EPAPER

IPL 2024 MI vs RR: పాండ్యా దశ మారుతుందా? నేడు ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్

IPL 2024 MI vs RR: పాండ్యా దశ మారుతుందా? నేడు ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్
Mumbai Indians vs Rajasthan Royals match
MI vs RR Today Match Prediction(Latest sports news telugu): ఐపీఎల్ 2024 కొత్త సీజన్ అంతా ఒక ఎత్తు అయితే, ముంబై ఇండియన్స్ వరకు ఒక ఎత్తుగా మారిపోయింది. నేడు ముంబైలో రాజస్తాన్ రాయల్స్ తో జరగనున్న మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ పెద్ద చర్చనీయాంశంగా మారనుంది. ఇప్పటికి రెండు మ్యాచ్ లు ఓడిన ముంబై… ఈసారైనా గెలుస్తుందా? లేక మూడోది కూడా ముచ్చటగా ఓడిపోతుందా? అని నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.

హోంగ్రౌండ్ కావడంతో అది ముంబైకి బలం అని కొందరంటున్నారు. ఆడేవాళ్లందరూ మనస్ఫూర్తిగా ఆడకపోతే,  ఏ గ్రౌండ్ అయితే ఏమిటి? అని కొందరంటున్నారు. రాజస్థాన్ రాయల్స్ కూడా బలంగానే ఉంది. సంజు శాంసన్ నాయకత్వంలో ఆడిన రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించి 4 పాయింట్లతో టేబుల్ టాప్ 3లో ఉంది.


ధ్రువ్ జురెల్, శుభమ్ దుబె, యశస్వి జైశ్వాల్, రియాన్ పరాగ్ లతో ఆర్ ఆర్ జట్టు కళకళలాడుతోంది. ఇంకా షిమ్రోన్ హెట్ మెయిర్, జాస్ బట్లర్, సంజూ శాంసన్ ఉన్నారు. అశ్విన్, కేశవ్ మహారాజ్ ఉన్నారు. ఇలా నిండుకుండలా ఉంది.

Also Read: రాణించిన సాయి సుదర్శన్.. టైటాన్స్ ఘనవిజయం..


ముంబై ఇండియన్స్ కి వచ్చేసరికి ముగ్గురు ఆటగాళ్లు మారేలా కనిపిస్తున్నారు. నమన్ ధీర్ ప్లేస్ లో సూర్యకుమార్ యాదవ్ వచ్చేలా ఉన్నాడు. అందుకు ఎన్సీఏ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ముంబై అతనికోసం ఎదురుచూస్తోంది.

ముంబై స్పిన్నర్ షామ్స్ ములానీ ప్లేస్ లో ఆల్ రౌండర్ అర్జున్ టెండుల్కర్ రానున్నాడు. తను సచిన్ కుమారుడనే సంగతి అందరికీ తెలిసిందే. అతనికి అవకాశాలు ఇవ్వడం లేదనే, రోహిత్ ను తప్పించారనే విమర్శలు వినిపించాయి. ఏదొక వంక పేరుతో జట్టులోకి తనని తీసుకుంటున్నారని అంటున్నారు. ఒకవేళ తను వస్తే ఆఫ్గాన్ ఆల్ రౌండర్ మహ్మద్ నబీని తప్పిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.

హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై కూడా 244 పరుగులు చేసింది. ఓడిపోయిందన్న మాటేగానీ వారిని తక్కువ అంచనా వేయడానికి లేదని కొందరు కామెంట్లు పెడుతున్నారు. .

రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, హార్దిక్ పాండ్యా, అన్షుల్, షామ్స్ ములాని, జస్ప్రీత్ బుమ్రా, పియూష్ చావ్లా, కొయెట్జీ, బ్రెవిస్, నమన్ ధీర్ వీళ్లందరూ ఈసారి మ్యాచ్ లో విజృంభిస్తారని ముంబై మేనేజ్మెంట్, హార్దిక్ పాండ్యా ఆశిస్తున్నారు. వీరిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.వారి ఆశలు నెరవేరాలని కోరుకుందాం.

Tags

Related News

Paralympics 2024: భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. 29కి చేరిన పతకాల సంఖ్య

Vinesh Phogat Bajrang Punia: ‘వినేశ్ ఫోగట్ చీటింగ్ చేసి ఒలింపిక్స్‌కు వెళ్లింది’.. బిజేపీ నాయకుడి వివాదాస్పద వ్యాఖ్యలు

Duleep Trophy 2024: మళ్లీ ముంబై బ్యాటర్ వచ్చాడు.. అదరగొట్టిన ముషీర్ ఖాన్..181

Paralympics Hokato Hotozhe: పారాలింపిక్స్ లో భారత్ పతకాల సంఖ్య 27!.. హై జంప్ లో గోల్డ్, షాట్ పుట్ లో కాంస్యం!

Wrestlers: బ్రేకింగ్ న్యూస్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన రెజ్లర్లు వినేష్ ఫొగట్, బజరంగ్ పునియా

US Open 2024: యూఎస్ ఓపెన్..నెంబర్ వన్ ర్యాంకర్ ఓటమి

Duleep Trophy 2024: ముషీర్ ఖాన్ సెంచరీ.. అక్షర్ పటేల్ అదుర్స్

Big Stories

×