EPAPER

Lakshyasen: లక్ష్యం తప్పింది.. కాంస్య పతకపోరులో లక్ష్యసేన్ ఓటమి

Lakshyasen: లక్ష్యం తప్పింది.. కాంస్య పతకపోరులో లక్ష్యసేన్ ఓటమి

Lakshya Sen in Paris Olympics(Latest sports news today): కాంస్య పతక పోరులోనూ భారత యువ బ్యాడ్మింటన్ ఆటగాడు లక్ష్యసేన్ మళ్లీ నిరాశపరిచాడు. కాంస్య పతకం ఆశలను మలేసియా బ్యాడ్మింటన్ ప్లేయర్ జియా లీ అడియాశలు చేశాడు. తొలి సెట్‌లో పైచేయి సాధించిన లక్ష్యసేన్.. తదుపరి రెండు సెట్‌లలో తడబడ్డాడు. మిగిలిన రెండు సెట్‌లలో జియా లీ పుంజుకుని అప్రతిహతంగా పాయింట్లు సాధించుకున్నాడు. దీంతో పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ కేటగిరీలో భారత్ పతకాన్ని కోల్పోయింది. ప్యారిస్ ఒలింపిక్స్ 2024 క్రీడలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆడిన పురుష సింగిల్స్ కాంస్య పతక పోరులో లక్ష్యసేన్ పరాజయం పాలయ్యాడు.


నిన్న గాక మొన్న సెమీస్ పోరులో డెన్మార్క్ ప్లేయర్ విక్టర్ చేతిలో లక్ష్యసేన్ ఓడిపోయాడు. విక్టర్‌ను ఓడించి ఉంటే భారత్‌కు గోల్డ్ లేదా సిల్వర్ మెడల్ దక్కేది. కానీ, వరల్డ్ సెకండ్ చాంపియన్ అయిన విక్టర్.. లక్ష్యసేన్‌కు ఆ అవకాశాన్ని ఇవ్వలేదు. సెమీస్‌లో ఓడినా.. కాంస్య పతకంపై ఆశలు సజీవంగానే ఉన్నాయని అందరూ అనుకున్నారు. కానీ, ఈ రోజు జరిగిన కాంస్య పతక పోరులో మలేషియా ఆటగాడు జియా లీ పైచేయి సాధించాడు.

ఈ పోరులో లక్ష్యసేన్ 21-13 పాయింట్లతో మంచి గ్యాబ్‌తో ముందంజలో నిలిచాడు. వాస్తవానికి ఈ పాయింట్ల మధ్యనున్న తేడా ప్రత్యర్థిపై మానసిక ఒత్తిడిని తప్పక వేస్తుంది. ముందంజలో ఉన్నవాడికి గొప్ప ధైర్యాన్ని అందిస్తుంది. కానీ, రెండో సెట్‌లో ఇలాంటి అంచనాలేవీ కనిపించలేవు.


Also Read: ‘కళింగ’ టీజర్‌ విడుదల చేసిన బాలీవుడ్ స్టార్ జాకీ ష్రాఫ్.. ధైర్యం ఉంటేనే చూడండి..

రెండో సెట్‌లో కూడా తొలుత లక్ష్యసేన్ దూకుడుగానే ఆడాడు. 15-9 పాయింట్ల ఆధిక్యంతో కాంస్య పతకం ఇండియాకు వస్తుంనే ఆశలు రేపాడు. కానీ, అనూహ్యంగా జియా లీ పుంజుకుని వెనక్కి తిరిగి చూసుకోలేదు. 21-16, 21-11 పాయింట్లతో జియా లీ మంచి ప్రదర్శన కనబరిచాడు. లక్ష్యసేన్‌కు మరే అవకాశాన్ని ఇవ్వలేదు. రెండు సెట్‌లలో విజయం సాధించి మ్యాచన్‌ను సొంతం చేసుకున్నాడు. దీంతో లక్ష్యసేన్ పతకం ఆశలు గల్లంతయ్యాయి.

Related News

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

Big Stories

×