EPAPER

IPL 2025 Retention: ప్రీతిజింటా ప్లాన్‌ అదుర్స్‌..పంజాబ్‌ లోకి ముగ్గురు కెప్టెన్స్‌ ?

IPL 2025 Retention: ప్రీతిజింటా ప్లాన్‌ అదుర్స్‌..పంజాబ్‌ లోకి ముగ్గురు కెప్టెన్స్‌ ?

IPL 2025 Retention: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ( IPL 2025) టోర్నమెంటుకు సంబంధించిన రిటెన్షన్ ( IPL 2025 Retention) ప్రక్రియ పూర్తయింది. అక్టోబర్ 31వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు ఐపీఎల్ టోర్నమెంట్ లో ఉన్న పది జట్లు…. ఏ ప్లేయర్లను అంటిపెట్టుకోవాలి ? ఈ ప్లేయర్లను వదిలేయాలి? అనే పూర్తి వివరాలను… ఐపీఎల్ నిర్వాహకులకు అప్పగించాయి. ఈ తరుణంలోనే… ఒక్కో జట్టు ఐదు నుంచి ఆరుగురు ప్లేయర్లను సెలెక్ట్ చేసుకుంది. పంజాబ్ జట్టు మాత్రం ఇద్దరిని మాత్రమే రిటర్న్ చేసుకోవడం జరిగింది.


PBKS Remaining Purse in IPL 2025

దీంతో పంజాబ్ జట్టు పర్సు వాల్యూ విపరీతంగా పెరిగిపోయింది. అంతేకాదు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటు వేలం లో పంజాబ్ వద్ద ఎక్కువగా డబ్బులు ఉన్నాయి. దాదాపు 110.5 కోట్లు పర్స్ వ్యాల్యును కలిగి ఉంది పంజాబ్ కింగ్స్. ఈ డబ్బుతో మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ బరిలోకి దిగబోతుంది. అంతేకాకుండా పంజాబ్ కింగ్స్ కు మరో 4 ఆర్టీఎం కార్డులు ఉన్నాయి. అంటే ఈ లెక్కన పంజాబ్ కింగ్స్ జట్టు… ప్లేయర్లపై కాసుల వర్షం కురిపించే ఛాన్స్ ఉంది. కీలక ప్లేయర్లను…వేలంలో కొనుగోలు చేసేందుకు… ఛాన్స్ కూడా ఉంటుంది. ప్రస్తుతం.. వేలంలో రిషబ్ పంత్ ( Rishabh Pant), కేఎల్ రాహుల్ ( Kl Rahul ), శ్రేయస్ అయ్యర్ ( Shreyas Iyer) లాంటి టీమ్ ఇండియా ప్లేయర్లు ఉన్నారు.ఈ ముగ్గురు ప్లేయర్లు ఐపీఎల్ కెప్టెన్ గా కూడా మొన్నటి వరకు కొనసాగారు.

Also Read: IPL 2025 Retention: రింకూకు 2000 శాతం రేట్‌..ఐపీఎల్‌ లో ఈ ప్లేయర్లకు పంట పడింది !


అయితే ఈ ముగ్గురు ప్లేయర్లు వేలంలోకి వస్తే ఒక్కో ప్లేయర్కు 30 కోట్ల ధర పలికే అవకాశాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంటే ఈ లెక్కన పంజాబ్ కింగ్స్ జట్టు…తమ డబ్బుతో..ఈ ముగ్గురు ప్లేయర్లను కొనుగోలు చేయవచ్చు. అందుకే ప్రీతి జింటా ( Preeti Zinta)… కేవలం ఇద్దరు ప్లేయర్లను మాత్రమే రిటైన్ చేసుకొని…తెలివిగా ఆలోచించిందని చెబుతున్నారు. మరి వేలంలో ఈ ముగ్గురు ప్లేయర్లను పంజాబ్ కింగ్స్ కొంటుందా లేదా అనేది చూడాలి. ఇక అదే సమయంలో పంజాబ్ కిమ్స్ తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వద్ద 83 కోట్లు ఉన్నాయి. మూడు ఆర్టీఎం కార్డులు కూడా వినియోగించుకోవచ్చు. అంతేకాకుండా ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద 76.25 కోట్లు ఉన్నాయి. ఈ జట్టుకు రెండు ఆర్టీఎం కార్డులు ఉన్నాయి. ఢిల్లీ తర్వాత లక్నో సూపర్ జెంట్స్ వద్ద 69 కోట్లు, ఒక ఆర్టీఎం కార్డు ఉంది.

గుజరాత్ టైటాన్స్ జట్టు ఆ తర్వాత ప్లేస్ లో ఉంది.గుజరాత్ టైటాన్స్ చేతిలో 69 కోట్లు ఉన్నాయి.వీళ్లకు ఒక ఆర్టీఎం కార్డు కూడా ఉంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఏకంగా 55 కోట్లు ఉన్నాయి. వీళ్లకు ఆర్టీఎం కార్డు లేదు. కోల్కత్తా నైట్ రైడర్స్ జట్టుకు 51 కోట్లు ఉన్నాయి. ఒక ఆర్టీఎం కార్డు కూడా కేకేఆర్ కలిగి ఉంది.అదే సమయంలో ముంబై ఇండియన్స్ జట్టుకు 45 కోట్లతో పాటు ఒక ఆర్టీఎం కార్డు ఉంది. ముంబై ఇండియన్స్ జట్టు తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు నిలిచింది. మన హైదరాబాద్ జట్టు చేతులో 45 కోట్లతో పాటు ఒక ఆర్టిఏ కార్డు కూడా ఉంది.చివరగా రాజస్థాన్ రాయల్స్ ఉండడం జరిగింది. వీళ్ళ చేతిలో 41 కోట్లు మాత్రమే ఉన్నాయి. అంతేకాకుండా రాజస్థాన్ చేతిలో ఒక్క RTM కార్డు కూడా లేదు.

Related News

IPL 2025 Auction: ఐపీఎల్ మెగా వేలంపై బిగ్ అప్డేట్.. తేదీలు, వేదిక ఖరారు!

Wriddhiman Saha: రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా వికెట్ కీపర్ సాహా

WTC Final: WTC ఫైనల్ కు వెళ్లే ఛాన్స్ టీమిండియాకు ఉందా…? ఇంకా ఎన్ని మ్యాచ్ లు గెలవాలి?

IND vs NZ 3rd Test: పరువు పాయె.. మూడో టెస్టులో టీమిండియా దారుణ ఓటమి

IND vs NZ 3rd Test: రెండో ఇన్నింగ్స్‌లో 174 పరుగులకు కివీస్ ఆలౌట్..టీమిండియా లక్ష్యం ఎంతంటే ?

IPL 2025 Retentions: ఇంగ్లాండ్‌ ప్లేయర్లపై బ్యాన్‌..ఇక ఐపీఎల్‌ లోకి నో ఎంట్రీ ?

IND vs NZ 3rd Test: గిల్ సెంచరీ మిస్‌..263 పరుగులకే టీమిండియా ఆలౌట్ !

Big Stories

×