EPAPER

Neeraj Chopra: అలా జరిగినందుకు చాలా బాధగా ఉందన్న నీరజ్ చోప్రా, ఎందుకంటే…!

Neeraj Chopra: అలా జరిగినందుకు చాలా బాధగా ఉందన్న నీరజ్ చోప్రా, ఎందుకంటే…!

Neeraj Chopra Said That It Is Very Sad That It Happened, Because: పారిస్‌ వేదికగా ఒలింపిక్స్‌ జరుగుతున్న నేపథ్యంలో భారత్‌కు చెందిన ఆటగాడు నీరజ్ చోప్రా తొలి సిల్వర్ మెడల్‌ని అందించాడు. నిన్న జరిగిన ఆటలో జావెలిన్ త్రో ఈవెంట్ ఫైనల్‌లో భారత ఆటగాడు నీరజ్ కాంస్య పతకాన్ని సాధించాడు. ఈ తుదిపోరులో మన పొరుగు దేశం అయినటువంటి పాకిస్థాన్ జావెలిన్ త్రో ప్లేయర్ అర్షద్ నదీమ్ 92 మీటర్లతో స్వర్ణం దక్కించుకోగా,, భారత ఆటగాడు నీరజ్ 89.45 మీటర్లతో సిల్వర్‌ని సొంతం చేసుకుని భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాడు. దీంతో భారత్‌కి చెందిన నీరజ్ చోప్రాపై భారత్ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అభిమానులు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సహా.. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రశంసిస్తూ అభినందనలు తెలియజేశారు.


అయితే ఇప్పుడు తన ఆట ప్రదర్శనపై నీరజ్ చోప్రా రియాక్ట్ అయ్యాడు. తన ఆటను కొద్దిగా సమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ పేర్కొన్నాడు.భారతదేశానికి మెడల్ అందించినందుకు ఆనందంగానే ఉంది. కానీ నా ప్రదర్శనను ఇంకాస్త మెరుగులు దిద్దుతూ బెస్ట్‌గా ప్రదర్శన ఇవ్వాలంటూ కచ్చితంగా దీనిపై సమీక్షించుకుంటానని తెలిపాడు. దీనిపై ఇంకాస్త శ్రద్ధ కనబరుస్తానని వివరించాడు. పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో భారత్‌కు చెందిన ఆటగాళ్లు మంచి ప్రదర్శన చేస్తున్నారంటూ నీరజ్ తెలిపాడు. అంతేకాకుండా జావెలిన్ త్రో గట్టి పోటీ ఉందని తెలిపాడు. ప్రతి అథ్లెట్ కూడా తనదైన శైలిలో ఏదో ఒకరోజు అదరగొడుతాడని తెలిపాడు. ప్రస్తుతం ఇదొక ఆర్షద్‌డే అంటూ చెప్పుకొచ్చాడు. అయినా సరే నేను వందశాతం కష్టపడి ట్రై చేశాను. కానీ మరికొన్ని అంశాలపై దృష్టి సాధించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని నీరజ్ చెప్పుకొచ్చాడు. మన భారత గీతం వినిపించలేకపోయినందుకు నాకెంతో బాధగా ఉందని తెలిపాడు. కచ్చితంగా భవిష్యత్‌లో మరోసారి ఖచ్చితంగా సాధిస్తానని నీరజ్ ఎమోషనల్ పదాలను తెలిపాడు.

Also Read: తినడానికి తిండి లేదు.. తండ్రి కూలీ.. కట్ చేస్తే ఇప్పుడు ఒలింపిక్ హీరో


ఇక ఇదిలా ఉంటే.. గత ఏడాది కామన్ వెల్త్ గేమ్స్‌కు ముందు నీరజ్ స్వలంగా గాయాలపాలయ్యాడు. ఈ కారణంగా పోటీలకు దూరం అయ్యాడు. అనంతరం తీవ్రంగా శ్రమించి మరీ మళ్లీ ఫామ్‌లోకి వచ్చి తన సత్తాని చాటాడు. అదే ఊపుతో ఇప్పుడు సిల్వర్ మెడల్‌ని సాధించాడు. దీనిపై తన తండ్రి సతీష్ రియాక్ట్ అయ్యాడు. దేశం కోసం నీరజ్ కాంస్యాన్ని గెలుచుకున్నాడంటూ గర్వంగా తెలిపాడు. మేమంతా ఎంతో సంతోషంగా ఉన్నామంటూ ఆనందం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా నీరజ్ నేటితరం యువతకు స్పూర్తిగా నిలవాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×