EPAPER

Nepal vs Bangladesh: నేపాల్‌పై గ్రాండ్ విక్టరీ.. సూపర్-8లోకి దూసుకెళ్లిన బంగ్లాదేశ్

Nepal vs Bangladesh: నేపాల్‌పై గ్రాండ్ విక్టరీ.. సూపర్-8లోకి దూసుకెళ్లిన బంగ్లాదేశ్

Nepal vs Bangladesh Match: టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా ఆర్నోస్ వెల్ మైదానం వేదికగా నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేవ్ గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. దీంతో గ్రూప్-డీ నుంచి సూపర్-8కు అర్హత సాధించింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్.. 19.3 ఓవర్లలో 106 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ తాంజన్ హసన్ మొదటి ఓవర్‌లో తొలి బంతికే ఔట్ అయ్యాడు. తర్వాత వచ్చిన కెప్టెన్ శాంటో.. దీపేంద్ర సింగ్ వేసిన రెండో ఓవర్‌‌లో వెనుదిరిగాడు.


నేపాల్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు రాబట్టేందుకు బంగ్లా బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. షకీబ్(17), మహ్మదుల్లా(13), జాకర్ అలీ(12), రషీద్ హెస్సెన్(13), అహ్మద్(12) పరుగులతో పర్వాలేదనిపించారు. నేపాల్ బౌలర్లలో సోంపాల్, దీపేంద్ర సింగ్, రోహిత్ పాడెల్, లామిచానే తలో రెండు వికెట్లు పడగొట్టారు.

తన్జిమ్ బౌలింగ్ కట్టుదిట్టం..
బంగ్లాదేశ్ విధించిన లక్ష్యఛేదనలో నేపాల్ పోరాడి ఓడింది. ఆసిఫ్(17), కుశాల్(27), దీపేంద్ర సింగ్(25) పరుగులతో రాణించారు. చివరిలో అందరూ డకౌట్‌గా వెనుదిరిగారు. దీంతో 19.2 ఓవర్లలో 85 పరుగులకు ఆలౌట్ అయింది. బంగ్లా బౌలర్లలో తన్జిమ్ కట్టుదిట్టంగా బౌలింగ్ వేసి 4 వికెట్లు తీశాడు. ముస్తాఫిజర్ 3, షకిబ్ 2 వికెట్లు తీయగా.. అహ్మద్ ఒక వికెట్ పడగొట్టాడు.


Also Read: నామమాత్రపు మ్యాచ్ లో.. ఘనంగా గెలిచిన శ్రీలంక

నేపాల్‌పై బంగ్లాదేశ్ విజయం సాధించడతో గ్రూప్-డీ నుంచి రెండో జట్టుగా సూపర్-8కు అర్హత సాధించింది. ఈ విజయంతో నెదర్లాండ్స్ జట్టుకు ఆశలు గల్లంతయ్యాయి. దీంతో ఆ జట్టు చివరి మ్యాచ్ నామమాత్రంగా మిగిలింది. ఇక, చివరి మ్యాచ్ మంగళవారం వెస్టిండీస్, అఫ్గాన్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌తో లీగ్ ముగుస్తుంది.కు గండి పడింది. ఆ జట్టు ఆడిన చివరి మ్యాచ్‌ నామమాత్రంగా మిగిలింది. దీంతో సూపర్‌ -8కి చేరిన జట్లేవో తేలిపోయాయి.

Related News

Rohit Sharma – Devara: BGM దేవరది..బ్యాటింగ్‌ రోహిత్‌ శర్మది..ఇక రచ్చ రచ్చే !

IND VS BAN: హైదరాబాద్ గడ్డపై టీమిండియా…రేపే బంగ్లాతో మ్యాచ్

Rafael Nadal: రఫెల్ నాదల్ సంచలన నిర్ణయం…!

Ratan Tata: టీమిండియా క్రికెటర్లకు ఆపద… ఆదుకున్న రతన్ టాటా !

Riyan Parag: బంగ్లా మ్యాచ్‌ లో పరాగ్‌ ఓవరాక్షన్‌..ఇదే తగ్గించుకుంటే మంచిది !

IND vs BAN: తెలుగోడి ఊచకోత.. బంగ్లాపై టీమిండియా విజయానికి 5 కారణాలు ఇవే !

IPL 2025: SRH లో కల్లోలం..ఆ డేంజర్ ప్లేయర్ ఔట్ ?

Big Stories

×