EPAPER

Neeraj Chopra: పారిస్ ఒలింపిక్స్‌లో మరో రికార్డు.. బల్లెం వీరుడు నీరజ్‌కు రజతం

Neeraj Chopra: పారిస్ ఒలింపిక్స్‌లో మరో రికార్డు.. బల్లెం వీరుడు నీరజ్‌కు రజతం

Neeraj Chopra wins silver in Paris Olympics(Sports news headlines): భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరాజ్ చోప్రా మరో రికార్డు సాధించాడు. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి రజత పథకం అందించాడు. గురువారం అర్ధరాత్రి తర్వాత జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్‌లో పతకం గెల్చుకున్నాడు. ఈ ఒలింపిక్స్ లో భారత్ కు ఇదే తొలి రజతం కావడం విశేషం. దీంతో ఇప్పటి వరకు భారత్‌కు మొత్తం వచ్చిన పతకాల సంఖ్య ఐదుకు చేరింది.


పారిస్ ఒలింపిక్స్ లో జరిగిన జావెలిన్ త్రో ఫైనల్ మ్యాచ్‌లో నీరజ్ రెండో ప్రయత్నంలో 89.45 మీటర్లు విసిరాడు. దీంతో రెండో స్థానంలో నిలిచాడు. ఫైనల్ మ్యాచ్‌లో మొత్తం 12 మంది పోటీపడగా..పాక్ అథ్లెట్ నదీమ్ అర్షద్ 92.97 మీట్లరు విసరి స్వర్ణం సాధించాడు. అలాగే మూడో స్థానంలో నిలిచిన గ్రెనడా అథ్లెట్ పీటర్స్ అండర్సన్‌కు కాంస్యం వరించింది.

పారిస్ ఒలింపిక్స్‌లో రజతం సాధించడంతో ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించిన నాలుగో భారతీయుడిగా నీరాజ్ చోప్రా నిలిచాడు. అంతకుముందు సుశీల్ కుమార్(2008, 2012), పీవీ సింధు(2016, 2020), మనూ భాకర్(2024) అతని కంటే ముందున్నారు. మనూ ఈ ఒలింపిక్స్ లో రెండు మెడల్స్ గెలుచుకుంది. కాగా, నీరాజ్ చోప్రా..టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణం గెలుచుకోగా.. ఈ సారి రజతంతో సరిపెట్టుకున్నాడు.


ఒలింపిక్స్ లో నీరాజ్ సిల్వర్ గెలిచన తర్వాత స్వర్ణం గెలిచిన పాక్ అథ్లెట్ అర్షద్ నదీమ్‌కు అభినందనలు తెలిపాడు. 2016 నుంచి అర్షద్ తో పోటీ పడుతున్నానని, తొలిసారిగా ఓడిపోయానన్నారు. అయితే అర్షత్ చాలా కష్టపడ్డాడని, నా కంటే మంచి ప్రదర్శన చేశాడన్నాడు. కాగా, పారిస్ ఒలింపిక్స్ లో పాకిస్తాన్ 40 ఏళ్ల తర్వాత స్వర్ణం అందుకోవడం విశేషం.

పారిస్ ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా సిల్వర్ సాధించడంతో ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా విషెస్ తెలిపారు. మరోసారి అద్భుత ప్రదర్శన చేశారని కితాబిచ్చారు. ఈ పతకంతో భారత్ పొంగిపోయిందన్నారు. భవిష్యత్తులో మరిన్ని అథ్లెట్లు తమ కలల సాకారం చేసుకునేందుకు నీరాజ్ ప్రేరణగా ఉంటారన్నారు.

Also Read: భారత్ ఖాతాలో మరో పతకం.. ఇప్పటివరకు ఎన్ని గెలిచామంటే..?

నీరాజ్ చోప్రా రజతం సాధించడంతో దేశంలో 140 కోట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అతని కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది. అందరూ మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ఇక ఆయన తల్లి సరోజ్ దేవీ ఆనందం వ్యక్తం చేసింది. నీరాజ్ సిల్వర్ మెడల్ మాకు బంగారంతో సమానమని తెలిపారు. నీరజ్ కు గాయమైందని, అయినప్పటికీ మంచి ప్రదర్శన కనబర్చడంతో తాము చాలా సంతోషంగా ఉన్నామన్నారు. నీరాజ్ ఇంటికి వచ్చిన వెంటనే తనకు ఇష్టమైన ఆహారం చేస్తామన్నారు.

 

 

Related News

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Big Stories

×