EPAPER

Navjot Singh Sidhu: మళ్లీ కామెంటరీ బాక్స్ లోకి సిక్సర్ల సిద్దూ..

Navjot Singh Sidhu: మళ్లీ కామెంటరీ బాక్స్ లోకి సిక్సర్ల సిద్దూ..

navjot singh sidhu in ipl 2024


Navjot Singh Sidhu Re Entry Into Ipl Commentary Box(Sports news today): నవజ్యోత్ సింగ్ సిద్దూ.. మనిషి పైకి నవ్వుతూ కనిపిస్తున్నా చాలా ఆవేశం ఎక్కువ. క్రికెట్ ఆడే సమయంలోనే కారుతో ఒకరికి డ్యాష్ ఇచ్చి, అవతలి వ్యక్తి ముక్కు పగలగొట్టి, పెద్ద కేసు అయ్యింది. అప్పుడొక ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాల్సిన పరిస్థితిలో బీసీసీఐ కల్పించుకుని, తనని బయటకి తీసుకొచ్చింది.

జట్టులోకి తీసుకుంది. అంటే అప్పుడు తనెంత విలువైన ఆటగాడో మీరే అర్థం చేసుకోండి. మొదటి 6 ఓవర్లు పవర్ ప్లే పెట్టిన కొత్తలో ఓపెనర్ గా వెళ్లి మెరుపులు మెరిపించిన వారిలో ఇండియాలో నెంబర్ వన్ నవజ్యోత్ సింగ్ సిద్దూ అనే చెప్పాలి. ఇంక శ్రీలంక ఓపెనర్ సనత్ జయసూర్య, ఆస్ట్రేలియా ఓపెనర్ గిల్ క్రిస్ట్, మార్క్ వా ఇలా ఎందరో ఒక వెలుగు వెలిగారు.


ఫీల్డర్స్ తలల మీద నుంచి కొట్టడంలో సిద్దూని మించినవారు లేరంటారు. తనని అందరూ సిక్సర్ల సిద్దూగా పిలుచుకుంటారు. అలాంటి సిద్ధూ టీవీ షోల్లో పాల్గొంటాడు. కామెడీ షోలకు వెళుతుంటాడు. జడ్జ్ గా వెళుతుంటాడు. తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి మంత్రి కూడా అయ్యాడు.

Also Read: కింగ్ కోహ్లీ ఉన్నా.. ఆర్సీబీ ఎందుకు ట్రోఫీ గెలవలేదు..?

ఇప్పుడిదంతా ఎందుకంటే నవజ్యోత్ సింగ్ సిద్దూ మళ్లీ కామెంటేటర్ గా అవతారం ఎత్తాడు. ఎప్పుడో పదేళ్ల క్రితం మైక్ పట్టుకున్న సిద్దూ మళ్లీ ఇన్నాళ్లకి క్రికెట్ పై మనసు పుట్టి ఐపీఎల్ కి వచ్చాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోవడంతో ఖాళీగా ఉండలేక వచ్చానని కూడా అన్నాడు. తన ఫస్ట్ లవ్ ఎప్పుడూ క్రికెట్ అనే చెప్పాడు.

క్రికెట్ కెరీర్‌లో ఎన్నో వివాదాలు, ఒడిదుడుకుల మధ్య 20 సార్లు టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చినా.. కామెంటేటర్‌గా మాత్రం ఇదే తొలి రీఎంట్రీ అని స్పష్టం చేశాడు. గతంలో రూ. 60-70 లక్షలు తీసుకునేవాడినని, ప్రస్తుతం రోజు రూ. 25 లక్షలు తీసుకుంటున్నట్టు తెలిపాడు. క్రికెట్ ని ఆస్వాదిస్తూ చెప్పడాన్ని ఎంజాయ్ చేస్తానని అన్నాడు.

భారత క్రికెట్ టీమ్ గురించి మాట్లాడుతూ.. ఫామ్ తో సంబంధం లేకుండా కోహ్లీ, రోహిత్ శర్మలను జట్టులోకి తీసుకోవాలని అన్నాడు. వారుంటే టీమ్ అంతటికి ఒక ధైర్యం, ఒక నమ్మకమని అన్నాడు. సచిన్ లాగే వీరిద్దరూ కూడా భారత క్రికెట్ దిగ్గజాలని అన్నాడు.

Related News

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

IND vs BAN: ఇది గంభీర్ కు పరీక్ష.. రేపటి నుంచి బంగ్లాతో తొలిటెస్టు

IPL 2025: ముంబైలో ప్రకంపనలు…కొత్త కెప్టెన్​ అతడే..రోహిత్‌, పాండ్యా ఔట్‌?

Women’s T20 World Cup 2024: మహిళల టీ 20 ప్రపంచకప్.. వారితో సమానంగా.. ప్రైజ్ మనీ

Kohli Vs Gambhir: ఐపీఎల్‌ లో తన్నుకున్నారు..ఇప్పుడు వాళ్లే టీమిండియాలో చీలిక తెచ్చారు..ప్రోమో అదుర్స్‌ !

Ind Vs Ban: 3 మార్పులతో బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్ కు టీమిండియా రెడీ..ఫ్రీగా మ్యాచ్‌ ఎలా చూడాలంటే..?

Yashasvi Jaiswal: యశస్వి జైశ్వాల్ ముంగిట.. అద్భుత రికార్డ్

Big Stories

×