EPAPER

Paralympics 2024: భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. 29కి చేరిన పతకాల సంఖ్య

Paralympics 2024: భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. 29కి చేరిన పతకాల సంఖ్య

Navdeep wins Paris 2024 Paralympics javelin throw gold: పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్41 కేటగరి ఫైనల్ మ్యాచ్‌లో నవదీప్ సింగ్ స్వర్ణం దక్కించుకున్నాడు. ఈ మేరకు నవదీప్.. 47.32 మీటర్ల దూరం బల్లెం విసిరి విజేతగా నిలిచారు.


అయితే, తొలుత ఇరాన్ అథ్లెట్ జావెలిన్ త్రో ఎఫ్41లో స్వర్ణం దక్కించుకున్నాడు. కానీ అనూహ్యంగా ఇరాన్ అథ్లెట్‌పై అనర్హత వేటు పడడంతో స్వర్ణం నవదీప్ సొంతమైంది. ఇరాన్ అథ్లెట్ జావెలిన్ త్రోయర్ సదేఘ్ 47.64 మీరట్లు విసిరినా నిర్వాహకులు ఆయనను డిస్ క్వాలిఫై చేయడంతో రెండో స్థానంలో నిలిచిన నవదీప్‌ను గోల్డ్ మెడల్ విజేతగా నిలిచారు. ఈ మేరకు నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు.

భారత అథ్లెట్ నవదీప్ తొలుత రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సాధించాడు. కానీ అనూహ్యంగా ఇరాన్ అథ్లెట్‌పై అనర్హత వేటు పడడంతో స్వర్ణం నవదీప్ సొంతమైంది. దీంతో జావెలిన్ త్రో ఎఫ్41లో స్వర్ణం సాధించిన ఏకైక భారత అథ్లెట్‌గా నవదీప్ అరుదైన ఘనత సాధించాడు.


కాగా, అంతకుముందు మహిళల 200 మీటర్ల టీ12 విభాగంలో సిమ్రన్ కాంస్యం సాధించింది. దీంతో భారత్ ఖాతాలో ఇప్పటివరకు మొత్తం పతకాల సంఖ్య 29కి చేరింది.

Related News

Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ.. ఇండియా ‘ఏ’ టీం తొలి విజయం

Neeraj Chopra Diamond League: బ్రసెల్స్ డైమండ్ లీగ్ లో నీరజ్ చోప్రాకు రెండో స్థానం.. 2024లో ఏకంగా నాలుగుసార్లు టైటిల్ మిస్!

Matthew Short: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా ఓపెనర్..13ఏళ్ల రికార్డు బ్రేక్

Virat Kohli: కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ షురూ..!

India vs Bangladesh 1st Test: ఒక్కటి గెలిస్తే చాలు.. 92 ఏళ్ల రికార్డు బ్రేక్

MS Dhoni: ధోనీ.. ఓసారి వాటర్ బాటిల్ తన్నేశాడు.. తెలుసా? : బద్రీనాథ్

Piyush Chawla: గంభీర్‌కి.. కొహ్లీ రికార్డులన్నీ తెలుసు: చావ్లా

Big Stories

×