EPAPER

Pakistan vs South Africa  : పోరాడి ఓడిన పాకిస్తాన్.. ఉత్కంఠ పోరులో దక్షిణాఫ్రికా గెలుపు..

Pakistan vs South Africa  : పోరాడి ఓడిన పాకిస్తాన్.. ఉత్కంఠ పోరులో దక్షిణాఫ్రికా గెలుపు..
PAK VS SA

Pakistan vs South Africa  : వన్డే వరల్డ్ కప్ 2023లో సెమీస్ అవకాశాలను పాకిస్తాన్ మరింత సంక్లిష్టం చేసుకుంది. గెలవక తప్పని మ్యాచ్ లో సౌతాఫ్రికాతో చివరి వరకు పోరాడి ఓడింది. 46.4 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కనీసం పూర్తి ఓవర్లయినా ఆడి ఉంటే లక్ష్యం కొంచెం పెరిగేది. సౌతాఫ్రికాను నిలువరించేవారు. అలా జరగకపోవడంతో లక్ష్య చేధనలో సౌతాఫ్రికా 9 వికెట్ల నష్టానికి పడుతూ లేస్తూ విజయం సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది.


టాస్ గెలిచిన పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ తీసుకుంది. కానీ కెప్టెన్ బాబర్ అజామ్ నమ్మకాన్ని ఓపెనర్లు నిలబెట్టలేకపోయారు. మొదట్లో అబ్దుల్లా షఫీక్ (9), ఇమామ్ (12) జాగ్రత్తగానే ఆడుతున్నట్టు కనిపించారు గానీ…జాన్సన్ బౌలింగ్ లోనే ఇద్దరూ అయిపోయారు. అప్పటికి 6.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 38 పరుగులతో ఎదురీత మొదలెట్టింది.

మరోవైపు నుంచి కెప్టెన్ బాబర్ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. వరల్డ్ కప్ లో సరిగ్గా ప్రదర్శన ఇవ్వని రిజ్వాన్ ఆదుకుంటాడని అనుకున్నారు. వచ్చీ రాగానే ఎడా పెడా కొట్టడం మొదలెట్టాడు. 31 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు. జట్టు స్కోరు 86 పరుగుల వద్ద 3వ వికెట్టుగా తను వెనుతిరిగాడు.


 ఈ దశలో ఇఫ్తికార్ అహ్మద్ (21) అయిపోయాడు. అప్పటికి స్కోర్ 4 వికెట్ల నష్టానికి 129 పరుగులతో కష్టాల కడలిలో ఈదడం మొదలుపెట్టింది. ఈ దశలో షాద్ షకీల్ (52) కెప్టెన్ కి అండగా నిలిచాడు. అర్థశతకం సాధించాడు. బాబర్ కూడా తన వంతుగా 50  పరుగులు చేశాడు. అంతా బాగుందని అనుకునే లోపు…27.5 ఓవర్ దగ్గర కెప్టెన్ బాబర్ అనూహ్యంగా అవుట్ అయ్యాడు. 5వ వికెట్టుగా వెనుతిరిగాడు.

తర్వాత షాదబ్ ఖాన్ (43) కొంతసేపు వికెట్ల పతనాన్ని నిలువరించాడు. 225 పరుగుల దగ్గర అతను అవుట్ అయ్యాడు. తర్వాత మిగిలిన బ్యాట్స్ మెన్ ఇలా వచ్చి ఎడాపెడా కొట్టి 270 పరుగులకు స్కోర్ బోర్డుని తీసుకువెళ్లి గబగబా ముగించేశారు. సౌతాఫ్రికా బౌలింగ్ లో  తబరైజ్ షంశి 4, జాన్సన్ 3, కొయిట్టీ 2, ఎంగిడి 1 వికెట్టు తీశారు.

తర్వాత ఛేజింగ్ కి వచ్చిన సౌతాఫ్రికా ఓపెనర్లు జాగ్రత్తగానే ఆడారు. బవుమా (28), డికాక్ (24) పరుగులు చేసి అవుట్ అయ్యారు. పాక్ బౌలర్లలో షహీన్, వాసిమ్ చెరొక వికెట్ తీసుకున్నారు. తర్వాత వాన్ డేర్ డసన్ (21) వచ్చాడు. తను పెద్దగా ప్రభావం చూపించకుండా ఉసామా మిర్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. వీళ్లంతా కలిసి 21.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేశారు. పాకిస్తాన్ తరహాలోనే వీరు నడుస్తున్నారు… కొంపదీసి పాక్ విజయం సాధిస్తుందా? అని చాలామంది అనుకున్నారు.

సెకండ్ డౌన్ లో సౌతాఫ్రికా జట్టులో కీలకంగా ఉన్న మార్ క్రమ్ క్రీజ్ లోకి వచ్చాడు. ఎప్పటిలాగానే బాగా ఆడుతూ 91 పరుగులు చేశాడు. ఇటువైపు వికెట్లు పడుతుంటే, అటువైపు అడ్డంగా నిలబడిపోయాడు. 9 పరుగుల దూరంలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. కానీ జట్టుని విజయతీరాలకు చేర్చడంలో తన పాత్ర పోషించాడు.

వరల్డ్ కప్ 2023లో భీకరంగా బ్యాటింగ్ చేస్తూ అన్ని జట్ల బౌలింగులను కకావికలం చేస్తున్న క్లాసెన్ (12)ను పాక్ బౌలర్లు త్వరగానే వెనక్కి పంపించారు. అయితే 33.1 ఓవర్ల వరకు మ్యాచ్ సౌతాఫ్రికా వైపే మొగ్గు చూపింది. వార్ వన్ సైడ్ అవుతుందని అంతా అనుకున్నారు. ఆ టైమ్ లో మిల్లర్ (29) వికెట్ పడింది. ఆ సమయానికి 5 వికెట్ల నష్టానికి సౌతాఫ్రికా 206 పరుగులతో పడుతూ లేస్తూ ముందుకు వెళుతోంది.

ఆ బ్రేక్ ని అందిపుచ్చుకున్న పాక్ బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్ ని  క్రీజు నుంచి కదలనివ్వలేదు. మొత్తానికి అలా క్రమం తప్పకుండా వికెట్లు తీసుకుంటూ వెళ్లారు. 41.1 ఓవర్ దగ్గరికి వచ్చేసరికి 8 వికెట్ల నష్టానికి 250 పరుగులతో… పరుగు పరుగుకి సౌతాఫ్రికా చెమటలు కక్కుతోంది.

ఇంకా 21 పరుగులు చేయాలి. రెండే వికెట్లు ఉన్నాయి. బాల్స్ చాలా ఉన్నాయి. అప్పుడు సౌతాఫ్రికా మరో వికెట్ పడింది. ఇంక అయిపోయింది.. పాకిస్తాన్ గెలుస్తుందని అనుకున్నారు. కెప్టెన్ బాబర్ ముఖం చూసి, పాకిస్తాన్ జట్టు దీనావస్థను చూసి పాపం గెలిస్తే బాగుండునని కొంతమంది క్రీడాభిమానులు  కూడా అనుకున్నారు. కానీ సౌతాఫ్రికా పడుతూ లేస్తూ విజయం సాధించింది. టేబుల్ టాప్ లోకి వెళ్లింది.

Related News

India vs Bangladesh Test Match: అదరగొట్టిన భారత్.. 149కే బంగ్లా ఆలౌట్

IND vs BAN 1st Test: కపిల్, ధోనీ సరసన.. అశ్విన్

India vs Bangladesh 1st Test: భారత్ 376 ఆలౌట్.. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన భారత్..

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Big Stories

×