EPAPER

Mohammed Shami practice: ప్రాక్టీసులో మహమ్మద్ షమి, బంగ్లాదేశ్ సిరీస్ కోసం..

Mohammed Shami practice: ప్రాక్టీసులో మహమ్మద్ షమి, బంగ్లాదేశ్ సిరీస్ కోసం..

Mohammed Shami practice: టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమి ప్రాక్టీసులో బిజీ అయ్యాడు. జట్టు లోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ముందుగా తన ఆటతీరును మెరుగుపరుచు కునేం దుకు కసరత్తు చేస్తున్నాడు. అంతా అనుకున్నట్లు జరిగితే స్వదేశంలో బంగ్లాదేశ్ సిరీస్‌కు అందుబాటులో రావడం ఖాయంగా కనిపిస్తోంది.


టీమిండియా కీలకమైన ఆటగాళ్లలో మహమ్మద్ షమి ఒకడు. ఈ ఏడాది మేజర్ టోర్నమెంట్ మిస్సయ్యాడు. ఐపీఎల్, టీ‌20 టోర్నమెంట్‌ మిస్సయ్యాడు. కాలు చీలమండ గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్నాడు. ఆపరేషన్ సక్సెస్ కావడంతో కోలుకున్నాడు. ప్రస్తుతం బెంగుళూరులో ఉన్నాడు.అక్కడ జాతీయ క్రికెట్ అకాడమీలో ముమ్మరంగా ప్రాక్టీసు చేస్తున్నాడు. మునుపటి ఫామ్‌ని అందుకునేందుకు సాధనలో నిమగ్నమయ్యాడు.

అంతా అనుకున్నట్లు జరిగితే స్వదేశంలో జరిగే బంగ్లాదేశ్ సిరీస్‌కు అందుబాటులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జై షా చెప్పుకొచ్చాడు. జట్టులోకి రావాలనుకునేవారు కచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడాలని ఇప్పటికే ఆటగాళ్లకు ఓపెన్‌గా చెప్పేశారు. ఇందులోభాగంగా దేశవాళీలో రాణించాలని ఆలోచన చేస్తున్నాడు షమి. ప్రస్తుతం రోజుకు ఆరేడు గంటలు నెట్ ప్రాక్టీసు చేస్తున్నాడు. ఆయన బౌలింగ్‌ యాక్షన్‌ను అకాడమీ క్షుణ్ణంగా గమనిస్తోంది.


ALSO READ: కొహ్లీ మారిపోయాడు.. వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా

గతేడాది రిషబ్‌ పంత్, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్, బూమ్రా, శ్రేయస్ అయ్యర్ వంటి ఆటగాళ్లు గాయాలయ్యాయి. ఆపరేషన్ తర్వాత బెంగుళూరు అకాడమీలో ప్రాక్టీసు చేశారు. సక్సెస్ అయి జట్టులోకి వచ్చారు. షమి కూడా అందుబాటులోకి వస్తే టీమిండియా అన్ని విభాగాల్లో బలంగా కనిపించడం ఖాయమని అంటున్నారు క్రికెట్ లవర్స్.

 

Related News

Virat Kohli: కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ షురూ..!

India vs Bangladesh 1st Test: ఒక్కటి గెలిస్తే చాలు.. 92 ఏళ్ల రికార్డు బ్రేక్

MS Dhoni: ధోనీ.. ఓసారి వాటర్ బాటిల్ తన్నేశాడు.. తెలుసా? : బద్రీనాథ్

Piyush Chawla: గంభీర్‌కి.. కొహ్లీ రికార్డులన్నీ తెలుసు: చావ్లా

Cristiano Ronaldo: సోషల్ మీడియాలో అతని ఫాలోవర్స్.. 100 కోట్లు

Bangladesh Team: ఒక్కరు తప్ప.. అంతా వస్తున్నారు!: బంగ్లా జట్టు ప్రకటన

India’s Paralympic Champions: పారాలింపిక్స్ విజేతలకు.. మోదీ మార్క్ ఆతిథ్యం

Big Stories

×