Big Stories

IPL : మధ్వాల్ సూపర్ బౌలింగ్.. ముంబై గ్రాండ్ విక్టరీ.. లక్నో అవుట్..

IPL : ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబై చెలరేగింది. లక్నోను 81 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. కామెరూన్ గ్రీన్ (41), సూర్యకుమార్ యాదవ్ (33), తిలక్ వర్మ (26), నేహల్ వదేరా (23) మెరుపులు మెరిపించారు. దీంతో జట్టులో ఒక్కరూ కూడా హాఫ్ సెంచరీ చేయకపోయినా ముంబై భారీ స్కోర్ సాధించింది. లక్నో బౌలర్లు వికెట్లు పడగొట్టినా పరుగులను నియంత్రించలేకపోయారు. నవీన్ హుల్ హక్ 4 వికెట్లు, యశ్ ఠాకూర్ 3 వికెట్లు, మోసిన్ ఖాన్ ఒక వికెట్ తీశారు.

- Advertisement -

183 పరుగుల లక్ష్య చేధనలో లక్నో తడబడింది. మార్కస్ స్టొయినిస్ (40) మినహా మరో బ్యాటర్ కనీసం 20 పరుగులు కూడా చేయలేదు. కైల్ మేయర్స్ (18), దీపక్ హుడా (15) మాత్రమే రెండెంకల స్కోర్ చేశారు. ఆరుగురు బ్యాటర్లు 3 పరుగుల లోపే అవుట్ అయ్యారు. ముగ్గురు కీలక బ్యాటర్లు రనౌట్ కావడం లక్నో కొంపముంచింది. ఇలా బ్యాటింగ్ లో పూర్తిగా విఫలం కావడంతో లక్నో 16.3 ఓవర్లకే 101 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

- Advertisement -

ముంబై బౌలర్ ఆకాష్ మధ్వాల్ లక్నో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. మధ్వాల్ 5 పరుగుల మాత్రమే ఇచ్చి ఐదుగురు బ్యాటర్లను పెవిలియన్ కు పంపాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌ లో అతి తక్కువ పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా కుంబ్లే పేరిట ఉన్న రికార్డును మధ్వాల్‌ సమం చేశాడు. క్రిస్ జోర్డాన్, పియూష్ చావ్లా తలో వికెట్ తీశారు. అద్భుత బౌలింగ్ తో ముంబైకు ఘన విజయాన్ని అందించిన ఆకాష్ మధ్వాల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

క్వాలిఫైయర్ -2 లో శుక్రవారం ముంబై జట్టు గుజరాత్ తో తలపడుతుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు చెన్నైతో ఫైనల్ ఆడుతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News