EPAPER

Novak Djokovic : పదోసారి వింబుల్డన్ ఫైనల్లోకి నోవాక్ జకోవిచ్!.. టైటిల్ కోసం కార్లోస్ అల్కరాజ్ తో ఢీ

Novak Djokovic : పదోసారి వింబుల్డన్ ఫైనల్లోకి నోవాక్ జకోవిచ్!.. టైటిల్ కోసం కార్లోస్ అల్కరాజ్ తో ఢీ

Novak Djokovic to Wimbledon final(Sports news headlines):సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. 25వ వింబుల్డన్ సింగిల్స్ పురుషుల సెమీఫైనల్లో సునాయసంగా విజయం సాధించాడు. ఇటలీకి చెందిన లొరెన్జో ముసెట్టీపై 6-4, 7-6, 6-4 తో గెలుపొంది.. పదోసారి వింబుల్డన్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఇటీవలే మోకాలి సర్జరీ నుంచి కోలుకున్న 37 ఏళ్ల నొవాక్.. మ్యాచ్ మొత్తం ఫుల్ ఫిట్ నెస్ తో కాన్పిడెంట్ గా ఆడి తన అభిమానులను అలరించాడు.


మ్యాచ్‌లో జకోవిచ్‌ ఆరు ఏస్‌లు సంధించి.. ప్రత్యర్థి ముసెట్టీ సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేశాడు. రెండో సెమీఫైనల్ మ్యాచ్ రెండు గంటల 48 నిమిషాల పాటు సాగింది. మ్యచ్ లో మొత్తం 56 పాయింట్లలో 43 పాయింట్లు జకోవిచ్ కు దక్కడంతో లొరెన్‌జో ఓటమి పాలయ్యాడు.

మరోవైపు మూడో సీడ్ స్పెయిన్ కు చెందిన కార్లోస్ ఆల్కరాజ్.. సెమీఫైనల్లో ఐదో సీడ్‌ మెద్వెదెవ్‌ (రష్యా)పై 6–7 (1/7), 6–3, 6–4, 6–4 తో విజయం సాధించాడు. ఈ మ్యాచ్ లో అల్కరాజ్ ఏకంగా ఆరు ఏస్‌లు సంధించి, రెండు డబుల్‌ ఫాల్ట్‌ లు చేశాడు.


Also Read: James Anderson Retirement| జేమ్స్ ఆండర్ సన్ రిటైర్మెంట్.. సచిన్ టెండూల్కర్ ఎమోషనల్ రియాక్షన్

జూలై 14, ఆదివారం వింబుల్డన్ ఫైనల్ రసవత్తరం కానుంది. దీనికి కారణం.. మ్యాచ్ లో నొవాక్ ప్రత్యర్థి కార్లోస్ అల్కరాజ్. వీరిద్దరూ ఇంతకు ముందు తలపడినప్పుడు.. అల్కరాజ్ విజయం సాధించాడు. దీంతో ఈ వింబుల్డన్ ఫైనల్ వీరిద్దరి మధ్య రీమ్యాచ్ గా మారింది. అల్కరాజ్ చేతిలో గతంలో పరాజయం పొందిన నొవాక్.. ఈసారి విజయం సాధించి తన రివెంజ్ తీర్చుకోవాలని ఉత్సాహంతో ఉన్నాడు. పైగా ఇప్పటికే ఏడు సార్లు వింబుల్డన్ టైటిల్ గెలిచిన నొవాక్.. ఈసారి ఫైనల్ గెలిస్తే.. ఎనిమిది వింబుల్డన్ టైటిల్స్ సాధించిన రోగర్ ఫెదరర్ రికార్డుని సమం చేస్తాడు.

Tags

Related News

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Big Stories

×