EPAPER

Mohammad Rizwan: బాబర్ పై బ్యాట్ విసిరిన రిజ్వాన్ : డబుల్ సెంచరీ మిస్ అయినందుకేనా?

Mohammad Rizwan: బాబర్ పై బ్యాట్ విసిరిన రిజ్వాన్ : డబుల్ సెంచరీ మిస్ అయినందుకేనా?

Mohammad Rizwan: అత్తమీద కోపం దుత్త మీద చూపినట్టు.. కెప్టెన్ మీద కోపం బాబర్ మీద చూపించాడు. పాకిస్తాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్. రావల్పిండిలో బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలిటెస్టు మ్యాచ్ లో పాక్ మొదట బ్యాటింగ్ చేసింది. రెండోరోజు ఆట ఇంకా జరుగుతుండగా పాక్ కెప్టెన్ షాన్ మసూద్ 448 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు.


అప్పటికి రిజ్వాన్ 171 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. అదే తన కోపానికి కారణమైంది. విసురుగా డగౌట్ వైపు వస్తూ అక్కడే ఉన్న మాజీ కెప్టెన్ బాబర్ అజామ్ మీదకి విసురుగా బ్యాట్ విసిరేశాడు. అయితే బాబర్ క్యాచ్ పట్టుకుని నవ్వుతూ మళ్లీ తిరిగిచ్చేశాడు. రిజ్వాన్ డబుల్ సెంచరీ చేయకుండా ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం కరెక్ట్ కాదని సీనియర్లు కూడా వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ నేపథ్యంలో పాక్ కెప్టెన్ షాన్ మసూద్ మాట్లాడుతూ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే విషయం రిజ్వాన్ కి తెలుసునని అన్నాడు. తనని అడిగే డిక్లేర్ చేశామని, తను అంగీకరించాడని వివరణ ఇచ్చాడు. అయితే చాలామంది అనేదేమిటంటే, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసేద్దామని కెప్టెన్ అంటే, వద్దు. నేను డబుల్ సెంచరీ చేయాలని ఎవరూ చెప్పరు. నువ్వు ఆ మాట తనదగ్గర అనకూడదని అంటున్నారు.


Also Read: మూడు సూపర్ ఓవర్లు.. నరాలు తెగే ఉత్కంఠ పోరులో హుబ్లీ టైగర్స్ విజయం!

ఇప్పుడా బ్యాట్ విసిరేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే రిజ్వాన్ తన కెరీర్ లో తొలి డబుల్ సెంచరీని మిస్ అయ్యాడని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి పాకిస్థాన్ కెప్టెన్ షాన్ మసూద్.. తమ తొలి ఇన్నింగ్స్‌ను 448/6 కు డిక్లేర్ చేశాడు. చివరి సెషన్‌లో బంగ్లాదేశ్‌ను కొన్ని ఓవర్లు ఆడించి వికెట్లు తీయాలనే ప్రణాళికలతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. కానీ కెప్టెన్ వ్యూహాత్మక నిర్ణయం బెడిసి కొట్టినట్టే కనిపిస్తోంది. ఎందుకంటే బంగ్లాదేశ్ కూడా గట్టిగానే బదులిస్తోంది.

మూడోరోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసింది. ఇంకా 132 పరుగులు వెనుకపడి ఉంది. చేతిలో ఇంకా 5 వికెట్లు ఉన్నాయి. క్రీజులో లిటన్ దాస్ (52), ముషాఫిర్ రహీమ్ (55) ఉన్నారు. రెండురోజుల ఆట మిగిలి ఉంది. ఈ తీరు చూస్తుంటే తొలి టెస్ట్ డ్రా అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మాత్రం దానికి అనవసరంగా రిజ్వాన్ డబుల్ సెంచరీ త్యాగం చేశాడని పలువురు కామెంట్ చేస్తున్నారు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×