EPAPER

Rahul Dravid : రాహుల్ ద్రవిడ్ కోచ్, బ్యాటర్ మాత్రమే కాదు.. బౌలర్ కూడా?

Rahul Dravid : రాహుల్ ద్రవిడ్ కోచ్, బ్యాటర్ మాత్రమే కాదు.. బౌలర్ కూడా?
Rahul Dravid Latest News

Rahul Dravid Latest News(Indian cricket news today) :

రాహుల్ ద్రవిడ్ అంటే భారత క్రికెట్ లో పరిచయం అక్కర్లేని పేరు. దేశం కోసం క్రికెట్ ఆడే అరుదైన ఆటగాళ్లలో తను ముందు వరుసలో ఉంటాడు. తనెప్పుడు వ్యక్తిగత రికార్డుల కోసం కాకుండా, జట్టుని ఆదుకోడానికి అనుక్షణం తపిస్తూ ఉంటాడు. తను క్రికెట్ ఆడే కొత్తలో వెస్టిండీస్ ప్లేయర్ల తరహాలో క్రికెట్ టోపీ పెట్టుకుని వెరైటీగా క్రీజులోకి వచ్చేవాడు. అలా రకరకాల క్యాప్ లను వాడేవాడు. ఇప్పుడు కోచ్ క్యాప్ పెట్టుకున్నాడు.


టీమ్ ఇండియా విజయాల్లో రాహుల్ ద్రవిడ్ ది కీలకపాత్ర అని చెప్పాలి. అండర్ 19 జట్టుకి కోచ్ గా వెళ్లి, విజయాలు సాధించిన ద్రావిడ్ టీమ్ ఇండియాకు హెడ్ కోచ్ గా వచ్చాడు. ఈ క్రమంలో ఎన్నో విజయాలు లభించాయి. 38 వన్డేలు ఆడితే అందులో 31 మ్యాచుల్లో టీమిండియా విజయం సాధించింది. ఇక వన్డే వరల్డ్ కప్ 2023లో  ఫైనల్ ల టీమ్ఇండియా ఓటమి పాలయ్యిందిగానీ, లేదంటే జట్టుకెంత పేరు వచ్చేదో ద్రావిడ్ కి అంతకన్నా ఎక్కువ పేరు వచ్చేది.  

ఇప్పుడిదంతా ఎందుకంటే సౌతాఫ్రికాలో జరుగుతున్న తొలిటెస్టు మ్యాచ్ లో రెండోరోజు తొలి సెషన్ కి వర్షం పడింది. సిబ్బంది తీవ్రంగా శ్రమించి అవుట్ ఫీల్డ్ ని సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో చినుకులు కూడా తగ్గడంతో ఇరు జట్లు కూడా అదే గ్రౌండ్ పై మ్యాచ్ ప్రాక్టీస్ చేశాయి. ఈ క్రమంలో రాహుల్ ద్రవిడ్ పిచ్ మీద బౌలింగ్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఆ బౌలింగ్ యాక్షన్ అదీ చూసి నెట్టింట ద్రవిడ్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. కోచ్ అంటే నువ్వు భయ్…అలా ఉండాలని కితాబునిస్తున్నారు.


సీనియర్లు కూడా మెచ్చుకుంటున్నారు. మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కూడా కోచ్ అంటే ఎలా ఉండాలో ద్రవిడ్ ని చూసి నేర్చుకోవాలని కితాబునిచ్చాడు. అయితే ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపడానికి కూడా ద్రవిడ్ అలా బౌలింగ్ చేసి ఉంటాడని అన్నాడు. అయితే నెట్టింట జనం మాత్రం… బాల్ పిచ్ మీద ఎలా స్వింగ్ అవుతుందో తనంతట తనే స్వయంగా  పరిశీలించి చూశాడని చెబుతున్నారు.

ఇంతకు ముందు పిచ్ ని పరిశీలిస్తూ అక్కడ సీనియర్లతో, క్యూరేటర్లతో పిచ్చాపాటి కబుర్లు చెబుతూ ద్రవిడ్ గడిపేవాడు. కానీ ఈసారి బౌలింగ్ యాక్షన్ చేసి మరీ ఔరా అనిపించాడు. అంతేకాదు కొహ్లీకి కూడా బాల్ ఇచ్చి బౌలింగ్ చేయమన్నాడు. దీంతో కొహ్లీ నవ్వుతూ బౌలింగ్ చేశాడు.

బహుశా కొహ్లీని మ్యాచ్ లో వాడుతాడేమోనని అంతా అనుకున్నారు. కానీ ఇంతవరకు రోహిత్ శర్మ ఆ ప్రయత్నం చేయలేదు. అయితే గతంలో ద్రవిడ్ బౌలింగ్ చేసి 5 వికెట్లు కూడా తీశాడు. అంతేకాదు తను జట్టు కోసం వికెట్ కీపింగ్ చేశాడు. ఓపెనర్ గా వచ్చాడు. సెకండ్ డౌన్ వెళ్లాడు. ఏ పాత్ర చేయమంటే అది చేశాడు. అదే అతని సీక్రెట్ అని అంతా అంటున్నారు.

తొలి ఇన్నింగ్స్ లో భారత్ 245 పరుగులకి ఆలౌట్ అయ్యింది. అయితే సౌతాఫ్రికా బౌలింగ్ ధాటికి టీమ్ ఇండియా చేతులెత్తేసింది. కానీ అంతా అనుకున్నట్టే జరిగింది. సౌతాఫ్రికా బ్యాటింగ్ కి వచ్చేసరికి, వారు తాపీగా ఆడుతున్నారు. ఆల్రడీ డీన్ ఎల్గర్ సెంచరీతో కదం తొక్కుతున్నాడు. రాబోయే మూడు రోజుల్లో వర్షంకానీ అంతరాయం కలిగించకపోతే మాత్రం తాడోపేడో తేలిపోవడం ఖాయమని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.

https://twitter.com/NihariVsKorma/status/1739565155212825075?

Related News

India vs Bangladesh Test Match: అదరగొట్టిన భారత్.. 149కే బంగ్లా ఆలౌట్

IND vs BAN 1st Test: కపిల్, ధోనీ సరసన.. అశ్విన్

India vs Bangladesh 1st Test: భారత్ 376 ఆలౌట్.. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన భారత్..

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Big Stories

×