EPAPER
Kirrak Couples Episode 1

Nitish Excellent Performance: కుమ్మేసిన వైజాగ్ కుర్రాడు నితీష్.. ప్రపంచకప్‌ టోర్నీకి ఛాన్స్..?

Nitish Excellent Performance: కుమ్మేసిన వైజాగ్ కుర్రాడు నితీష్.. ప్రపంచకప్‌ టోర్నీకి ఛాన్స్..?

Nitish excellent performance against PBKS: ఐపీఎల్‌లో మెరిశాడు నితీష్‌కుమార్‌రెడ్డి.. విశాఖకు చెందిన ఆటగాడు.. ఒక్క మ్యాచ్‌తో వెలుగులోకి వచ్చాడు. పంజాబ్‌తో గతరాత్రి జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు విజయం సాధించిందంటే అందుకు కారణం ఈ ఆటగాడే. 64 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది హైదరాబాద్ జట్టు. ఎస్ఆర్‌హెచ్ పనై పోయిందని దాదాపుగా అభిమానులు భావించారు. కానీ, ఫ్యాన్స్ అంచనాలను తలకిందులు చేశాడు. తానేంటో నిరూపించుకున్నాడు నితీష్‌కుమార్ రెడ్డి.


కేవలం 37 బంతుల్లో 64 పరుగులు చేసి అదరహో అనిపించాడు 20 ఏళ్ల వైజాగ్ కుర్రాడు. దేశవాళీ క్రికెట్‌లో పెద్దగా అనుభవం లేని ఈ ఆల్‌రౌండర్.. అంతర్జాతీయ ఆటగాళ్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా రబాడ, సామ్‌కరణ్ లాంటి బౌలర్లకు అప్పుడప్పుడు చుక్కలు చూపించాడు కూడా. రబాడ బౌలింగ్‌లో కొట్టిన సిక్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే.

నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన నితీష్.. వరుస వికెట్లు పడుతున్నా ఏమాత్రం ఒత్తిడికి గురికాలేదు. తొలుత క్రీజులో నిలదొక్కుకునేందుకు కాస్త సమయం తీసుకుని, ఆ తర్వాత ఎదురుదాడి ప్రారంభించాడు. అవకాశం చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీలకు తరలించేవాడు. ఐపీఎల్‌లో తొలి అర్థ సెంచరీ నమోదు చేశాడు. బౌలింగ్‌లోనూ సత్తా చాటాడు. జితేష్‌శర్మ లాంటి డేంజరస్ ఆటగాడి వికెట్ తీసి మ్యాచ్‌పై పట్టు సాధించాడు.


Nitish Kumar Reddy excellent performance SRH beat PBKS
Nitish Kumar Reddy excellent performance SRH beat PBKS

కేవలం 20 లక్షల కనీస ధరకు సన్‌రైజర్స్ నితీష్‌కుమార్‌రెడ్డిని సొంతం చేసుకుంది. తొలి సీజన్‌లో పెద్దగా అవకాశాలు రాలేదు. ఈ సీజన్‌లో నితీష్‌ను ఫినిషర్‌గా ఉపయోగించుకోవాలని హైదరాబాద్ జట్టు భావించింది. అయితే చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో లోయర్ మిడిలార్డర్‌లో పంపింది. చివరకు జట్టుకు విజయం సాధించి పెట్టాడు. కానీ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముందుగానే బ్యాటింగ్‌కు దిగి హాఫ్ సెంచరీ చేశాడు. నాలుగేళ్ల కిందట రంజీల్లో ఎంట్రీ ఇచ్చిన నితీష్.. అప్పడు కూడా మెరుగైన ఆటతీరును ప్రదర్శించాడు.

Also Read: ఉత్కంఠ పోరులో హైదరాబాద్ విజయం.. పోరాడి ఓడిన పంజాబ్

పంజాబ్‌ మ్యాచ్‌లో కీలకపాత్ర పోషించిన నితీష్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్. తొలి మ్యాచ్‌లో తన టాలెంట్ నిరూపించుకున్నాడని తెలిపాడు. సీనియర్ ఆటగాళ్లు సైతం నితీష్‌ని మెచ్చుకున్నారు. రాత్రి మ్యాచ్ చూసిన అభిమానులు మాత్రం రింకూసింగ్‌ని గుర్తు చేసుకున్నారు.నితీష్ ఇదే దూకుడు కంటిన్యూ చేస్తే.. టీ 20 ప్రపంచకప్‌కు ఎంపిక చేసినా ఆశ్చర్యపోనక్క ర్లేదు.

 

Tags

Related News

Rishabh Pant: పాపం…RCBలోకి రాకుండా పంత్‌ పై కోహ్లీ కుట్రలు..?

Yuvraj Singh: ఆ హీరోయిన్‌ ను వాడుకుని వదిలేశాడు..ఆస్ట్రేలియాలో అర్థరాత్రుల్లు కూడా ?

Shakib Al Hasan: టీ20లకు బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ వీడ్కోలు

Ind vs Ban: మొదట బ్యాటింగ్ కు దిగిన బంగ్లా… కాన్పూర్ లో భారీ వర్షం.. మ్యాచ్ జరగడం కష్టమే?

Ind Vs Ban: గంభీర్‌ భారీ స్కెచ్‌…రెండో టెస్ట్​కు బ్లాక్ సాయిల్ పిచ్..బంగ్లాకు ఇక చుక్కలే ?​

Shikhar Dhawan: శిఖర్ ధవన్ కు వాళ్ల టార్చర్..అందుకే రిటైర్మెంట్ అంటూ ఎమోషనల్!

IPL 2025: ధోని అదిరిపోయే ప్లాన్‌..CSKలోకి అశ్విన్, షమీ..!

Big Stories

×