EPAPER
Kirrak Couples Episode 1

Babar Azam : వరల్డ్ కప్‌లో ఇండియా వర్సెస్ పాకిస్థాన్.. లక్ష్యం అదే అంటున్న బాబర్.

Babar Azam : వరల్డ్ కప్‌లో ఇండియా వర్సెస్ పాకిస్థాన్.. లక్ష్యం అదే అంటున్న బాబర్.
Babar Azam


Babar Azam : 2023 ఐసీసీ వరల్డ్ కప్‌కు ఇంకా మూడు నెలలే ఉంది. దీంతో ఇప్పటికే చాలామంది క్రికెట్ ఫ్యాన్స్.. ఈసారి వరల్డ్ కప్ ఏ దేశానికి వెళ్తుందో అని ఆసక్తిగా ఎదురుచూడడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌ను వీక్షించడానికి ఫ్యాన్స్ అంతా మరింత ఎక్కువ ఆసక్తే చూపిస్తున్నారు. ఈ మ్యాచ్ గురించి ప్రత్యేకంగా ఫ్యాన్స్ చూపిస్తున్న ఆసక్తిపై పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ తన స్పందనను తెలిపాడు. వరల్డ్ కప్ 2023 గురించి మొట్టమొదటిగా స్పందించిన క్రికెటర్ బాబర్.

తాజాగా ఒక ప్రెస్ మీట్‌లో పాల్గొన్న బాబర్ ఆజామ్‌కు ఎక్కువగా వరల్డ్ కప్ గురించే ప్రశ్నలు ఎదురయ్యాయి. ముఖ్యంగా ఇండియాతో జరగనున్న మ్యాచ్‌కు తన టీమ్ ఏ విధంగా రెడీ అవుతుందని అందరూ ప్రశ్నించడం మొదలుపెట్టారు. ‘మేము వరల్డ్ కప్‌లో ఆడబోతున్నాం. ఇండియా గురించి పక్కన పెడితే.. మేము పోటీ పడాల్సిన టీమ్స్ ఇంకా చాలా ఉన్నాయి. మేము వారిని దాటితే ఫైనల్స్‌కు చేరుకోగలం. మా ఫోకస్ కేవలం ఒక్క టీమ్‌పైనే కాదు.. మొత్తం 10 టీమ్స్‌పైనా ఉంటుంది.’ అంటూ తన ఫుల్ ఫోకస్ వరల్డ్ కప్ ఫైనల్‌పై ఉంటుందని స్పష్టం చేశాడు బాబర్.


ముందు జరిగిన వరల్డ్ కప్స్‌లాగా కాకుండా ఈసారి జరిగే వరల్డ్ కప్‌కు వెన్యూలు మారిపోయాయి. దీనిపై కూడా బాబర్ స్పందనను అడిగి తెలుసుకుంది మీడియా. ‘మా ఆలోచన చాలా సింపుల్‌గా ఉంటుంది. క్రికెట్ ఎక్కడ ఉంటే.. అక్కడ మ్యాచ్‌లు జరుగుతాయి. అక్కడి వెళ్లి మేము ఆడవలసి ఉంటుంది. ఒక ఆటగాడిగా మేము అన్నింటికి సిద్ధంగా ఉండాలి. వేర్వేరు ప్రాంతాల్లో, వేర్వేరు వాతావరణంలో ఆడాలి. దీనిని ఛాలెంజ్‌గా పరిగణించాలి. ఒక ప్లేయర్‌గా, కెప్టెన్‌గా ప్రతీ దేశానికి వెళ్లి బాగా ఆడడమే నా లక్ష్యం.’ అన్నాడు బాబర్ ఆజామ్.

ఎప్పటినుండో ఇండియా, పాకిస్థాన్ మధ్య జరుగుతున్న యుద్ధం.. క్రికెట్‌లో కూడా కొనసాగుతోంది. అందుకే ఈ రెండు దేశాలు ఎప్పుడెప్పుడు ఎదురుపడతాయా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తారు. ఐసీసీ టోర్నమెంట్స్ విషయంలో పాకిస్థాన్‌పై టీమిండియాలో ఎక్కువసార్లు గెలిచి చూపించింది. ప్రస్తుతం వరల్డ్ కప్‌లో కూడా ఈ రెండు టీమ్స్ ఎలా తలపడనున్నయో చూడడానికి ఇటు ఇండియా ఫ్యాన్స్‌తో పాటు అటు పాకిస్థాన్ ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు.

Related News

Drivers cheated: వెలుగులోకి కొత్త రకం దొంగతనం.. ప్రమాదమని చెప్పి..!

Special Trains: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లు!

Siddaramaiah: సీఎం సిద్ధరామయ్యకు బిగ్ షాక్.. ఎఫ్ఐఆర్ దాఖలు..గట్టిగానే చుట్టుకున్న ‘ముడా’!

President Draupadi Murmu : రేపు హైదరాబాద్‌కు రాష్ట్రపతి ముర్ము.. ఈ మార్గాల్లో వెళ్తే అంతే సంగతులు

Onion prices: ఆకాశన్నంటిన ఉల్లి ధరలు.. మరింత పెరగనున్నట్లు అంచనా!

Arunachal Pradesh: దారుణం.. 21 మంది స్కూల్ విద్యార్థులపై లైంగిక దాడి.. హాస్టల్ వార్డెన్‌కు ఉరిశిక్ష

YS Jagan: టెన్షన్ టెన్షన్.. తిరుమలకు జగన్.. పోలీస్ యాక్ట్ సెక్షన్ 30!

Big Stories

×