EPAPER

SL vs SA T20 WC Pitch Report: ఈ పిచ్ కి.. ఓ దండం.. న్యూయార్క్ లో మ్యాచ్ లపై నెటిజన్లు

SL vs SA T20 WC Pitch Report: ఈ పిచ్ కి.. ఓ దండం.. న్యూయార్క్ లో మ్యాచ్ లపై నెటిజన్లు

Nassau Stadium Pitch Sparks Debate After Low-Scoring T20 WC Match SA vs SL:న్యూయార్క్ పిచ్ కి ఓ దండం అండీ బాబూ.. ఇది వరల్డ్ కప్ అనుకున్నారా? లేక ఇళ్ల ముందు ఆడుకునే గల్లీ మ్యాచ్ లు అనుకున్నారా? అని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలా డెడ్ పిచ్ లను తయారుచేస్తే.. ప్రపంచకప్ మీద ఎవరికి ఇంట్రస్ట్ ఉంటుంది. మహామహా ఆటగాళ్లందరూ ఇలా వెళ్లి అలా బ్యాట్లను సంకలో పెట్టుకుని తిరిగి వచ్చేస్తుంటే.. ఇంక ఆటలో మజా ఏం ఉంటుంది? అని నెట్టింట తీవ్రంగా విమర్శలు వినిపిస్తున్నాయి.


మొదట టీమ్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య అమెరికాలోని న్యూయార్క్ లో వార్మప్ మ్యాచ్ జరిగింది. అప్పుడు కూడా ఇలాగే పిచ్ మందకొడిగా ఉండేసరికి, మొత్తానికి ఏదో అవస్థలు పడి టీమ్ ఇండియా 182 పరుగులు చేసింది. ఎట్టకేలకు 60 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఇప్పుడు ఇదే పిచ్ పై శ్రీలంక వర్సెస్ సౌతాఫ్రికా మధ్య ప్రపంచకప్ తొలి మ్యాచ్ జరిగింది. రెండు జట్లు కూడా అంతర్జాతీయ క్రికెట్ లో అనుభవం ఉన్న జట్లు. అంతేకాదు మంచి క్రీడాకారులు ఉన్నారు. అయినా సరే, శ్రీలంక 77 పరుగులు చేయడానికి అపసోపాలు పడింది. ఆలౌట్ అయిపోయింది. ఇక లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికాకి ముచ్చెమటలు పట్టాయి. 77 పరుగులు చేయడానికి 4 వికెట్లు కోల్పోయింది. 16.2 ఓవర్లు పట్టింది.


ఇంతకీ.. ఈ న్యూయార్క్ పిచ్ పై ఇంతగా పట్టి పట్టి ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. రేపు ఇదే పిచ్ పై ఐర్లాండ్ తో టీమ్ ఇండియా తొలి మ్యాచ్ ఆడనుంది. అంతకు మించి 9వ తేదీ ఆదివారం నాడు పాకిస్తాన్ తో మ్యాచ్ జరగనుంది. ఇప్పుడు టీ 20 ప్రపంచకప్ లో జరిగే మ్యాచ్ లన్నీ ఒకెత్తు.. ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ ఒకెత్తుగా  అందరూ అభివర్ణిస్తున్నారు.

Also Read: న్యూయార్క్ పిచ్ పై.. పడుతూ లేస్తూ గెలిచిన సౌతాఫ్రికా

ఇలాంటి సమయంలో ఈ డెడ్ పిచ్ పై పరుగులు ఎలా చేయాలో తెలీక బ్యాటర్లు తలలు పట్టుకుంటున్నారు. అంతేకాక పాకిస్తాన్ లో మనకన్నా వేగంగా వేసే ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. టీమ్ ఇండియా ఎంతవరకు వీరిని ఫేస్ చేస్తుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. ఇన్ని సమస్యల మధ్య టీమ్ ఇండియా గ్రూప్ మ్యాచ్ లు మూడు ఇక్కడే ఆడనుంది. మరి మనవాళ్లు ఈ డెడ్ పిచ్ ఎలా ఆడతారో వేచి చూడాల్సిందే.

Related News

Rohit Sharma: 2027 వరకు రోహిత్ శర్మనే కెప్టెన్..కాంగ్రెస్ ప్రకటన

Mohammed Shami: మహమ్మద్ షమీది దొంగ ప్రేమ..మాజీ భార్య హాసిన్ సంచలనం!

Ind vs Ban: హైదరాబాద్‌లో భారత్-బంగ్లాదేశ్‌ మ్యాచ్.. నేటి నుంచి టికెట్ల విక్రయం

Ms Dhoni: RCBపై కోపంతో ధోనీ… TV పగలగొట్టేశాడు..క్లారిటీ ఇదే?

Rashid Khan: పెళ్లి చేసుకున్న స్టార్ క్రికెట‌ర్ ర‌షీద్ ఖాన్‌..ఒకే రోజూ 4 గురికి !

T20 World Cup: నేడు మహిళా టీ20 ప్రపంచకప్‌లో ఇండియా-న్యూజిలాండ్‌ మ్యాచ్‌

Telangana BIG TV Cricket League : తమన్ ఊచకోత.. 34 బంతుల్లో సెంచరీ

×