EPAPER

PBKS vs GT, IPL 2024: చచ్చీ చెడి గెలిచిన గుజరాత్.. పంజాబ్ ఖాతాలో మరో ఓటమి..

PBKS vs GT, IPL 2024: చచ్చీ చెడి గెలిచిన గుజరాత్.. పంజాబ్ ఖాతాలో మరో ఓటమి..

Punjab Kings vs Gujarat Titans, IPL 2024: టార్గెట్ చూస్తే చాలా తక్కువ. నిజానికి మరొక జట్టు అయితే, 15 ఓవర్లలో ఛేదించి రన్ రేట్ మెరుగుపరుచుకునేది. కానీ గుజరాత్ ఈ లక్ష్యాన్ని ఛేదించడానికి నానాపాట్లు పడింది. 19 ఓవర్లు ఆడింది. 7 వికెట్లు కోల్పోయి చచ్చీ చెడి గెలిచింది.


పంజాబ్ వర్సెస్ గుజరాత్ మధ్య మొహలీలో జరిగిన మ్యాచ్ చప్పగా సాగింది. రెండు జట్ల మధ్య పోరాట పటిమ పోయినట్టే కనిపించింది. టాస్ గెలిచిన పంజాబ్ మొదట బ్యాటింగ్ తీసుకుని 20 ఓవర్లలో 142 పరుగులకి ఆలౌట్ అయ్యింది. లక్ష్య ఛేదనలో గుజరాత్ 19.1 ఓవర్లలో 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

143 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ టైటాన్స్ కి ఎప్పటిలా శుభారంభం దక్కలేదు. ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (11) త్వరగా అవుట్ అయిపోయాడు. తర్వాత కెప్టెన్ గిల్ కాసేపు పోరాడాడు. 29 బంతుల్లో 5 ఫోర్లతో 35 పరుగులు చేశాడు.


సాయి సుదర్శన్ వన్డే తరహాలో ఆడాడు. 34 బంతుల్లో 31 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. డేవిడ్ మిల్లర్ (4) మళ్లీ ఫెయిల్ అయ్యాడు. ఒమర్ జాయ్ (13) , షారూఖ్ ఖాన్  (8), రషీద్ ఖాన్ (3) పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ రాహుల్ తెవాటియా మాత్రం తెగించి ఆడి గుజరాత్ కి విజయాన్ని అందించాడు.
18 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 36 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

పంజాబ్ బౌలింగులో హర్షల్ పటేల్ 3, లివింగ్ స్టోన్ 2, శామ్ కర్రన్ 1, అర్షదీప్ 1 వికెట్ పడగొట్టారు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు కొంత పర్వాలేదు. 5.3 ఓవర్లలో 52 పరుగులు చేశారు. తొలి వికెట్ అక్కడ పడింది. తర్వాత చూస్తే 67 పరుగులకి 3 వికెట్లు, 78 కి 4 వికెట్లు, 86 పరుగులకి వచ్చేసరికి 5 వికెట్లు ఇలా సీరియల్ గా పడిపోతూనే ఉన్నాయి. మొత్తానికి 142 వచ్చేసరికి ఆలౌట్ అయిపోయారు. ప్రభసిమ్రాన్ సింగ్ (35), కెప్టెన్ శ్యామ్ కర్రన్ (20), హర్ ప్రీత్ బ్రార్ (29) వీరే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు.

Also Read: “భయ్యా ఈ బ్యాట్ విరిగింది.. ఇంకో బ్యాట్ ఇయ్యవా”

గుజరాత్ బౌలింగులో మోహిత్ శర్మ 2, సాయి కిశోర్ 4, నూర్ అహ్మద్ 2, రషీద్ ఖాన్ 1 వికెట్ పడగొట్టారు.

ఈ గెలుపుతో గుజరాత్ టైటాన్స్ 6వ స్థానంలో ఉంది. పంజాబ్ 9వ స్థానానికి పడిపోయింది.

Tags

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×