EPAPER

LSG vs DC Highlights, IPL 2024: ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది..

LSG vs DC Highlights, IPL 2024: ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది..

Delhi Capitals vs Lucknow Super Giants IPL 2024 Highlights: ఐపీఎల్ మ్యాచ్ లు హోరాహోరీగా సాగుతున్నాయి. గెలుస్తారని అనుకున్నవాళ్లు ఓడుతున్నారు. ఓడిపోతారని అనుకున్నవాళ్లు గెలుస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లఖ్ నవ్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ గెలిచి మళ్లీ ఊపిరి తీసుకుంది. రేస్ లోకి రాలేదు గానీ, గేర్ అప్ అయ్యింది.


మ్యాచ్ వివరాల్లోకి వెళితే…లఖ్ నవ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకుంది. ఓపెనర్ డికాక్ (19) త్వరగా అవుట్ అయిపోయాడు. దేవదత్ (3) మళ్లీ నిరాశపరిచాడు. మార్కస్ స్టోనిస్ (8), నికోలస్ పూరన్ (0), దీపక్ హుడా (10) ఇలా వెంటవెంటనే అందరూ క్యూ కట్టారు.

ఈ క్రమంలో లఖ్ నవ్ నడ్డివిరిచింది మాత్రం కులదీప్ యాదవ్ అని చెప్పాలి. తను వరుస బంతుల్లో స్టోనిస్, పూరన్ వికెట్లను పడగొట్టాడు. అప్పటికి స్కోరు 4 వికెట్ల నష్టానికి 66 పరుగులు. ఇంక అక్కడ నుంచి లఖ్ నవ్ పడుతూ లేస్తూ అలా ముందుకువెళ్లింది. 13 ఓవర్ ప్రారంభమయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 94 పరుగులతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.


Also Read: అందరూ బాదుడే.. కానీ వీరిలో దినేశ్ బెస్ట్

ఈ సమయంలో ఆయుష్ బదోని వచ్చి లఖ్ నవ్ పరువు కాపాడాడు. 35 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 55 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. తనకి ఆర్షాద్ ఖాన్ (20 నాటౌట్) సపోర్ట్ గా నిలిచాడు. మొత్తానికి 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసి పరువు నిలబెట్టుకుంది.

ఢిల్లీ బౌలింగులో కులదీప్ యాదవ్ 3, ఖలీల్ అహ్మద్ 2, ఇషాంత్ శర్మ , ముఖేష్ కుమార్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

168 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (8) దురదృష్టవశాత్తూ అవుట్ అయ్యాడు. యశ్ ఠాకూర్ వేసిన బంతిని ఫ్లిక్ షాట్‌తో ఫైన్‌లెగ్ మీదుగా ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బాల్ కనెక్ట్ అవ్వలేదు. కానీ ప్యాడ్లకు తగిలి, మెల్లగా వికెట్ల వైపు వెళ్లింది. వెంటనే అప్రమత్తమైన వార్నర్ బ్యాటుతో దాన్ని ఆపాలని ప్రయత్నించాడు. కానీ అప్పటికే బాల్ వికెట్లకు తగలడం బెయిల్ కిందపడటం జరిగిపోయింది. దీంతో నిరాశగా వార్నర్ పెవిలియన్ చేరాడు.

మరో ఓపెనర్ పృథ్వీ షా (32) చేసి అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన జాక్ ఫ్రేజర్ అదరగొట్టాడు. 35 బంతుల్లో 5 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 55 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత కెప్టెన్ రిషబ్ పంత్ ధనాధన్ ఆడాడు. 24 బంతుల్లో 2 సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో 41 పరుగులు చేశాడు. తర్వాత స్టబ్స్ (15),  షై హోప్ (11) ఇద్దరు కలిసి మ్యాచ్ ని విజయ తీరాలకు చేర్చారు. మొత్తానికి 18.1 ఓవర్లలో 170 పరుగులు చేసి ఢిల్లీ క్యాపిటల్స్ జయ కేతనం ఎగురవేసింది.

లఖ్ నవ్ బౌలింగ్ లో నవీన్ ఉల్ హక్ 1, యశ్ ఠాగూర్ 1, కృనాల్ పాండ్యా 2 వికెట్లు తీశారు.

లఖ్ నవ్ ఈ పరాజయంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోయింది. గెలిచిన ఢిల్లీ మాత్రం ఒక స్థానం మెరుగుపరుచుకుని పదో స్థానం నుంచి తొమ్మిదో స్థానానికి చేరుకుంది.

Related News

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

IND vs BAN: ఇది గంభీర్ కు పరీక్ష.. రేపటి నుంచి బంగ్లాతో తొలిటెస్టు

IPL 2025: ముంబైలో ప్రకంపనలు…కొత్త కెప్టెన్​ అతడే..రోహిత్‌, పాండ్యా ఔట్‌?

Women’s T20 World Cup 2024: మహిళల టీ 20 ప్రపంచకప్.. వారితో సమానంగా.. ప్రైజ్ మనీ

Kohli Vs Gambhir: ఐపీఎల్‌ లో తన్నుకున్నారు..ఇప్పుడు వాళ్లే టీమిండియాలో చీలిక తెచ్చారు..ప్రోమో అదుర్స్‌ !

Ind Vs Ban: 3 మార్పులతో బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్ కు టీమిండియా రెడీ..ఫ్రీగా మ్యాచ్‌ ఎలా చూడాలంటే..?

Big Stories

×