EPAPER
Kirrak Couples Episode 1

Morocco shocked Belgium : మొరాకో కిర్రాక్ షో!

Morocco shocked Belgium : మొరాకో కిర్రాక్ షో!

Morocco shocked Belgium : ఫిఫా వరల్డ్‌కప్‌లో మరో సంచలనం. అసలు ఏ మాత్రం అంచనాలు లేని మొరాకో… ప్రపంచంలోని అగ్రశ్రేణి జట్లలో రెండోస్థానంలో ఉన్న బెల్జియంకు షాకిచ్చింది. అది కూడా మామూలుగా కాదు. ఏకంగా 2-0 గోల్స్ తోడాతో మొరాకో గెలవడంతో… ఆ జట్టు అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. గ్రూప్-Fలో 3 పాయింట్లతో ఉన్న బెల్జియం… మొరాకోపై ఈజీగా గెలిచి 6 పాయింట్లతో ప్రీ క్వార్టర్స్ బెర్త్ ఖరారు చేసుకుంటుందని అందరూ భావించారు. బెల్జియం వరల్డ్ సెకండ్ ర్యాంకర్ కావడం, మొరాకో ఎక్కడో 22వ స్థానంలో ఉండటంతో… ఆ జట్టుపై ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. కానీ, ఈ వరల్డ్‌కప్‌లో ఆరంభం నుంచి సంచలనాలు నమోదవుతుండటంతో… మొరాకో ఏదైనా అద్భుతం చేస్తుందేమోనని ఆశించారు… ఆ జట్టు అభిమానులు. వాళ్లు ఉహించినట్టే మొరాకో కిర్రాక్ ఆట ఆడింది. 2-0 గోల్స్ తేడాతో బెల్జియంపై సంచలన విజయం సాధించి… 4 పాయింట్లతో గ్రూప్-Fలో రెండో స్థానానికి చేరింది. ఆట ఆరంభం నుంచే రెండు జట్ల ఆటగాళ్లు హోరాహోరీగా తలపడ్డారు. గోల్ పోస్టుల మీద పరస్పరం దాడులు చేసుకున్నారు. ఐదో నిమిషంలోనే బెల్జియం గోల్ ప్రయత్నం చేసినా… బంతి నెట్లో పడకుండా గోల్ పోస్ట్ మీదుగా వెళ్లిపోయింది. తొలి అర్ధభాగం తర్వాత మొరాకో గోల్ చేసినా… ఆ జట్టు ఆటగాడు హకీమ్ జియోచ్ ఆఫ్‌సైడ్‌లో ఉండటంతో… రిఫరీ గోల్ ఇవ్వలేదు. ఆట 65వ నిమిషంలో బెల్జియం గోల్ ప్రయత్నాన్ని… మొరాకో గోల్ కీపర్ అడ్డుకున్నాడు. చివరికి 73వ నిమిషంలో మొరాకో ఆటగాడు అబ్దెల్ హమీద్‌ ఫ్రీ కిక్‌ను గోల్‌గా మలిచి జట్టును 1-0 గోల్స్ ఆధిక్యంలో నిలిపాడు. రెండో అర్థభాగం ముగిశాక అదనపు సమయంలో జకారియా రెండో గోల్‌ చేసి… మొరాకో ఆటగాళ్లు, అభిమానులు సంబరాల్లో మునిగిపోయేలా చేశాడు. ఫిఫా ప్రపంచకప్‌లో 1998 తర్వాత మొరాకోకు ఇదే తొలి విజయం కాగా.. ఓవరాల్‌గా మూడో గెలుపు.


Tags

Related News

Bigg Boss 8 Telugu Promo: విష్ణుప్రియాకు నైనికా వెన్నుపోటు, సీత చేతికి ఆయుధం.. ఈసారి చీఫ్ అయ్యేది ఎవరు?

Medigadda: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. మేడిగడ్డ నిర్మాణ సంస్థకు ఊహించని షాక్.. వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ రద్దు!

Monkeypox Virus: డేంజర్ బెల్స్.. మరో మంకీపాక్స్‌ కేసు.. ఎమర్జెనీకి దారితీసిన వైరస్ ఇదే!

Heavy Rain: రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. కీలక సూచనలు!

Animal Oil Making: జంతుల కొవ్వుతో నూనె ఎలా తయారు చేస్తారు? కల్తీని ఎలా గుర్తించాలి? ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలు!

Rhea Singha: ‘మిస్ యూనివర్స్ ఇండియా 2024’.. ఎవరో తెలుసా?

Weather Update: బిగ్ అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు భారీ వర్షాలు

Big Stories

×