EPAPER

Meg Lanning : ఉమెన్స్ క్రికెట్ రారాణి.. క్రికెట్‌కు గుడ్‌బై..

Meg Lanning : ఉమెన్స్ క్రికెట్ రారాణి..  క్రికెట్‌కు గుడ్‌బై..

Meg Lanning : ఆస్ట్రేలియా ఉమెన్స్ క్రికెట్ మెగాస్టార్‌గా పేరు పొందిన ఆమె పేరు మెగ్ లానింగ్. 13 ఏళ్ల క్రికెట్ ప్రయాణాన్ని అత్యంత విజయవంతంగా, వైభవోపేతంగా ముగించిన ఆమె జర్నీ, నేటి యువ తరానికి ఒక సిలబస్ అని చెప్పాలి.


31 ఏళ్ల లానింగ్ ప్రస్థానంలో ఏడు ప్రపంచకప్ లు ఉన్నాయి. అందులో 5 టీ ట్వంటీ ప్రపంచకప్ లు, 2 వన్డే వరల్డ్ కప్ లు ఉన్నాయి. ఇక తన కెప్టెన్సీలో ఆస్ట్రేలియా ఒక వన్డే వరల్డ్ కప్, ఐదు టీ ట్వంటీ ప్రపంచకప్ లు సాధించింది. అంతేకాదు 3 యాషెస్ సిరీస్ విజయాలున్నాయి. 182 మ్యాచ్ ల్లో కెప్టెన్ గా ఉన్న లానింగ్ 80శాతం విజయాలతో ఘనంగా తన కెరీర్ ను ముగించింది.

ఆస్ట్రేలియా ఇప్పటివరకు 2012, 2014, 2018, 2020, 2023 టీ 20 వరల్డ్ కప్ లు.. 2013, 2022 వన్డే ప్రపంచకప్ లు గెల్చుకుంది. ఇందులో 2013 వన్డే ప్రపంచకప్ తప్పించి మిగిలినవన్నీ లానింగ్ కెప్టెన్సీలో వచ్చినవే కావడం విశేషం. 2014 ఆసీస్ కెప్టెన్‌‌గా సారథ్య బాధ్యతలు తీసుకుని అప్రతిహితంగా సాగిపోయింది. ఆసీస్ సారథిగా చరిత్ర సృష్టించింది. ఓటమన్నది లేకుండా వరుసగా 26 విజయాలు సాధించిన కెప్టెన్ గా ప్రపంచ రికార్డ్ సాధించింది. ఇంక చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, రెండు కాదు, క్రికెట్ లో దాదాపు సగం పైగా రికార్డులు తన పేరు మీదే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.


మెగ్ లానింగ్ జన్మస్థలం సింగపూర్. కాకపోతే తల్లిదండ్రులు ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ కు వలస వచ్చారు. చిన్నతనం నుంచి లానింగ్ క్రికెట్ పై ప్రేమ పెంచుకుంది. తల్లిదండ్రులు ప్రోత్సహించడంతో అనతికాలంలోనే ఆసిస్ ఉమెన్స్ టీమ్ లో జాతీయ జట్టుకి ఎంపికైంది. 2011లో ఆసీస్ క్రికెట్ లో ఆరంగ్రేటం చేసింది.  తొలి టీ 20 మ్యాచ్  ఆడింది. ఇక అక్కడ నుంచి వెనుతిరిగి చూడలేదు.

13 ఏళ్ల లానింగ్ కెరీర్ లో రికార్డ్స్ పరంగా చెప్పాలంటే, అది అనితర సాధ్యమని చెప్పాలి. 2014 టీ 20 ప్రపంచకప్ లో ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో 65 బాల్స్ లో 126 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా రికార్డ్ స్రష్టించింది.

మహిళల క్రికెట్ లో అత్యధిక వన్డే సెంచరీలు 15 చేసిన రికార్డ్ లానింగ్ పేరు మీదే ఉంది. టీ 20ల్లో రెండు సెంచరీలున్నాయి. మొత్తమ్మీద అన్ని ఫార్మాట్లలో కలిపి 8,352 పరుగులు చేసి, అందరికన్నా నెంబర్ వన్ గా ఉంది. 2017లో భుజానికి శస్త్రచికిత్స కారణంగా ఆటకు దూరమైంది. ఆరునెలల తర్వాత మళ్లీ వచ్చి బ్యాట్ ఝులిపించింది.

2022లో మళ్లీ ఆటకు విరామం ఇచ్చింది. 2023లో మళ్లీ పునరాగమనం చేసింది. లానింగ్ 6 టెస్టుల్లో 345 పరుగులు, 103 వన్డేల్లో 4602 పరుగులు, 132 టీ 20ల్లో 3405 పరుగులు చేసింది. చివరికి అనారోగ్య కారణాలతో క్రికెట్ కి దూరంగా ఉన్న లానింగ్ ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోల్ చెప్పింది.

లీగ్ మ్యాచ్ ల్లో ఆడతానని తెలిపింది. మహిళల క్రికెట్ కే వన్నెతెచ్చిన లానింగ్…చరిత్రలో నిలిచిపోయేలా తన ప్రస్థానాన్ని లిఖించుకుందని చెప్పడం అతిశయోక్తి కాదు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×