EPAPER

Manu Bhaker clarification: కాసేపు నవ్వుతూ.. పెళ్లిపై మనుబాకర్ క్లారిటీ, అనుకోకుండా జరిగిపోయింది

Manu Bhaker clarification: కాసేపు నవ్వుతూ.. పెళ్లిపై మనుబాకర్ క్లారిటీ, అనుకోకుండా జరిగిపోయింది

Manu Bhaker clarification: ఇండియా షూటర్, పారిస్ ఒలింపిక్స్ డబుల్ విన్నర్ మనుబాకర్ మళ్లీ వార్తల్లోకి వచ్చేసింది. ఆమె మ్యారేజ్ గురించి కుటుంబసభ్యులు నోరు విప్పినా ఏ మాత్రం ఆగలేదు. దానికి సంబంధించిన వార్తలు కంటిన్యూ అవుతున్నాయి. తాజాగా ఆ వ్యవహారంపై నోరు విప్పింది.. మనసులోని మాట బయటపెట్టింది షూటర్ మనుబాకర్.


పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించింది ఇండియా షూటర్ మనుబాకర్. ఈ క్రమంలో ఆటగాళ్లు ఒలింపిక్స్ విలేజ్‌లో మాట్లాడుకోవడం సహజం. ఇండియా జావెలిన్‌ త్రో వీరుడు నీరజ్‌చోప్రాతో క్లోజ్‌గా మాట్లాడడం కనిపించింది మనుబాకర్. దీంతో స్టోరీలు అల్లేసుకోవడం నెటిజన్స్ వంతైంది. ఈ యవ్వారం పై మనుబాకర్ ఫాదర్ రామ్‌కిషన్ క్లారిటీ ఇచ్చినా నెట్ యూజర్స్ నమ్మలేకపోతున్నారు.

రోజురోజుకూ ఈ వార్తలు మరింత బలాన్ని చేకూర్చడంతో నేరుగా మనుబాకర్ రంగంలోకి దిగేసింది. నీరజ్‌ చోప్రాతో మ్యారేజ్‌ విషయమై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపింది. అనుకోకుండా ఒలింపిక్స్ విలేజ్‌లో కలిశామని, దాన్ని వీడియో తీసి ఎవరో వైరల్ చేశారంటోంది. మీరు భావిస్తున్నట్లు మా మధ్య అంతగా ఏమీలేదని, పోటీల్లో ఎదురుపడినప్పుడు సరదాగా పలకరించుకోవడం సహజమని క్లారిటీ ఇచ్చింది.


ALSO READ: ఒలింపిక్స్‌లో భారత్ రాణించకపోవడానికి రీజన్ ఇదేనా..!

సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తమని క్లారిటీ ఇచ్చేసింది మనుబాకర్. నీరజ్‌చోప్రాతో మా అమ్మ మాట్లాడినప్పుడు తాను అక్కడ లేనని వెల్లడించింది. కాబట్టి వారిద్దరి మధ్య ఏయే మాటలు ప్రస్తావనకు వచ్చాయో తనకు తెలీదని తప్పించుకునే ప్రయత్నం చేసింది. మొత్తానికి తన కెరీర్ డ్యామేజ్ కాకుండా తన వైపు నుంచి క్లారిటీ ఇచ్చేసింది మనుబాకర్. ఈ వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది.  ఈ వ్యవహారంలో నీరజ్‌చోప్రా ఎందుకు సైలెంట్‌గా ఉన్నాడనేది ఇంకోవైపు కామెంట్లు పడిపోతున్నాయి.

మనుబాకర్-నీరజ్‌చోప్రా ఇద్దరూ ఒకే రాష్ట్రానికి చెందినవారు. పైగా ఒకరికి 22 ఏళ్లు, మరొకరికి 24 ఏళ్లు. ఇద్దరూ ఒలింపిక్స్‌లో రెండేసి పతకాలు సాధించారు. టార్గెట్ రాబోయే ఒలింపిక్స్. అలాంటప్పుడు మ్యారేజ్ చేసుకుంటే తప్పంటన్నది నెటిజన్స్ మాట. మరి నీరజ్‌చోప్రా మనసులో ఏమందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదన్నమాట.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×