EPAPER
Kirrak Couples Episode 1

PBKS vs KKR: వాన పడింది.. పంజాబ్ బోణీ కొట్టింది..

PBKS vs KKR: వాన పడింది.. పంజాబ్ బోణీ కొట్టింది..
PBKSvsKKR ipl match result

PBKS vs KKR: పంజాబ్ దూకుడుగా ఆడింది. ఛేజింగ్‌లో కోల్‌కతా తడబడింది. ఈలోగా వర్షం కురిసింది. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం పంజాబ్‌నే విజయం వరించింది. 7 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై గెలిచి.. ఐపీఎల్‌-16 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌ శుభారంభం చేసింది.


టాస్ ఓడి, తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోరు చేసింది. భానుక రాజపక్స 32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 50 పరుగులు చేశాడు. శిఖర్‌ ధావన్‌ (40; 29 బంతుల్లో 6 ఫోర్లు) కూడా రాణించాడు. జితేశ్ శర్మ (21), ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (23) ఫర్వాలేదనిపించారు. చివర్లో సామ్‌ కరన్‌ (26*; 17 బంతుల్లో) చెలరేగిపోవడంతో.. పంజాబ్ జట్టు 191 పరుగుల భారీ స్కోర్ చేసింది. కోల్‌కతా బౌలర్లలో టిమ్‌ సౌథీ రెండు వికెట్లు తీశాడు. ఉమేశ్ యాదవ్‌, వరుణ్ చక్రవర్తి, సునీల్‌ నరైన్‌ ఒక్కో వికెట్ పడగొట్టారు.

టార్గెట్ భారీగానే ఉంది. అయినా కోల్‌కతా టీమ్‌లో దూకుడు కొరవడింది. రెండో ఓవర్‌లోనే రెండు వికెట్లు పడటంతో నైట్‌రైడర్స్ డిఫెన్స్‌లో పడ్డారు. అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లో మన్‌దీప్‌ సింగ్ (2), అనుకుల్‌ రాయ్‌ (4) వెంటవెంటనే ఔటయ్యారు. రెహ్మనుల్లా (22) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఆండ్రూ రస్సెల్ (35; 19 బంతుల్లో) రాణించాడు. వెంకటేశ్ అయ్యర్‌ (34), నితీశ్ రాణా (24) తమవంతు స్కోర్ పెంచారు. 16 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 146 పరుగులు చేసింది పంజాబ్. అంతలోనే భారీ వర్షం కురవడంతో ఆట నిలిచిపోయింది. డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం పంజాబ్‌ 7 పరుగులతో గెలిచినట్టు ప్రకటించారు. పంజాబ్‌ బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్ మూడు వికెట్లు.. సామ్‌ కరన్‌, నాథన్‌ ఎల్లిస్‌, సికిందర్‌ రజా, రాహుల్ చాహర్‌ తలా ఒక వికెట్ పడగొట్టారు.


Related News

Ind vs Ban Test: ఒంటిచేత్తో క్యాచ్‌ అందుకున్న రోహిత్‌.. చెవులు పట్టుకున్న పంత్ !

IND vs BAN 2nd Test: బుమ్రా మ్యాజిక్‌.. కుప్పకూలిన బంగ్లాదేశ్..!

IPL 2025: రోహిత్‌ సంచలన నిర్ణయం..అంబానీకి కోట్లల్లో నష్టం ?

IPL 2025: ధోని కోసం స్పెషల్‌ రూల్స్‌…చెన్నైకి లాభం ఉంటుందా ?

Warning To Pakistan Cricketers: ‘ఫిట్‌నెస్ లేకపోతే కాంట్రాక్ట్ రద్దు’.. పాకిస్తాన్ క్రికెటర్లకు పిసిబి గట్టి వార్నింగ్..

RP Singh: RCB ఓ చెత్త టీం, కుక్క కూడా పట్టించుకోదు !

IPL mega auction: ‘రిటెయిన్డ్ ప్లేయర్స్ లిస్ట్ ప్రకటించాలి’.. ఫ్రాంచైజీలకు డెడ్ లైన్ విధించిన బిసిసిఐ..

Big Stories

×