్ గ్రామంలో ఏర్పాటుచేసిన ఇండియా హౌస్ ఆలోచనపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి.

గేమ్ పూర్తయిన వెంటనే మన క్రీడాకారులు అక్కడికి వెళ్లి, వారితో ఆనందాలు, అనుభవాలు పంచుకుని, నచ్చింది తిని వస్తున్నారు. దీంతో క్రీడాకారులకి ఇండియన్ ఫుడ్డు లేదనే బాధ తప్పింది. మొత్తానికి సరభ్ జ్యోత్ సింగ్ అన్నమాటలతో ఇండియా హౌస్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. నెట్టింట వైరల్ గా మారింది.

Related News

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Big Stories

×