EPAPER

SRH vs LSG: సన్‌రైజర్స్‌ మళ్లీ ఫసక్.. కమాన్ హైదరాబాద్..

SRH vs LSG: సన్‌రైజర్స్‌ మళ్లీ ఫసక్.. కమాన్ హైదరాబాద్..
SRH vs LSG

SRH vs LSG: ఐపీఎల్‌-16లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు వరుసగా రెండు ఓటములు. ఈసారి మరీ దారుణంగా ఓడిపోయింది. టీమ్ అంతా కలిసి సెంచరీ చేయడానికే చాలా కష్టపడ్డారు. బ్యాటింగ్‌లో పూర్తిగా చేతులెత్తేశారు. లఖ్‌నవూ మాత్రం చాలా ఈజీగా ఆటాడేసింది. 4 ఓవర్లు ఉండగానే గెలిచేసింది.


కెప్టెన్ మారినా టీమ్ తలరాత మారలేదు. టాస్ గెలిచినా మ్యాచ్ గెలవలేదు. 5 వికెట్ల తేడాతో లఖ్‌నవూ సూపర్‌జెయింట్స్‌ చేతిలో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్‌.. 20 ఓవర్లలో 8 వికెట్లకు 121 పరుగుల స్కోర్‌తో సరిపెట్టింది. రాహుల్‌ త్రిపాఠి (34; 41 బంతుల్లో 4×4) టాప్‌స్కోరర్‌. చివర్లో సమద్‌ (21 నాటౌట్‌) దూకుడుగా ఆడటంతో ఆ మాత్రం స్కోర్ అయినా వచ్చింది.

భారీ అంచనాలతో సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌ ఆడిన మార్‌క్రమ్‌.. పేలవంగా డకౌట్ అయ్యాడు. కాస్ట్లీ ప్లేయర్ హ్యారీ బ్రూక్ 3 పరుగులకే తుస్సు మనిపించాడు. సింగిల్స్‌ కోసం కూడా బాగా కష్టం పడ్డారు సన్‌రైజర్స్. చివరి ఓవర్లో రెండు సిక్సర్లతో సమద్‌ స్కోరును 120 దాటించాడు. బౌలింగ్‌లో స్పిన్నర్లు కృనాల్‌ పాండ్య (3/18), అమిత్‌ మిశ్రా (2/23) రాణించారు.


సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌:
అన్మోల్‌ప్రీత్‌ ఎల్బీ (బి) కృనాల్‌ 31; మయాంక్‌ (సి) స్టాయినిస్‌ (బి) కృనాల్‌ 8; రాహుల్‌ త్రిపాఠి (సి) అమిత్‌ (బి) యశ్‌ 34; మార్‌క్రమ్‌ (బి) కృనాల్‌ 0; హ్యారీ బ్రూక్‌ (స్టంప్డ్‌) పూరన్‌ (బి) బిష్ణోయ్‌ 3; వాషింగ్టన్‌ సుందర్‌ (సి) దీపక్‌ (బి) అమిత్‌ 16; అబ్దుల్‌ సమద్‌ నాటౌట్‌ 21; ఆదిల్‌ రషీద్‌ (సి) దీపక్‌ (బి) అమిత్‌ 4; ఉమ్రాన్‌ రనౌట్‌ 0; భువనేశ్వర్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 121

సూపర్‌జెయింట్స్ బౌలింగ్‌: భువనేశ్వర్‌ 2-0-19-1; వాషింగ్టన్‌ సుందర్‌ 1-0-11-0; ఫజల్‌ ఫారూఖీ 3-0-13-1; మార్‌క్రమ్‌ 2-0-14-0; అడిల్‌ రషీద్‌ 3-0-23-2; నటరాజన్‌ 3-0-23-0; ఉమ్రాన్‌ 2-0-22-1

హైదరాబాద్ సన్‌రైజర్స్ చెమటోడ్చిన పిచ్ పైనే.. లఖ్‌నవూ ఆటగాళ్లు అదరగొట్టేశారు. 5 వికెట్లు కోల్పోయి 16 ఓవర్లలో టార్గెట్ రీచ్ అయింది. కేఎల్‌ రాహుల్‌ (35; 31 బంతుల్లో 4×4), కృనాల్‌ పాండ్య (34; 23 బంతుల్లో 4×4, 1×6) రఫ్ఫాడించారు. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో సత్తాచాటిన కృనాల్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు.

ఓపెనర్లు ఆటను మెరుగ్గా ఆరంభించారు. 4 ఓవర్లకు 35/0 స్కోర్. అయితే, వరుస ఓవర్లలో మేయర్స్‌ (13), దీపక్‌ హుడా (7) ఔటవడంతో ప్రెజర్ పెరిగింది. అయినా, కూల్‌గా ఆడారు సూపర్‌జెయింట్స్‌. కృనాల్‌ జతగా కేఎల్‌ రాహుల్‌ జట్టును విజయం దిశగా నడిపించాడు. సన్‌రైజర్స్ ఫీల్డింగ్‌ వైఫల్యాలూ కలిసొచ్చాయి. వికెట్‌కీపర్‌ అన్మోల్‌ప్రీత్‌ ఆటతీరు అసలేమాత్రం బాగోలేదు. 10 ఓవర్లకు 82/2తో లఖ్‌నవూ మెరుగైన పొజిషన్‌లో నిలిచింది. చివర్లో పూరన్‌ (11 నాటౌట్‌) సిక్సర్‌తో మ్యాచ్‌ ఫినిష్ చేశాడు.

లఖ్‌నవూ సూపర్‌జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: మేయర్స్‌ (సి) మయాంక్‌ (బి) ఫారూఖీ 13; కేఎల్‌ రాహుల్‌ ఎల్బీ (బి) రషీద్‌ 35; దీపక్‌ హుడా (సి) అండ్‌ (బి) భువనేశ్వర్‌ 7; కృనాల్‌ (సి) అన్మోల్‌ప్రీత్‌ (బి) ఉమ్రాన్‌ 34; స్టాయినిస్‌ నాటౌట్‌ 10; షెఫర్డ్‌ ఎల్బీ (బి) రషీద్‌ 0; పూరన్‌ నాటౌట్‌ 11; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం: (16 ఓవర్లలో 5 వికెట్లకు) 127

సన్‌రైజర్స్ బౌలింగ్‌: మేయర్స్‌ 1-0-5-0; ఉనద్కత్‌ 3-0-26-0; కృనాల్‌ 4-0-18-3; యశ్‌ ఠాకూర్‌ 3-0-23-1; రవి బిష్ణోయ్‌ 4-0-16-1; దీపక్‌ హుడా 1-0-8-0; అమిత్‌ మిశ్రా 4-0-23-2

శనివారం.. మధ్యాహ్నం రాజస్థాన్ వర్సెస్ ఢిల్లీ.. రాత్రికి ముంబై వర్సెస్ చెన్నై మ్యాచ్‌లు జరగనున్నాయి.

Related News

India vs Bangladesh 1st Test: భారత్ 376 ఆలౌట్: బంగ్లాదేశ్ 26/3

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Big Stories

×