EPAPER

Pat Cummins: పెళ్లి కాకముందే తండ్రైన మంచి ఆటగాడు.. ఇప్పుడు మళ్లీ..

Pat Cummins: పెళ్లి కాకముందే తండ్రైన మంచి ఆటగాడు.. ఇప్పుడు మళ్లీ..

Pat cummins set to become father again: ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ మరోసారి తండ్రి కాబోతున్నాడు. అతని సతీమణి బెకీ బోస్టన్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ప్రస్తావించింది. 2020లో బెకీ – కమిన్స్ కు నిశ్చితార్థం జరిగింది. 2021లో అల్బీ అనే కుమారుడు జన్మించాడు. ఆ తరువాత 2022 ఆగస్టులో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.


అయితే, బెకీ తన కుమారుడితో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో ఈ విషయాన్ని పేర్కొన్నది. ‘మీకో శుభవార్త చెప్పాలనుకుంటున్నాం. అదేమంటే.. నేను, కమిన్స్ మళ్లీ తల్లిదండ్రులం కాబోతున్నాం. ఈ వార్తను మీతో పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మా జీవితాలను ఇంకొంచెం క్రేజీగా మార్చుటకు వస్తున్న బేబీ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం’ అంటూ ఆమె అందులో పేర్కొన్నది.

Also Read: సనత్ జయసూర్య హైప్‌ను తగ్గించడంలో మీడియా ప్రభావం


ఆటలో దూకుడు పెంచాలంటే నాకు ఇంకొంచెం విరామం కావాలి – కమిన్స్

కాగా, ఈ ఏడాది చివరలో ఇండియా టీమ్ తో జరిగే టెస్టు సిరీస్ లో పాల్గొనే ముందు కమిన్స్ 8 వారాల పాటు విరామం తీసుకున్నాడు. అయితే, గత ఒకటిన్నరేళ్ల నుంచి విరామం లేకుండా ఆడిన తాను, తిరిగి దూకుడుగా ఆడాలంటే ఇంకొంచెం సమయం అవసరమన్నాడు. చేసే పనిలో కాస్త విరామం తీసుకుని మళ్లీ బరిలోకి దిగితే మానసికంగానూ, శారీరకంగానూ బలంగా తయారవుతామంటూ తన విరామం వెనుక ఉన్న ఉద్దేశాన్ని పేర్కొన్నాడు.

Also Read: యూవీ వరల్డ్ రికార్డు బద్దలు.. ఒకే ఓవర్‌లో 39 రన్స్ బాదిన విస్సెర్

ఇదిలా ఉంటే.. ’18 నెలల క్రితం జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ నుంచి ఇప్పటివరకు కూడా నాన్ స్టాఫ్ గా బౌలింగ్ చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు తీసుకుంటున్న విరామంతో 8 వారాలు పూర్తిగా బౌలింగ్ నుంచి దూరంగా ఉంటాను. దీంతో శరీరం కుదుటపడుతది. అప్పుడు ఎక్కువసేపు బౌలింగ్ చేసేందుకు శరీరం, ఫిట్ నెస్ ఉంటాయి. పైగా గాయాల బారినపడే అవకాశం కూడా అంతంగా ఉండదు’ అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×