EPAPER

Naveen Ul Haq : అది ఆటలో మామిడి పండు .. ఆఫ్గాన్ క్రికెటర్ నవీన్ ఉల్ హక్

Naveen Ul Haq : అది ఆటలో మామిడి పండు .. ఆఫ్గాన్ క్రికెటర్ నవీన్ ఉల్ హక్

Naveen Ul Haq : పాత రోజుల్లో చిన్న పిల్లలు ఆటలాడుతూ దెబ్బలు తగిలించుకున్నా, లేక గొడవలు పడినా వారికి సర్ది చెప్పడానికి ఆనాడు పెద్దలు ఒక మాట అనేవారు…‘అది ఆటలో అరటిపండు’ వదిలేయండని చెప్పేవారు. అది చివరికి జాతీయంగా కూడా మారిపోయింది.


ఇప్పడా ఆటలో అరటి పండు గొడవ ఎందుకొచ్చిందంటే…అదిగో ఆఫ్గాన్ క్రికెటర్ ఉన్నాడు కదా తను గుర్తు చేశాడు. అయితే తను అరటి పండుకు బదులు మామిడి పండు అన్నాడు. ఇంతకీ ఆ కథా కమామిషు ఏమిటంటే.. ఇది ఇంటర్నేషనల్ ఆటలో జరిగింది కాదు, మన ఇండియన్ ఐపీఎల్ లో జరిగింది. ఆర్సీబీ తరపున విరాట్ కోహ్లీ ఆడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఈ గొడవకు ప్రధాన కారణమైన ఆఫ్గాన్ క్రికెటర్ నవీన్ ఉల్ హక్ మరోవైపు లక్నో సూపర్ జైంట్స్ తరపున ఆడుతున్నాడు.

విషయం ఏమిటంటే నవీన్ ఉల్ హక్ అప్పుడప్పుడు ఇన్స్‌టాగ్రామ్ వేదికగా విరాట్ కోహ్లీని పరోక్షంగా టార్గెట్‌ చేస్తూ పోస్టింగులు చేస్తుంటాడు. ఆ క్రమంలో 2023 సీజన్ ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుండగా విరాట్ కోహ్లీ త్వరగా ఔట్ అయ్యాడు.  మ్యాచ్ చూస్తున్న నవీన్ ఉల్ హక్ ఏం చేశాడంటే కుదురుగా ఉండకుండా ఒక పోస్ట్ పెట్టి విరాట్‌ ని గిల్లాడు.


మంచిగా కోసిన మామిడి పండ్లతో ఉన్న ఒక ఫోటోను షేర్ చేస్తూ స్వీట్ మ్యాంగోస్ అంటూ రాసుకొచ్చాడు. అయితే ఇది విరాట్ కోహ్లీని ఉద్దేశించే పోస్ట్ చేశాడంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా నవీన్‌ను విపరీతంగా ట్రోల్ చేశారు. నువ్వు నీ లిమిట్స్ క్రాస్ చేస్తున్నావ్ జాగ్రత్త అంటూ వార్నింగ్ లు కూడా ఇచ్చారు.

ఇంతవరకు బాగానే ఉంది..అయితే ఇప్పుడు తాజాగా నవీన్ ఉల్ హక్ ఒక పోస్ట్ పెట్టాడు. కొహ్లీకి నాకు మధ్య గొడవల్లేవు అని తెలిపాడు. వరల్డ్ కప్ 2023లో భాగంగా ఆఫ్గాన్ తో జరిగిన మ్యాచ్ లో కొహ్లీనా వైపు చూసి, దీనిని ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టమని చెప్పాడు. నేను సరేనని అన్నాను. ఆ తర్వాత మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యామని తెలిపాడు. వాళ్లిద్దరూ కలిసి నవ్వుతున్న ఫొటో కూడా షేర్ చేశాడు.

ఆ మామిడిపండ్లు ఎందుకు పెట్టాడో కూడా వివరించాడు.  తనకు మామిడిపండ్లు అంటే చాలా ఇష్టమని తెలిపాడు. ఆరోజు పండ్లు తింటూ ఆర్సీబీ-ముంబై ఇండియన్స్ మ్యాచ్ చూశానని వివరించాడు. కేవలం మ్యాంగోస్ చాలా తీపిగా ఉన్నాయని మాత్రమే ఫోటో పెట్టానని అన్నాడు. పోనీ నేను పెట్టిన పోస్ట్ లో కొహ్లీ ఉంటే, మీ ట్రోలింగ్ లో అర్థం ఉందని అన్నాడు. కానీ కోహ్లీ ఫ్యాన్స్ అపార్థం చేసుకుని, నన్ను ట్రోల్ చేశారని విచారం వ్యక్తం చేశాడు.

Related News

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

IND vs BAN: ఇది గంభీర్ కు పరీక్ష.. రేపటి నుంచి బంగ్లాతో తొలిటెస్టు

IPL 2025: ముంబైలో ప్రకంపనలు…కొత్త కెప్టెన్​ అతడే..రోహిత్‌, పాండ్యా ఔట్‌?

Women’s T20 World Cup 2024: మహిళల టీ 20 ప్రపంచకప్.. వారితో సమానంగా.. ప్రైజ్ మనీ

Kohli Vs Gambhir: ఐపీఎల్‌ లో తన్నుకున్నారు..ఇప్పుడు వాళ్లే టీమిండియాలో చీలిక తెచ్చారు..ప్రోమో అదుర్స్‌ !

Ind Vs Ban: 3 మార్పులతో బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్ కు టీమిండియా రెడీ..ఫ్రీగా మ్యాచ్‌ ఎలా చూడాలంటే..?

Yashasvi Jaiswal: యశస్వి జైశ్వాల్ ముంగిట.. అద్భుత రికార్డ్

Big Stories

×