EPAPER

Virat Kohli-Gautam Gambhir: మసాలా లేదని బాధపడవద్దు: కొహ్లీ, గంభీర్

Virat Kohli-Gautam Gambhir: మసాలా లేదని బాధపడవద్దు: కొహ్లీ, గంభీర్

On Past Conflicts With Gautam Gambhir, Virat Kohli’s Clear Message To BCCI Report: గౌతంగంభీర్ కోచ్ గా ఎంపికైన నేపథ్యంలో బోర్డు పెద్దలు కొందరు కల్పించుకుని వివాదాలు ఉన్నవారితో సఖ్యత కల్పించే పనిలో పడ్డారు. అందులో భాగంగా విరాట్ కొహ్లీకి ఫోన్ చేసి గౌతం గంభీర్ విషయంలో చర్చించినట్టు తెలిసింది. దీనికి కొహ్లీ సమాధానమిస్తూ మా ఇద్దరి విషయంలో జరిగిన దానిని సీరియస్ గా తీసుకోవద్దని చెప్పినట్టు తెలిసింది.


అది ఐపీఎల్ లో రెండు జట్ల మధ్య జరిగిన ఇష్యూ అని తెలిపాడు. అలాగైతే ఇప్పుడు టీమ్ ఇండియాలో ఆడుతున్న అందరూ రకరకాల జట్లతో ఆడుతున్నారు. కానీ టీమ్ ఇండియాకి వచ్చేసరికి అంతా కలిసికట్టుగా ఆడుతున్నాం కదా.. ఇదే అంతేనని అన్నట్టు తెలిసింది. ఏం పర్వాలేదు, గంభీర్ అంతా చూసుకుంటాడని చెప్పినట్టు తెలిసింది.

దేశం కోసం ఇద్దరం పనిచేస్తున్నామని, విభిన్న ఆలోచనా విధానాలు ఉన్నప్పటికి మా ఇద్దరి లక్ష్యం టీమ్ ఇండియాని విజేతగా నిలపడమేనని కొహ్లీ అన్నాడు. నిజానికి శ్రీలంక పర్యటనకు విరాట్, రోహిత్ ఇద్దరూ రెస్ట్ తీసుకోవాలని అనుకున్నారు. కానీ గంభీర్ స్వయంగా ఫోన్ చేసేసరికి, తన మాట తీయలేక బయలుదేరుతున్నారు. గౌతం ఏమన్నాడంటే, అంతా కొత్తవారితో కలిసి వెళ్లడం కరెక్టు కాదని బోర్డుకి చెప్పినట్టు తెలిసింది.


లఖ్ నవ్ మెంటార్ గా ఉన్నాడు గంభీర్ దూకుడుగా వ్యవహరించడంతో కొహ్లీతో వాగ్వాదం జరిగింది. తర్వాత 2024లో కోల్ కతా వర్సెస్ ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం వీరిద్దరూ హగ్ చేసుకుని సరదాగా మాట్లాడుకున్నారు. అంతేకాదు వివాదానికి కారణమైన బౌలర్ నవీనుల్ హక్ తో కూడా కొహ్లీ సరదాగా మాట్లాడాడు.

అయితే నేను వారిద్దరితో సరదాగా మాట్లాడటం కొందరికి నచ్చ లేదేమోనని కొహ్లీ అన్నాడు. మీకు మసాలా లేకుండా చేసినట్టున్నామని అంటూ, ఇంకా కొట్టుకోవడానికి మేమేం చిన్నపిల్లలం కాదని తెలిపాడు.

Also Read: కొత్త, పాతల కలయికతో టీమ్ ఇండియా

తర్వాత గంభీర్ కూడా ఈ అంశంపై స్పందించాడు. విరాట్ కొహ్లీతో నా అనుబంధంపై బహరంగంగా చర్చించాల్సిన అవసరం లేదు. తన భావాలను వ్యక్తీకరించే హక్కు అతనికి ఉంది. అలాగే నా జట్టు గెలవాలని కోరుకోవడంలో నా తప్పు లేదు. మా రిలేషన్ ప్రజలకు మసాలా న్యూస్ లు ఇవ్వడానికి కాదు కదా అన్నాడు.

ఇద్దరు సీనియర్ ప్లేయర్లు సరదాగా కలిసి మాట్లాడి, గొడవల్లేవని చెప్పడం వరకు ఓకే. అంతా సంతోషించారు. కానీ మధ్యలో సోషల్ మీడియాను ఎందుకు కెలికారని అంటున్నారు. మీకు మసాలా న్యూస్ కావాలా? అది లేనందుకు బాధపడుతున్నారా? ఇలాంటి డైలాగులు కొట్టడంతో వాళ్లని గానీ వీళ్లు రెచ్చగొట్టలేదు కదా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×