EPAPER

Olympic 2024: భారత అథ్లెట్ నీరజ్ చోప్రాపై పాక్ ఆటగాడు సంచలన వ్యాఖ్యలు

Olympic 2024: భారత అథ్లెట్ నీరజ్ చోప్రాపై పాక్ ఆటగాడు సంచలన వ్యాఖ్యలు

Pakistan Player On Athlete Neeraj Chopra(Sports news in telugu): పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ గేమ్స్ 2024లో భారత్ మరో పతకాన్ని దక్కించుకుంది. పురుషుల జావెలిన్ త్రో కేటగిరీలో రజతాన్ని కైవసం చేసుకుంది. ఈ విభాగంలో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచి వెండి పతకాన్ని దక్కించుకున్నాడు.ఈ విభాగంలో బంగారు పతకం అనుకున్నప్పటికీ అది కుదరలేదు. దాంతో కాంస్యంతో సరిపెట్టుకున్నాడు నీరజ్. నిన్న అర్థరాత్రి జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఫైనల్స్‌లో పాకిస్తాన్ త్రోయర్ అర్షద్ నదీం సరికొత్త హిస్టరీని క్రియేట్ చేశాడు. ఆద్యాంతం ఉత్కంఠగా జరిగిన గేమ్‌లో 90 మీటర్లకు పైగా బల్లేన్ని విసిరి తన సత్తా చాటాడు. ఇక నదీం సంధించిన ఈటె 92 మీటర్లకు పైగా ఈ బల్లెం దూసుకెళ్లి అనుకున్న మార్క్‌ కంటే చాలా దూరంలో పడి సరికొత్త రికార్డు నమోదు అయింది. ఇంకో హైలైట్ ఏంటంటే..ఒలింపిక్స్‌లో అతనికి ఇదే తొలి బంగారు పతకం కావడం విశేషం. జావెలిన్ త్రోలో ఇది ఆల్ టైమ్ రికార్డ్‌గా నమోదు అయింది.


ఈ గేమ్ కేటగిరీలో నీరజ్ చోప్రా 89 మీటర్ల దూరం పాటు బల్లెం విసిరి రెండో స్థానంలో నిలిచాడు. గ్రెనెడాకు చెందిన అండర్సన్ పీటర్ 88 మీటర్ల దూరం ఈటెను సంధించి కాంస్య పతకాన్ని అందుకున్నాడు. ఒలింపిక్స్ చరిత్రలోనే వరుసగా రెండు పతకాలను సాధించిన తొలి భారత అథ్లెట్‌గా నీరజ్ చోప్రా చరిత్రకెక్కాడు. ఇక గతంలో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో అతను గోల్డ్ మెడల్ అందుకున్న మనందరికి తెలిసిందే.క్వాలిఫికేషన్ రౌండ్‌లో ఈటెను అందరి కన్నా ఎక్కువ దూరం విసిరిన నీరజ్ చోప్రా అంచనాలు పెంచాడు. ఫైనల్‌లో కొంచెం తడబడిన నీరజ్ చోప్రా,తొలి ప్రయత్నంలో ఫౌల్ చేశాడు. రెండో ప్రయత్నంలో 89 మీటర్ల దూరం ఈటెను విసిరి తన సత్తాను చాటడంతో అతడికి రజత పతకం దక్కింది. ఆ తరువాతి నాలుగు ప్రయత్నాల్లో ఆ స్థాయిలో బల్లేన్ని ఆశించినంతగా రాణించలేకపోయాడు.అదే సమయంలో అర్షద్ నదీమ్ విజృంభించి ఏకంగా 92 మీటర్ల దూరం విసిరి గోల్డ్ మెడల్‌ను దక్కించుకున్నాడు.

Also Read: అలా జరిగినందుకు చాలా బాధగా ఉందన్న నీరజ్ చోప్రా, ఎందుకంటే…!


క్వాలిఫికేషన్‌ రౌండ్స్‌లో 89 మీటర్లు కూడా విసరని పాక్ ఆటగాడు నదీమ్.. ఆ తరువాత ఫైనల్లో మాత్రం కమ్ బ్యాక్ అయ్యాడు. రెండుసార్లు ఈటెను 90 మీటర్ల కంటే ఎక్కువ దూరం విసిరాడు.మెడల్ అందుకున్న తరువాత పోడియం వద్ద నీరజ్ చోప్రాతో కలిసి దిగిన ఫొటోను అర్షద్ నదీం పేరుతో సోషల్‌మీడియా వేదికగా షేర్ అయింది. అంతేకాకుండా ఈ పోస్ట్‌లో తాను ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మనం అందరం సహజ స్నేహితులం అనే క్యాప్షన్‌ను దానికి జోడించాడు. భారత్, పాకిస్తాన్ జాతీయ పతాకాలకు లవ్ సింబల్స్‌ కలిపి పోస్ట్ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పొరుగుదేశాలైన వీరికి ఉన్నటువంటి ప్రేమ ఆఫ్యాయతలను చూసి మిగతావారంతా షాక్ అవుతున్నారు. అంతేకాదు వీరిద్దరి లాగా అందరూ కలిసిమెలిసి ఉండాలంటూ రకరకాల కామెంట్లతో ముంచెత్తుతున్నారు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×