EPAPER

NEW ZEALAND : ఆ లెజెండ్ కల నెరవేరుతుందా..? ఈసారైనా కివీస్ వరల్డ్ కప్ కొడుతుందా?

NEW ZEALAND : ఆ లెజెండ్ కల నెరవేరుతుందా..? ఈసారైనా  కివీస్ వరల్డ్ కప్ కొడుతుందా?

NEW ZEALAND : న్యూజిలాండ్ వరల్డ్ కప్ గెలవాలన్నది ఆ జట్టు మాజీ కెప్టెన్ మార్టిన్ క్రో కల. జీవితం చివరి దశలోనైనా ఆ డ్రీమ్ నెరవేరుతుందని ఎదురుచూశాడు. కానీ మార్టిన్ క్రో స్వప్నం సాకారం కాలేదు. కివీస్ వన్డే వరల్డ్ కప్ ను అందుకోలేదు.


అది 1992 వరల్డ్ కప్ టోర్ని. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ఈ మెగా ఈవెంట్ కు అతిథ్యమిచ్చాయి. మార్టిన్ క్రో నేతృత్వంలోని కివీస్ జట్టు లీగ్ దశలో అద్భుత ప్రదర్శన చేసింది. వరుసగా ఏడు మ్యాచ్ ల్లో గెలిచి సెమీస్ కు దూసుకెళ్లింది. కెప్టెన్ మార్టిన్ క్రో సంచలన నిర్ణయాలతో జట్టును ముందుకు నడిపించాడు. స్పిన్నర్ దీపక్ పటేల్ తో తొలి ఓవర్ బౌలింగ్ చేయించి ప్రత్యర్థులకు షాక్ ఇచ్చాడు. పవర్ ప్లే లో హిట్టింగ్ చేసే ఫార్ములాను అమలు చేశాడు. ఇక ఈ వరల్డ్ కప్ కివీస్ దేనని సగటు క్రికెట్ ఫ్యాన్స్ అంచనా వేశారు.

వరుస విజయాలతో ఊపుమీదున్న న్యూజిలాండ్ కు అనూహ్యంగా సెమీస్ కు చేరిన పాక్ షాకిచ్చింది. ఉత్కంఠగా సాగిన సెమీస్ లో కివీస్ ను ఓడించింది. ఇలా న్యూజిలాండ్ తొలి వరల్డ్ కప్ కల నీరుగారిపోయింది. 2015లో తొలిసారి ప్రపంచకప్ ఫైనల్ కు చేరుకున్న న్యూజిలాండ్ జట్టు.. క్యాన్సర్ తో పోరాటం చేస్తున్న ఆ దేశ లెజండరీ క్రికెటర్ మార్టిన్ క్రో కల తీర్చాలని క్రికెట్ ఫ్యాన్స్ కోరుకున్నారు. కానీ తుదిపోరులో ఆస్ట్రేలియా ముందు కివీస్ రెక్కలు విరిగిపోయాయి. ఆ తర్వాత ఏడాదికే మార్టిన్ క్రో తన డ్రీమ్ నెరవేరకుండానే కన్నుమూయడం న్యూజిలాండ్ క్రికెట్ లో పెనువిషాదాన్ని నింపింది.


2019లో మరోసారి ఫైనల్ చేరుకున్న కివీస్ ను తుదిపోరులో దురదృష్టం వెంటాడింది. ఈ మ్యాచ్ లో విజయం చేతిలోకి వచ్చి జారిపోయింది. మ్యాచ్ టైగా ముగిసింది. సూపర్ ఓవర్ కూడా టై అయ్యింది. నిబంధనల ప్రకారం.. ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లండ్ ను విజేతగా ప్రకటించారు. ఇలా బ్యాడ్ లక్ వెంటాడటంతో కివీస్ ఆశలు ఆవిరయ్యాయి.

వరల్డ్ కప్ టోర్నిల్లో ఆస్ట్రేలియా తర్వాత అత్యంత నిలకడగా రాణించిన టీమ్ న్యూజిలాండ్. 1983, 87, 2003లో మాత్రమే ఆ జట్టు లీగ్ దశలో ఇంటిముఖం పట్టింది. మిగిలిన 9 టోర్నిలో అద్భుత ప్రదర్శనే చేసింది. లీగ్ దశలో అద్భుతాలు చేసినా.. నాకౌట్ మ్యాచ్ లో విఫలం కావడం కివీస్ జట్టు బలహీనత. మొత్తం 8 సార్లు సెమీస్ చేరింది. 1975, 79, 92,99 , 2007, 2011 లో సెమీస్ లోనే ఓటమిపాలైంది. 2015, 2019 లో సెమీస్ గండం దాటిన ఫైనల్ లో పరాజయం పాలైంది.

1996లో కివీస్ క్వార్టర్ ఫైనల్ లో ఓడింది. 2011లో క్వార్టర్స్ లో విజయం సాధించినా సెమీస్ లో పరాజయం పాలైంది. వరల్డ్ కప్ ల్లో మొత్తం 12 నాకౌట్ మ్యాచ్ లు ఆడిన న్యూజిలాండ్ 9 సార్లు ఓడింది. మూడుసార్లు మాత్రమే విజయం సాధించింది. ఈ బలహీనత వల్లే కివీస్ ఇంతవరకు వన్డే వరల్డ్ కప్ సాధించలేదు. ఆ జట్టు మాజీ కెప్టెన్ మార్టిన్ క్రో కల నెరవేరలేదు.మరి ఈసారైనా మార్టిన్ క్రో కల నెరవేరుస్తుందా.. కివీస్ కప్ కొడుతుందా?

Tags

Related News

India vs Bangladesh Test Match: అదరగొట్టిన భారత్.. 149కే బంగ్లా ఆలౌట్

IND vs BAN 1st Test: కపిల్, ధోనీ సరసన.. అశ్విన్

India vs Bangladesh 1st Test: భారత్ 376 ఆలౌట్.. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన భారత్..

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Big Stories

×