EPAPER

Paris Olympics 2024: సెమీస్‌లో ఓడిన లక్ష్యసేన్.. కాంస్యంపై ఆశలు సజీవం

Paris Olympics 2024: సెమీస్‌లో ఓడిన లక్ష్యసేన్.. కాంస్యంపై ఆశలు సజీవం

lakshya sen: ప్యారిస్ ఒలింపిక్స్‌లో ఈ రోజు బ్యాడ్మింటన్ సింగిల్స్ సెమీస్ పోరు జరిగింది. ఇందులో భారత యువ బ్యాడ్మింటన్ లక్ష్యసేన్ డెన్మార్క్ ఆటగాడు విక్టర్ అక్సెల్సెన్ పోటీ పడ్డారు. రెండు సెట్‌లలో లక్ష్యసేన్ శుభారంభం చేసినా.. విక్టర్ ఆ తర్వాత చెలరేగి పైచేయి సాధించాడు. లక్ష్యసేన్‌పై విక్టర్ విజయం సాధించారు. విక్టర్ ఫైనల్‌కు వెళ్లారు. దీంతో లక్ష్యసేన్ గోల్డ్ లేదా సిల్వర్ మెడల్ సాధించే అవకాశాన్ని కోల్పోయారు. కానీ, కాంస్య పతకం గెలిచే అవకాశాలు సజీవంగానే ఉన్నాయి. రేపు జరిగే కాంస్య పతక పోరులో మలేషియా షట్లర్ లీజీ జియాతో లక్ష్యసేన్ తలపడాల్సి ఉన్నది. ఈ పోరులో నెగ్గితే కాంస్య పతకాన్ని సాధిస్తారు.


పారిస్ ఒలింపిక్స్ 2024(Paris Olympics 2024)లో సెమీస్ వరకు భారత యువ ఆటగాడు లక్ష్యసేన్ దూసుకొచ్చాడు. ఎదురేలేదన్నట్టుగా విజయాలు సాధించాడు. కానీ, పురుషుల సింగిల్స్‌ సెమీస్ ఆటలో లక్ష్యసేన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. డెన్మార్క్‌కు చెందిన ప్రపంచ రెండో ర్యాంకర్ విక్టర్ అల్సెక్సెన్ చేతిలో ఓడిపోయాడు. 20-21, 14-21 స్కోర్‌తో లక్ష్యసేన్ ఓటమి చవిచూశాడు.

Also Read: కేబుల్ బ్రిడ్జీపై ప్రమాదం.. ఇద్దరు యువకులు కిందపడి దుర్మరణం


ఈ రెండు సెట్‌లలో కూడా లక్ష్యసేన్ తొలుత ఆధిక్యం ప్రదర్శించాడు. కానీ, ఆ తర్వాత విక్టర్ విజృంభించి లక్ష్యసేన్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. రెండో సెట్‌లో కూడా లక్ష్యసేన్ ఏడు పాయింట్లు సాధించినప్పుడు విక్టర్ సున్నా వద్దే ఉన్నాడు. కానీ, ఆ తర్వాత విక్టర్ పుంజుకున్నాడు. లక్ష్యసేన్ మరో ఏడు పాయింట్లు సాధించేలోపు విక్టర్ 21 పాయింట్లు సొంతం చేసుకున్నాడు, తద్వార రెండో సెట్‌తోపాటు మ్యాచ్‌ను గెలుచుకున్నాడు. ఇదిలా ఉండగా.. లవ్లీనా కూడా వెనుదిరిగింది. ఈ సారి భారత బాక్సర్లు పతకాలేవీ లేకుండానే ఇంటికి వస్తున్నారు.

Tags

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×