EPAPER

 Sanjiv Goenka: రోహిత్ కి రూ.50 కోట్లు ఇచ్చేస్తే.. ఎలా? : గోయెంకా

 Sanjiv Goenka: రోహిత్ కి రూ.50 కోట్లు ఇచ్చేస్తే.. ఎలా? : గోయెంకా

Sanjiv Goenka speaks on Rumours Regarding the Franchise saving INR 50 Crore for Rohit Sharma: టీమ్ ఇండియా కెప్టెన్, స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మకు ఐపీఎల్ లో రూ.50 కోట్లకు పైగా ఇస్తున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలకు విలువ లేదని అంటారు. కానీ రోహిత్ శర్మకు రూ.50 కోట్లు అనే వార్తపై లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా స్పందించడంతో ఇప్పుడది వైరల్ అయ్యింది.


ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఒకొక్క ఫ్రాంచైజీ పర్సులో రూ.100 కోట్లు మాత్రమే ఉంటాయి. అవి మూడేళ్లు వాడాలి. 15 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయాలి. బ్యాకప్ క్రీడాకారులను కొనాలి. పైకి 15మంది మాత్రమే ఉన్నా.. ఒకొక్క జట్టులో 22 మంది వరకు క్రీడాకారులు ఉంటారు. వీళ్లందరికీ ప్రాక్టీసు బౌలర్లు, బ్యాటర్లు ఉంటారు.

వీరితో పాటు మెంటార్లు, హెడ్ కోచ్ లు, బౌలింగు, బ్యాటింగ్, ఫీల్డింగ్ కోచ్ లు ఉంటారు. వాళ్లని తీసుకోవాలి. ఫిజియో థెరపిస్టులు, మసాజ్ మాస్టర్స్ ఇలా ఒక ఫ్రాంచైజీలో అథమపక్షం కనీసం 100 మంది ఉంటారు. వీళ్లందరికి పెట్టుబడులు పెట్టాలి. కొందరిని ఏడాది పొడవునా పోషించాలి.


ఇన్ని ఖర్చులుంటాయి. ప్రాక్టీస్ సెషన్స్, ఏడాదికి నెలరోజులు ఆటగాళ్ల భోజనాలు, హోటళ్లకయ్యే ఖర్చులు ఇవన్నీ చూసుకుంటే తడిసి మోపెడవుతుంది. అంతా రూ.100 కోట్లలోనే చూసుకోవాలి. మూడేళ్లు ఉన్నదాంతో సర్దుకోవాలి.

ఇలాంటి సమయంలో ఒక్క రోహిత్ శర్మకు రూ.50 కోట్లు ఇచ్చేస్తే, పరిస్థేమిటి? అని గోయెంకా ప్రశ్నించారు. సరే, రోహిత్ ని తీసుకుంటాం…తనకి మంచి జట్టుని ఇవ్వాలి కదా…అలా ఇస్తేనే, తను మంచి వ్యూహాలతో కెప్టెన్ గా రాణిస్తాడు. ఒక చెత్త టీమ్ ని ఇచ్చి, కెప్టెన్ గా నువ్వు చూసుకోమంటే ఎలా? అని ఆయన ప్రశ్నించారు. ఒక్కడూ తనే బౌలింగు, తనే బ్యాటింగ్, తనే ఫీల్డింగ్ చేసేసి 11 మంది ఆట ఆడలేడు కదా..అని అన్నారు.

Also Read: ఆసక్తిగా సాగుతున్న యూఎస్ ఓపెన్.. తర్వాత రౌండ్‌లో జకోవిచ్

ఇదే విషయంపై పంజాబ్ కింగ్స్ నుంచి సంజయ్ బంగర్ స్పందించారు. రోహిత్ కి ఆ విలువ ఉంది. కానీ ఐపీఎల్ కి బడ్జెట్ లిమిట్ ఉంది. నిబంధనలు ఉన్నాయి. అందువల్ల అంత వర్కవుట్ కాదని తేల్చి చెప్పేశాడు.

ఇకపోతే సంజయ్ గోయెంకా ఈ విషయంపై మాట్లాడుతూ ముందు రోహిత్ వేలానికి వస్తాడో రాడో తెలీదు కదా అన్నారు. ఇవన్నీ రూమర్లు వీటిపై ఇంత చర్చించడం సమంజసం కాదు. ఒకవేళ వేలానికి వస్తే, ఏ ఫ్రాంచైజీ అయినా టాప్ ప్లేయర్లను కొనుగోలు చేయాలని చూస్తుంది. అందులో రోహిత్ ఉంటాడు. కానీ రూ.50 కోట్లు మాత్రం కరెక్టు కాదని తేల్చి పారేశారు.

Related News

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

Big Stories

×