EPAPER

Olympics closing ceremony: ఘనంగా ముగిసిన పారిస్ ఒలింపిక్స్, 2028 లాస్ ఏంజెలెస్‌లో..

Olympics closing ceremony: ఘనంగా ముగిసిన పారిస్ ఒలింపిక్స్, 2028 లాస్ ఏంజెలెస్‌లో..

Olympics closing ceremony: 17 రోజులపాటు క్రీడా అభిమానులను అలకరించిన పారిస్ ఒలింపిక్స్ ఘనంగా ముగిశాయి. దాదాపు 205 దేశాలకు చెందిన 10 వేల మంది ఆటగాళ్లు హాజరయ్యారు.


ఈ గేమ్స్‌లో 40 బంగారు పతకాలు సహా మొత్తం 126 పతకాలతో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది అమెరికా. దాని తర్వాత ప్లేస్ 91 పతకాలతో చైనా దక్కించుకుంది. ఇక భారత్ ఈసారి 71వ స్థానానికి పరిమితమైంది. గతంలో భారత్ 48వ స్థానం సాధించిన విషయం తెల్సిందే.

 


 paris Olympics closing ceremony live
paris Olympics closing ceremony live

పారిస్ ఒలింపిక్స్ ఆరంభం వేడుకలు సెన్ నది వేదికగా జరగ్గా, ముగింపు మాత్రం స్టేడ్ డి ఫ్రాన్స్ స్టేడియం లో ముగిశాయి. దాదాపు 10 వేల కళాకారులు డ్యాన్స్, సంగీతం ఇలా రకరకాల విభాగాల్లో తమ ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించారు.

paris Olympics closing ceremony updates
paris Olympics closing ceremony updates

ఫ్రాన్స్ స్మిమ్మర్ లియోన్ మర్చండ్ క్రీడా జ్యోతిని వేదిక వద్దకు తీసుకురాగా, ఆ దేశ అధ్యక్షుడు ఇమాన్యు యెల్ మాక్రాన్, ఐఓసీ ఛైర్మన్ థామస్ బాక్ వేదికపై వచ్చారు. ఫ్రాన్స్ జాతీయ గీతాన్ని వినిపించిన తర్వాత అన్ని దేశాల ఫ్లాగ్ బేరర్లు తమ జాతీయ పతకాలతో స్టేడియంలోకి అడుగుపెట్టారు.

paris Olympics closing ceremony highlights
paris Olympics closing ceremony highlights

భారత్ తరపున షూటర్ మనుబాకర్, హాకీ దిగ్గజం పీఆర్ శ్రీజేష్ పతకధారులుగా వ్యవహరించారు. భారీ ఎత్తున తరలివచ్చిన ప్రేక్షకులకు అభివాదం తెలుపుతూ ఆటగాళ్లు వీడ్కోలు పలికారు.

paris Olympics closing ceremony
paris Olympics closing ceremony

నిర్వాహకులు ఒలింపిక్స్ ఫ్లాగ్‌ను లాస్ ఏంజెల్స్ స్పోర్ట్స్ ఛైర్‌పర్సన్ కేసీ వాసర్‌మన్‌కు అందజేశారు. 2028లో లాస్ ఏంజెల్స్‌లో పోటీలు జరగనున్నాయి. పారిస్ ఒలింపిక్స్‌లో చైనా స్మిమ్మర్ జాన్ యు ఫై అత్యధికంగా ఆరు పతకాలు గెలిచిన అథ్లెట్‌గా నిలిచింది. ఆమె ఒక రజతం, ఐదు కాంస్య పతకాలు సాధించింది.

paris Olympics closing ceremony highlights
paris Olympics closing ceremony highlights

పారిస్ ఒలింపిక్స్ ఈసారి ఇండియాకు కలిసిరాలేదనే చెప్పాలి. ఎందుకంటే ఆరడజను పతకాలు  చేజారాయి. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలిచినా పతకాలు సాధించడంలో మన రాత మారలేదనే చెప్పాలి. సౌకర్యాల మాట పక్కనబెడితే, ఆటగాళ్లు కూడా ఇందుకు బాధ్యత వహించాల్సి ఉంటుందనేది కొందరి అభిప్రాయం.

 

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×