EPAPER

Lily Ann Zhang : ‘మా అమ్మాయికి సాధారణ ఉద్యోగం చాలు’.. రెండు ఒలింపిక్ మెడల్స్ సాధించిన యువతి తల్లిదండ్రులు!

Lily Ann Zhang : ‘మా అమ్మాయికి సాధారణ ఉద్యోగం చాలు’.. రెండు ఒలింపిక్ మెడల్స్ సాధించిన యువతి తల్లిదండ్రులు!

Lily Ann Zhang | ఓ 28 ఏళ్ల టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి.. ఒలింపిక్స్ లో ఆడేందుకు నాలుగు సార్లు అర్హత సాధించింది. రెండు కాంస్య పతకాలు సాధించింది. ఆమె ఆరు సార్లు జాతీయ చాంపియన్. ఇన్ని విజయాలు, పతకాలు అమె పేరున ఉన్నా.. ఆర్థిక కష్టాలు కూడా వెంటాడుతూనే ఉన్నాయి. దీంతో ఇక యువతి తల్లిదండ్రులు తమ కూతురికి ఈ ఆటల వద్దు ఒక సాధారణ ఉద్యోగం చాలు అని అభిప్రాయపడుతున్నారు. భారత దేశంలో ఒక ఒలింపిక్ కాంస్య పతకం సాధిస్తేనే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు క్రీడాకారులకు లక్షలు, కోట్లు బహుమతిగా ప్రకటిస్తుంటాయి. అలాంటిది ఎన్నో పతకాలు సాధించిన ఒక క్రీడాకారిణి ఆర్థిక ఇబ్బందుల్లో ఉందంటే ఆశ్చర్యమేస్తుంది.


లిలీ యాన్ జ్యాంగ్ అమెరికాలో నివసించే చైనా దేశ మూలాలున్న ఉన్న యవతి. టేబుల్ టెన్నిస్ ఆటలో లిలీ.. ఆరు సార్లు అమెరికా నేషనల్ చాంపియన్. ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్ లో టేబుల్ టెన్నిస్ మహిళల ర్యాంకింగ్ లో ఆమె 16వ స్థానంలో కొనసాగుతోంది. అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో నివసిస్తున్న లిలీ తల్లిదండ్రులు.. చైనా నుంచి వచ్చి అక్కడ స్థిరపడడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఈ క్రమంలో తమ కూతురు లిలీకి మంచి స్కూల్ లో చదివించారు. లిలీ పదేళ్ల వయసు నుంచే టేబుల్ టెన్నిస్ ఆటలో ఆరతేరింది. కేవలం 16 ఏళ్లకే 2012లో జరిగిన లండన్ ఒలింపిక్స్ లో ఆమె తొలిసారి అమెరికా తరపున టేబుల్ టెన్నిస్ ఆడింది. కానీ అప్పుడు ఆమె ఓడిపోవడంతో లిలీ తల్లి లిండా ఇక చాలు డిగ్రీ చదువుకోవాలి.. ఒక ఆఫీస్ ఉద్యోగం చేసుకోవాలి అని కఠినంగా చెప్పింది.

ఆమె తల్లి అలా చెప్పడానికి కారణం లేకపోలేదు. క్రీడల్లో మంచి భవిష్యత్తు లేదని ఆమె అభిప్రాయం. ఆట ఆడేటప్పుడు శరీరానికి ఏదైనా తీవ్ర గాయమైతే.. ఇక కెరీర్ ముగిసి పోయే ప్రమాదముందని.. అలాంటప్పుడు ఒక డిగ్రీ ఉంటే కనీసం ఉద్యోగం దక్కితే.. జీవితంలో ఆర్థికంగా భద్రత ఉంటుందని ఆమె ఆలోచన. అయితే లిలీ తన తల్లి ఆవేదనను అర్థం చేసుకున్నా.. టేబుల్ టెన్నిస్ ఆటపై ఉన్న ఆసక్తితో 2016లో జరిగిని రియో ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించింది. మరో వైపు కాలేజీలో సైకాలజీ కోర్సులో డిగ్రీ పూర్తిచేసింది. మళ్లీ టోక్యో ఒలింపిక్స్ లో కూడా లిలీ కాంస్య పతకం సాధించింది. అంతేకాదు అమెరికా జాతీయ టేబుల్ టెన్సిస్ చాంపియన్ షిప్ ని 2012, 2014, 2016, 2017, 2019 and 2022 ఇలా ఆరుసార్లు గెలుచుకుంది.


వీటితో పాటు 2011 పాన్ అమెరికన్ గేమ్స్ లో కాంస్య పతకం, అదే సంవత్సరం కతార్ లో జరిగిన మహిళ డబుల్స్ టైటిల్ విన్నర్ గా నిలిచింది. ఇలా చెప్పుకుంటే పోతే ఆమె పేరున చాలా పతకాలున్నాయి. అయినా ఆమె కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఎన్ని కష్టాలు వచ్చినా తాను టేబుల్ టెన్నిస్ ఆటను వదిలిపెట్టనని లిలీ జ్యాంగ్ చెబుతోంది. తన తల్లిదండ్రులు తన ఆర్థిక భద్రత కోసం చెబుతున్నారని చెబుతూనే.. ఆమె తన జీవితంలో తన మనసుకు నచ్చిన పని చేయాలనుకుంటున్నట్లు తెలిపింది. పారిస్ ఒలింపిక్స్ ఫలితాలు ఎలా ఉన్నా.. 2029 ఒలింపిక్స్ లో కూడా పాల్గొంటానని చెప్పింది.

Also Read: ఒలింపిక్‌ మెడల్‌ని పట్టుకునే అర్హత హీరోకి లేదంటూ నెటిజన్స్‌ ఫైర్

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×