EPAPER

Michelle Johnson : డేవిడ్ వార్నర్ పై జాన్సన్ వ్యాఖ్యలు.. మండిపడుతున్న సీనియర్లు..

Michelle Johnson : డేవిడ్ వార్నర్ పై జాన్సన్ వ్యాఖ్యలు.. మండిపడుతున్న సీనియర్లు..
Michelle Johnson

Michelle Johnson : ఒకప్పుడు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లలో ఎక్స్ ప్రెస్ బౌలర్ గా పేరు తెచ్చుకున్న మిచెల్ జాన్సన్, ఇప్పుడు కోరి వివాదాలను తెచ్చుకుని, నెట్టింట నలిగిపోతున్నాడు.


ఇంతకీ విషయం ఏమిటంటే అతను విదేశీ ప్లేయర్ అయినా సరే, భారతీయులు ఆత్మీయంగా  పుష్ప-3 అని పిలుచుకునే డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ ముందు వివాదాల్లో పడ్డాడు. ఎప్పుడూ నవ్వుతూ, అందరినీ నవ్విస్తూ, చిన్నపిల్లాడిలా ప్రవర్తించే వార్నర్ కి రిటైర్మెంట్ ముందు ఇలా జరగడం సరికాదని క్రికెట్ అభిమానులు బాధపడుతున్నారు.

వార్నర్ ఇంత బాధకి కారణం తన దేశానికే చెందిన ఫాస్ట్ బౌలర్, మాజీ ఆటగాడు మిచెల్ జాన్సన్ కావడమే…


పాకిస్తాన్ తో జరగనున్న ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ సిరీస్ తనది ఆఖరు అని, రిటైర్మెంట్ తీసుకుంటానని తను ప్రకటించాడు. దాంతో ఆస్ట్రేలియన్ బోర్డు అతనికి ఘనంగా వీడ్కోలు ఇవ్వాలని భావించి, ఆ సిరీస్ కి ఎంపిక చేసింది. అక్కడ భారీ ఏర్పాట్లు కూడా చేస్తోంది. మరెందుకు జాన్సన్ బరస్ట్ అయ్యాడో తెలీదు. డేవిడ్ వార్నర్ ని తీవ్రంగా అవమానించాడు.

టెస్ట్ మ్యాచ్ ల్లో ఫామ్ కోల్పోయి, అవస్థలు పడుతున్న తనని ఎంపిక చేయడమే కాకుండా, అతనికి ఘనంగా వీడ్కోలు కూడా ఇస్తారా? అని ప్రశ్నించాడు. బాల్ టాంపరింగ్ కేసులో స్టీవ్ స్మిత్ తో సహా, వార్నర్ కూడా శిక్ష అనుభవించాడు. అతనికి ఘనసన్మానమా? అని మండిపడ్డాడు.

జాన్సన్ వ్యాఖ్యలపై సీనియర్లు అతన్ని ఘాటుగా విమర్శిస్తున్నారు.  ఆస్ట్రేలియా చీఫ్ సెలక్టర్ జార్జ్ బెయిసీ తీవ్రంగా స్పందించాడు. “మిచెల్ జాన్సన్ బాగానే ఉన్నాడా? ఎవరికైనా చూపించాలా? అని అనుమానం వ్యక్తం చేశాడు. ఆట సరిగ్గా ఆడటం లేదని విమర్శించు, అంతేగానీ వ్యక్తిగతంగా ఎవరినీ నిందించూడదని హితవు పలికారు.

“డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌లు ఆస్ట్రేలియా క్రికెట్‌కు ఎన్నో సేవలు అందించారు. బాల్ టాంపరింగ్ వివాదంలో శిక్ష కూడా అనుభవించారు. నా దృష్టిలో వీరిద్దరూ హీరోలు. ఒకరిని విమర్శించే అర్హత ఇంకెవరికీ లేదు. మిచెల్ జాన్సన్ ఏమైనా పెర్ ఫెక్టా? అని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఉస్మాన్ ఖవాజా ప్రశ్నించారు.

నాకు తెలిసి వార్నర్-జాన్సన్ మధ్య విభేదాలేమీ లేవు. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకి మేలు చేసిన వారిని ఇలా విమర్శించడం సరికాదని క్లార్క్ అన్నాడు.

 ఒక ఆటగాడికిచ్చే గౌరవం ఇదేనా? నువ్వూ తోటి ఆటగాడివే కదా…అని కొందరు అంటున్నారు. మనసులో ఇంత కక్ష పెట్టుకుని, ఇలా నవ్వూతూ ఎలా ఉన్నావని కొందరు ప్రశ్నిస్తున్నారు.

డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా హీరో అని కొనియాడుతున్నారు. 2023 వన్డే వరల్డ్ కప్ లో రెండు సెంచరీలతో 535 పరుగులు చేశాడు. ఇప్పుడు సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అతన్ని టెస్ట్ సిరీస్ కి ఎంపిక చేయడం సరైన నిర్ణయమే అంటున్నారు.

డేవిడ్ వార్నర్ మాత్రం టెస్ట్ సిరీస్ కి వార్నర్ ని ఎంపిక చేసినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పాడు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×