EPAPER

Shubman Gill : అహ్మదాబాద్ చేరుకున్న గిల్ ..మరి దాయాదుల పోరులో పాల్గొంటాడా…

Shubman Gill : అహ్మదాబాద్ చేరుకున్న గిల్ ..మరి దాయాదుల పోరులో పాల్గొంటాడా…

Shubman Gill : ఐసీసీ వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ లో భాగంగా ఇప్పటికి భారత్ రెండు మ్యాచ్ లు పూర్తి చేసుకుంది. మొదటి మ్యాచ్లో కాస్త తడబడిన రెండవ మ్యాచ్లో దుమ్ము దులిపాడు. టీం కెప్టెన్ రోహిత్ శర్మ. రికార్డుల మీద రికార్డులు బద్దలు కొట్టి తన పేరిట సరికొత్త రికార్డులను నెలకొల్పడమే కాకుండా తన మొదటి మ్యాచ్ పర్ఫామెన్స్ గురించి విమర్శించిన వారికి తన బ్యాటింగ్ పవర్ చూపించి ప్రశంసించేలా చేసుకున్నాడు. మరోపక్క గిల్ స్థానంలో వచ్చిన ఇషాన్ ఈసారి మ్యాచ్ లో మంచి ప్రతిభ కనబరిచాడు.


అయినప్పటికీ క్రికెట్ అభిమానులు ఓపెనర్ గిల్ ని చాలా మిస్ అవుతున్నారు. డెంగ్యూ కారణంగా మ్యాచ్ కి దూరమైన గిల్ ఇక ఐసీసీ వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ లలో పాల్గొంటాడా లేదా అని అభిమానులు ఆరాటపడుతున్నారు.గత కొన్ని రోజులుగా డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న టీం ఇండియా యువ సంచలనం…ఓపెనర్ బ్యాట్స్మెన్ గిల్ ఇప్పుడిప్పుడే

కోలుకుంటున్నట్లు తెలుస్తుంది. సడెన్ గా ప్లేట్లెట్స్ పడిపోవడం తి చెన్నై హాస్పిటల్ లో అడ్మిట్ అయిన్ గిల్.. నిన్న డిశ్చార్జయ్యాడు. ప్రస్తుతం అతని ప్లేట్లెట్స్ కౌంట్ సాధారణ స్థితికి వచ్చిందని హాస్పిటల్ స్టాఫ్ సమాచారం.


అయితే ఈ నేపథ్యంలో రేపు అక్టోబర్ 14న అహ్మదాబాద్ స్టేడియంలో జరగనున్న దాయాదుల పోరులో గిల్ పాల్గొంటాడు అని క్రికెట్ అభిమానులు ఆశాజనికంగా ఉన్నారు. గిల్ అక్టోబర్ 14 జరిగే మ్యాచ్లో టీమ్ ఇండియా తరఫున పాల్గొనడానికి చెన్నై నుంచి బయలుదేరి అహ్మదాబాద్ చేరుకున్నాడు అని సమాచారం. అయితే మ్యాచ్ ముందు బీసీసీఐ వైద్య పరీక్షలు పూర్తిచేసుకుని ఆడడానికి పూర్తిగా ఫిట్ గా ఉన్నాడు అని నిర్ధారణ అయిన తర్వాత గిల్ మ్యాచ్ లో పాల్గొనడం జరుగుతుంది.

పాకిస్తాన్ భారత్ మధ్య జరగనున్న ఈ హిస్టారిక్ మ్యాచ్కి ఇక కేవలం ఒక్కరోజు సమయం మాత్రమే ఉంది. తమ అభిమాన క్రికెటర్ పూర్తి ఫిట్నెస్తో ఈ మ్యాచ్లో పాల్గొంటాడు అని ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆసీస్ తో జరిగిన మ్యాచ్ లో రాహుల్ తన అద్భుతమైన పోరాటపటిమను చూపించగా నిన్న ఆఫ్గనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ తిరిగి తన పూర్వపు హిట్ మాన్ ఫార్మ్ చూపించాడు. మెరుపు వేగంతో సెంచరీ పూర్తి చేయడమే కాకుండా ఒంటి చేత్తో టీమిండియాను గెలిపించాడు.

నిన్ననే అహ్మదాబాద్ చేరుకున్న పాక్ జట్టు తమ కటోరమైన ప్రాక్టీస్ ను ఇవాళ ఉదయం నుంచి మొదలు పెట్టారు. ప్రాక్టీస్ సెక్షన్లో పాక్ ఆటగాళ్ల కఠోర శ్రమ చూస్తుంటే టీమిండియా వాళ్ళను ఏ రేంజ్ లో భయపెట్టిందో అర్థం అవుతుంది. ప్రపంచ కప్ లో ఎప్పటినుంచో తమపై ఆధిపత్యం చూపిస్తున్నా టీమ్ ఇండియాను ఈసారి ఎలా అయినా ఓడించాలి అన్న పట్టుదల పాక్ ఆటగాళ్లలో కనిపిస్తుంది . అయితే మరోపక్క ఈసారి కూడా ముచ్చటగా మూడవ మ్యాచ్లో గెలిచి తీరాలి అన్న పట్టుదల టీం ఇండియా లో గట్టిగా ఉంది. గెలుపు ఓటమి మాట పక్కన పెడితే మొత్తానికి జరగబోయే మ్యాచ్ మాత్రం రొమాన్చితంగా ఉండబోతోంది.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×