EPAPER
Kirrak Couples Episode 1

Pakistan Beats Netherlands: ఓపెనింగ్ మ్యాచ్ లో బీభత్సం సృష్టించిన పాక్ టీమ్…

Pakistan Beats Netherlands: ఓపెనింగ్ మ్యాచ్ లో బీభత్సం సృష్టించిన పాక్ టీమ్…

Pakistan Beats Netherlands: హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 రెండవ మ్యాచ్ లో పాకిస్తాన్ ,నెదర్లాండ్ జట్లు తలపడ్డాయి. పసికూన నెదర్లాండ్ పై పాక్ తన పవర్ పంజా విసిరి 81 పరుగుల భారీ తేడాతో విజయకేతనాన్ని ఎగురవేసింది. నిర్ణీత 50 ఓవర్లలో తొలిత బ్యాటింగ్ చేసిన 287 పరుగుల లక్ష్యాన్ని సాధించింది.. ఆ తర్వాత బరిలోకి దిగిన నెదర్లాండ్స్ వస్తా తడబడడంతో 41 ఓవర్లలో 205 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో పాక్ 81 పరుగుల తేడాతో ఐసీసీ వరల్డ్ కప్ 2023 మొదట మ్యాచ్ లో విజేతగా నిలిచింది. ఈ విజయానికి పలువురు ప్రశంసిస్తుంటే మరికొందరు ఇల్లు అలకగానే సరిపోదు…ఇంకా ముందు చాలా మ్యాచులు ఉన్నాయి కదా అని అంటున్నారు. ఆ విషయం పక్కన పెడితే పాక్ ఆరంభ మ్యాచ్ లో మంచి ఖాతాతో తన ఇన్నింగ్స్ ను మొదలు పెట్టింది.


ఈ నేపథ్యంలో భారత్ ఆధ్వర్యంలో జరిగిన వన్డే ప్రపంచ కప్ లు తొలిసారిగా పాక్ టీం విజయం సాధించింది. 1996, 2011 లో రెండుసార్లు భారతదేశంలో పాక్ ప్రపంచ కప్ మ్యాచ్ లు ఆడడం జరిగింది. అయితే రెండుసార్లు తొలి మ్యాచ్ లో పాక్ ఓటమి పాలయ్యింది.నెదర్లాండ్స్ వైపు నుంచి ఆల్ రౌండర్ బాస్ డి లీడ్ డేంజరస్ బౌలింగ్… పవర్ఫుల్ బ్యాటింగ్ ఉన్నప్పటికీ విజయం మాత్రం సాధించలేకపోయింది. తొలుత టాస్ గెలిచిన నెదర్లాండ్స్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో పాక్ బ్యాటింగ్ కు దిగింది. పాక్ తరఫున మహ్మద్ రిజ్వాన్ (68), సౌద్ షకీల్ (68 చేసిన అర్ధ సెంచరీలు టీం ను మంచి స్కోర్ వైపు కు నడిపించాయి.

పసి కూన అనుకున్న నెదర్లాండ్స్ తోలుత పాక్ ప్లేయర్లను తన బౌలింగ్ తో భయపెట్టింది. బాస్ డి లీడ్ నాలుగు వికెట్లు తీయడమే కాకుండా 67 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ కూడా ఆడాడు. కానీ అతని ప్రయత్నం జట్టును విజయపథంలో నడిపించలేకపోయింది. మొదట్లో బాగానే ఆడుతున్న నెదర్లాండ్ గేటుగా మ్యాచ్ చూసే వాళ్ళు కచ్చితంగా నెదర్లాండ్స్ గెలుస్తుంది అనుకునే సమయానికి..120 పరుగుల దగ్గర రెండు వికెట్లు కోల్పోయింది…దాంతో కాస్త బ్యాటింగ్ తడబడింది. మరోపక్క పాకిస్తాన్ బ్యాటర్స్ కంటే కూడా బౌలర్లే ఈ మ్యాచ్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. పాక్ తరఫున హరీస్ రవూఫ్ మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకోగా హసన్ అలీ రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక
మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, షాహీన్ షా ఆఫ్రిది, ఇఫ్తికార్ అహ్మద్ తలా ఒక వికెట్ తీయగలిగారు.


ఈరోజు మ్యాచ్ లో ఆడిన రెండు జట్ట ప్లేయర్స్..

పాకిస్థాన్: బాబర్ అజామ్ (కెప్టెన్), ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ షా ఆఫ్రిది, హరీస్ రవూఫ్, హసన్ అలీ.

నెదర్లాండ్స్: స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), విక్రమజీత్ సింగ్, మాక్స్ ఓ’డౌడ్, కోలిన్ అకెర్మాన్, బాస్ డి లీడే, తేజా నిడమనూరు, సాకిబ్ జుల్ఫికర్, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, పాల్ వాన్ మీకెరెన్, ఆర్యన్ దత్.

Related News

Trinayani Serial Today September 21st: ‘త్రినయని’ సీరియల్‌: డీల్ కోసం ఇంటికి వచ్చిన గజగండ – గజగండను చంపే ప్రయత్నం చేసిన గాయత్రిదేవి, నయని

Nindu Noorella Saavasam Serial Today September 21st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరు ఆత్మను చూసిన మనోహరి – అంజును చూసి ఎమోషన్ అయిన ఆరు

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Big Stories

×