EPAPER

IND vs ENG Test : ప్చ్.. ఎంత పని చేసావ్ భరత్..

IND vs ENG Test :  ప్చ్.. ఎంత పని చేసావ్ భరత్..

IND vs ENG Test : ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో సీనియర్ ఆటగాళ్లు సహనం కోల్పోతున్నారు. మరెందుకో తెలీదు. ప్రతీ చిన్న విషయానికి అసహనం వ్యక్తం చేస్తున్నారు. మూడోరోజు ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో ఫాస్ట్ బౌలర్ బుమ్రా ఏం చేశాడంటే.. వికెట్ కీపర్ కేఎస్ భరత్ పై తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఎంత పనిచేశావ్? భరత్, నేనప్పుడే చెప్పానా? అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.


ఇంతకీ విషయం ఏమిటంటే..17 ఓవర్ జరుగుతోంది. బూమ్రా బౌలింగ్ లో ఉన్నాడు. అటువైపు బెన్ డకెట్ బ్యాటింగ్ లో ఉన్నాడు. అద్భుతమైన బాల్ బుమ్రా నుంచి వచ్చింది. తను ఆఫ్ సైడ్ ఆడేందుకు ప్రయత్నించాడు. కాకపోతే అది మిస్ అయ్యింది. డకెట్ ప్యాడ్ లకు తగిలింది. వెంటనే బౌలర్, వికెట్ కీపర్ ఇద్దరూ అప్పీలు చేశారు. కానీ అంపైర్ మాత్రం కూల్ గా నాటౌట్ అన్నాడు.

దీంతో రోహిత్ శర్మని రివ్యూ తీసుకోమని బుమ్రా సూచించాడు. అయితే బంతి లెగ్ సైడ్ వెళుతోందని భరత్ తెలిపాడు. దీంతో రోహిత్ శర్మ రివ్యూ తీసుకోలేదు. కానీ తర్వాత రీప్లేలో బంతి లెగ్ స్టంప్ ను తాకినట్టు తేలింది.


దీంతో బుమ్రాకి చాలా ఆవేదన కలిగింది. చూశావా..? నేను చెప్పానా..? చెప్పానా..? అంటూ కేఎస్ భరత్ వైపు చూస్తూ అన్నాడు. ఇప్పుడా వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.

తర్వాత ఓవర్ లో మళ్లీ బుమ్రా వచ్చాడు. బెన్ డకెట్ వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. అవుట్ కావల్సినోడు బతికిపోయి, ఇప్పుడు వాయించేస్తున్నాడని అనుకున్నాడో ఏమో తెలీదు కానీ, తర్వాత బంతిని పవర్ ఫుల్ గా సంధించాడు. దీంతో బకెట్ వికెట్ ఎగిరి పడింది. దాంతో కమాన్.. రా అంటూ గాల్లోకి పంచ్ లు విసిరాడు.

బుమ్రా అంతటితో ఆగలేదు. తర్వాత ఓవర్ లోనే ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ జో రూట్ ని బోల్తా కొట్టించాడు. ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. ఇంతటి ఆవేశం అవసరమా? అని నెట్టింట కామెంట్లు వినిపిస్తున్నాయి. అలాగే రెండోరోజు అశ్విన్ కూడా జడేజాపై రన్ అవుట్ విషయంలో ఇలాగే సీరియస్ అయ్యాడు.

ఒక్క టీమ్ ఇండియా క్రికెటర్లే కాదు…అన్ని జట్లు అలాగే ఉన్నాయి.
క్రికెట్ జెంటిల్మన్ గేమ్ అని అందరూ అంటారు. ఆ వాతావరణమే మారిపోతోందని అంటున్నారు.

Related News

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Big Stories

×