EPAPER

Manu Bhaker-Sarabjot Singh win bronze: ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం, మను బాకర్- సరబ్‌జోత్ జోడికి కాంస్యం

Manu Bhaker-Sarabjot Singh win bronze: ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం, మను బాకర్- సరబ్‌జోత్ జోడికి కాంస్యం

Manu Bhaker-Sarabjot Singh win bronze: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలో మరో పతకం చేరింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ విభాగంలో మనుబాకర్-సరబ్ జోత్ జోడికి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఈ పతకం కోసం మనుబాకర్ జోడి దక్షిణకొరియాకు చెందిన జోడిపై గెలుపొందింది.


దక్షిణ కొరియాకు చెందిన వోహో లీ- యో జిన్ హో జోడిపై 16-10 తేడాతో విజయం సాధించి మనుబాకర్ జోడి. తొలుత ఇండియన్ జోడికి సరైన గురి కుదిరింది. ‌కరెక్ట్‌గా పదిపాయింట్లు సాధించింది. అయితే సమయంలో ప్రత్యర్థి జోడి వెనుకబడింది. కేవలం 4 పాయింట్లు మాత్రమే దక్కించుకుంది. ఇదో జోష్‌లో గురి తప్పుకుండా దూసుకెళ్లింది. చివరలో ప్రత్యర్థి పుంజుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. చివరకు భారత్ జోడి కాంస్య పతకం దక్కించుకుంది.

పారిస్ ఒలింపిక్స్‌ 2024లో రికార్డు క్రియేట్ చేసింది 22 ఏళ్ల మనుబాకర్. స్వతంత్ర భారత్‌లో ఒకే ఒలిం పిక్స్‌లో రెండు పతకాలు సొంతం చేసుకున్న ఫస్ట్ క్రీడాకారిణి. బ్రిటీష్ పాలనలో 1900 ఒలింపిక్స్‌లో బ్రిటీష్-ఇండియన్ అథ్లెట్ నార్మన్ ప్రిచర్డ్ అథ్లెటిక్స్‌లో రెండు రజత పతకాలు సాధించాడు. దాదాపు 124 ఏళ్ల తర్వాత ఆ ఘనత సాధించింది మనుబాకర్. ఒలింపిక్స్‌లో రెండు పతకాలు అందుకున్న మహిళల్లో మను రెండో వ్యక్తి. అంతకుముందు పీవీ సింధు ఈ ఘనత సాధించింది.


ALSO READ: మూడో టీ20 మ్యాచ్, గిల్ దూరం!

మరో ఈవెంట్‌లో మనుబాకర్ పోటీపడుతోంది. 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది మనుబాకర్. రెండో పతకం గెలవగానే హర్యానా అమ్మడు మనుబాకర్ ఉబ్బితబ్బిబ్బ య్యింది. చాలా ఆనందంగా ఉందని , పతకం సాధించినందుకు తాను ఎంతో గర్వపడుతున్నానని మనసులోని మాట బయటపెట్టింది. మరో వైపు తన కూతురు ఒలింపిక్స్‌లో సెకండ్ పతకం సాధించడంపై మనుబాకర్ తండ్రి ఆనందం వ్యక్తం చేశాడు.

 

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×