EPAPER
Kirrak Couples Episode 1

Pakistan: పాకిస్తాన్ కొంప ముంచిన అత్యాశ.. రూ.200 కోట్లు లాస్..?

Pakistan: పాకిస్తాన్ కొంప ముంచిన అత్యాశ.. రూ.200 కోట్లు లాస్..?

PCB To Suffer Heavy Losses Ahead Of Champions Trophy As Media Rights For PAK vs ENG Series: పాకిస్తాన్ క్రికెట్ జట్టు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన జట్టుగా పాకిస్థాన్ ఉండేది. కానీ ప్రస్తుతం పాకిస్తాన్ జట్టులో వివాదాలు, తగాదాలు అలాగే ఆర్థిక సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయి. పాకిస్తాన్ జట్టు సభ్యుల మధ్య సఖ్యత లేకుండా పోయింది. అయితే ఇలాంటి.. నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు బోర్డు … వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీకి ఇప్పటినుంచే రెడీ అవుతుంది.


 

ఈ మేరకు అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటోంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. చాంపియన్స్ ట్రోఫీ 2025 కు సంబంధించిన బడ్జెట్ పైన కూడా ఐసీసీ పాలకమండలి.. ఆమోదం కూడా తెలిపింది. దీంతో.. ఈ టోర్నీని సక్సెస్ చేసేందుకు… ముందుకు సాగుతోంది పాకిస్తాన్. అయితే ఇలాంటి నేపథ్యంలో.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు 200 కోట్ల నష్టం వాటిల్లే ప్రమాదం వచ్చింది. అతి త్వరలోనే పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మూడు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది.


PCB To Suffer Heavy Losses Ahead Of Champions Trophy As Media Rights For PAK vs ENG Series

ఈ టోర్నీ పాకిస్తాన్ దేశంలోనే జరగనుంది. అక్టోబర్ 7వ తేదీ నుంచి ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. దీని కోసం 17 మందితో అక్టోబర్ మాసంలో ఇంగ్లాండ్ జట్టు పాకిస్తాన్ బయలుదేరుతుంది. అయితే ఈ టోర్నమెంట్ నేపథ్యంలో… మీడియా హక్కులను కొనుగోలు చేసేందుకు ఎవరు ముందుకు రావడం లేదట. ఈ సిరీస్ మీడియా హక్కులు… ఎవరు కొనుగోలు చేయకపోతే.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దాదాపు 200 కోట్ల చవిచూసే ఛాన్స్ ఉందని సమాచారం. PAK vs ENG Series

Also Read: IPL 2025: ఐపీఎల్‌ జట్లకు BCCI గుడ్‌ న్యూస్‌..తెరపైకి కొత్త 4+2 రిటెన్షన్ పాల‌సీ…?

ప్రస్తుతం అయితే.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మీడియా హక్కుల కోసం మూడు సంవత్సరాలకు గాను..డీలింగ్ మాట్లాడుకునేలా చర్యలు తీసుకుంటుంది. ఈ మూడు సంవత్సరాలకు గాను దాదాపు 200 కోట్లు డిమాండ్ చేస్తుంది అంట పాకిస్తాన్ బోర్డు. అయితే 200 కోట్లు తాము ఇవ్వలేమని కొన్ని సంస్థలు చెబుతున్నాయట. అదే సమయంలో 4.1 మిలియన్లకు… పాకిస్తాన్ మీడియా హక్కులను కొనుగోలు చేస్తామని ఒక కంపెనీ వచ్చిందట.

Also Read: IPL 2025: దరిద్రం అంటే ఇదే…మరో100 మంది కెప్టెన్లు వచ్చినా RCB రాత మారదు..?

మరో విదేశీ కంపెనీ 7.1 మిలియన్ ఆఫర్ చేసిందని సమాచారం. అయితే దీనిపై పాకిస్తాన్ బోర్డు ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం. దీనిపైన నిర్ణయం తీసుకుంటే… పాకిస్తాన్ టీం బోర్డు బయటపడుతుంది. లేకపోతే అప్పుల్లో కూరుకుపోవడం గ్యారంటీ. ఇది ఇలా ఉండగా.. పాకిస్తాన్ దేశంలో ఛాంపియన్ ట్రోఫీ 2025 జరిగితే… తాము రాబోమని ఇప్పటికీ ఇండియా ప్రకటించింది. వచ్చి తీరాల్సిందేనని.. పాకిస్తాన్ అంటోంది. త్వరలోనే ఐసీసీ చైర్మన్గా జైశా బాధ్యతలు తీసుకోనున్నారు. దీనిపై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Related News

IPL 2025: దరిద్రం అంటే ఇదే…మరో100 మంది కెప్టెన్లు వచ్చినా RCB రాత మారదు..?

Telugu Celebrity League: వెండితెర, బుల్లితెర స్టార్స్ తో క్రికెట్ లీగ్.. హైదరాబాదీలకు పండుగే..

IPL 2025: ఐపీఎల్‌ జట్లకు BCCI గుడ్‌ న్యూస్‌..తెరపైకి కొత్త 4+2 రిటెన్షన్ పాల‌సీ…?

Chess Olympiad 2024: నిరీక్షణకు తెర.. చెస్ ఛాంపియన్ షిప్ లో అదరగొట్టిన ఇండియా..

WTC Final: బంగ్లాపై గెలిచిన టీమిండియాకు కొత్త టెన్షన్‌.. WTC ఫైనల్ చేరాలంటే ఇది చేయాల్సిందే?

India vs Bangladesh: టీమిండియా అదిరిపోయే విక్టర్‌..280 పరుగుల తేడాతో విక్టరీ !

Big Stories

×