EPAPER

Virat Kohli : కోహ్లిపై ట్రోలింగ్..అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..

Virat Kohli : కోహ్లిపై ట్రోలింగ్..అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..
Virat Kohli

Virat Kohli : ఇండియా- బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ లో సెంచరీ కోసం ఆడి రన్ రేట్ తగ్గించేశాడని కోహ్లిపై సీనియర్లు కామెంట్లు చేశారు. తన వల్లే టేబుల్ టాప్ లో ఉండాల్సిన ఇండియా నెంబర్ 2కి పడిపోయిందని చెప్పుకొచ్చారు. అంతేకాదు ఒకొక్కసారి వరల్డ్ కప్ లో నెట్ రన్ రేట్ ఎంత కొంప ముంచుతుందో అందరికీ తెలిసిన విషయమేనని కూడా అన్నారు. అంతేకాదు కోహ్లి లాంటి సీనియర్ సెంచరీ కోసం ఇలా ఆడటం సరైన విధానం కాదని చెప్పడం వివాదాస్పదమైంది.


న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఏమంటున్నారంటే అయ్యో…కోహ్లి ఎందుకు తొందరపడ్డాడు. అరెరె సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఇంకా రెండు ఓవర్లు ఉన్నాయి కదా.. అని కామెంట్ చేస్తున్నారు.
వాళ్లే వీళ్లు.. వీళ్లే వాళ్లు. మీకొక నమస్కారం రా బాబూ.. అంటూ నెట్టింట మరో ట్రోలింగ్ నడుస్తోంది.

ఈ మధ్యలో మరో ట్విస్ట్ జరిగింది. ఇదే మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ రనౌట్ అయ్యాడు. అదిగో కోహ్లి తన స్వార్థం కోసం సూర్యని అవుట్ చేశాడు అంటూ మొదలుపెట్టారు. ఇది కూడా నెట్టింట వైరల్ గా మారింది. అయితే దీనికి కౌంటర్ గా చాలామంది మాత్రం సూర్యదే తప్పు. ఫీల్డర్ చేతిలోకి బంతి వెళ్లిందని గమనించకుండా రన్ తీస్తాడంటున్నారు. అంతేకాదు ఇంటర్నేషనల్ మ్యాచ్ అన్నాక అన్నివైపులా చూసుకోవాలి. పరుగు మొదలుపెట్టాక కళ్లు మూసుకుని వెళ్లిపోవడం కరెక్ట్ కాదని అంటున్నారు. బాల్ ఇంకా ఫీల్డర్ దగ్గరే ఉంది. అది అందరికీ తెలుస్తూనే ఉంది. మరి సూర్య ఎందుకు అంత గబగబా పరుగెత్తేశాడని సెటైర్లు వేస్తున్నారు.


ఎవరేమనుకున్నా ఛేజింగ్ లో కోహ్లికి ఉన్న ట్రాక్ రికార్డ్ వేరే అని చెప్పాలి. కానీ కోహ్లి మీద ఇలాంటి కామెంట్లు చేయడం రాబోవు మ్యాచ్ ల్లో మంచిది కాదని కొందరు హితబోధ చేస్తున్నారు. ఎందుకంటే వచ్చేవన్నీ
ఇక కీలకమైన మ్యాచ్ లే. అందులో కోహ్లి పాత్ర ఎంత ముఖ్యమైనదో అందరికీ తెలిసిందే. అందుకే తనని మానసికంగా హింస పెట్టకూడదని సీనియర్లు చెబుతున్నారు. ఎందుకంటే తను బాగా సెన్సెటివ్. ఏమైనా తన మనసు గాయపడిందంటే అది జట్టుకి శాపంగా మారుతుంది. అందుకని నెటిజన్లు కొంచెం సంయమనం పాటించాలని కోరుతున్నారు.

140 కోట్లపైగా మంది ప్రజల ఉన్న భారత లో 15 మంది ఇండియా కోసం క్రికెట్ ఆడుతున్నారు. అంటే ఎంత కాంపిటేషన్ ని తట్టుకుని వారు నిలబడ్డారు. దానికెంత శక్తి, సామర్థ్యం కావాలి. అందుకని ఒకరి మీద రాయి వేసేటప్పుడు కొంచెం మనస్థాయి కూడా తెలుసుకుని విసరాలి అని కొందరు అంటున్నారు. విరాట్ గురించి సునీల్ గవాస్కర్ చెబితే అందంగా లేదా సచిన్ మాట్లాడితే మరింత అందంగా ఉంటుంది. ఎందుకంటే వారికి ఆ అనుభవం ఉంది. కానీ దూరం నుంచి చూసి కామెంట్ చేసేవారు కొంచెం విజ్ఞత పాటించాలని అంటున్నారు. వారెంత ఒత్తిడి మధ్య ఆడుతున్నారో అందరూ అర్థం చేసుకోవాలని హితవు పలుకుతున్నారు.

ఇక ఇండియా జట్టు విషయానికి వస్తే ఇంతవరకు రోహిత్, గిల్, కోహ్లి, రాహుల్ ఇలా అందరూ బాగానే అడుతున్నారు. ఇప్పటికే వీరు తమ శక్తికి మించి ఆడుతున్నారు. కప్ కొట్టే వరకు ఇదే దూకుడు ప్రదర్శించాలని క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×