BigTV English

IPL : రింకూ సింగ్ సిక్సర్ల మోత.. రషీద్ ఖాన్ హ్యాట్రిక్ వృథా..

IPL : రింకూ సింగ్ సిక్సర్ల మోత.. రషీద్ ఖాన్ హ్యాట్రిక్ వృథా..

IPL : రషీద్ ఖాన్ హ్యాట్రిక్ ఫీట్ సాధించాడు. గుజరాత్ టైటాన్స్ మాత్రం హ్యాట్రిక్ కొట్టలేకపోయింది. వరుసగా రెండు విజయాలు సాధించిన ఆ జట్టుకు మూడో మ్యాచ్ లో కోల్ కతా షాకిచ్చింది. చివరి ఓవర్ లో రింకూ సింగ్ అనూహ్యంగా చెలరేగి వరుసగా 5 సిక్సులు బాదడంతో కోల్ కతా 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో రింకూ ( 48 నాటౌట్, 21 బంతుల్లో ఒక ఫోర్, 6 సిక్సులు) హీరోగా నిలిచాడు.


టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ ( 53, 38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులు), విజయ్ శంకర్ ( 63 నాటౌట్, 24 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సులు) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో గుజరాత్ భారీ స్కోర్ చేసింది. శుభ్ మన్ గిల్ ( 39, 31 బంతుల్లో 5 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కోల్ కతా బౌలర్లలో సునీల్ నరైన్ 3 వికెట్లు, సుయాంశ్ శర్మ ఒక వికెట్ తీశారు.

205 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా వెంకటేశ్ అయ్యర్ (83 , 40 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సులు ) విధ్వంసంతో 15వ ఓవర్ వరకు విజయం దిశగా సాగింది. అయ్యర్.. కెప్టెన్ నితీశ్ రాణా ( 45 , 29 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులు)తో కలిసి మూడో వికెట్ కు వంద పరుగులు జోడించాడు. ఆ తర్వాత తొలుత నితీశ్ తర్వాత వెంకటేశ్ అయ్యర్ అవుట్ అయ్యారు. హార్దిక్ పాండ్యా స్థానంలో కెప్టెన్ బాధ్యతలు చేపట్టిన స్పిన్నర్ రషీద్ ఖాన్ కోల్ కతా జట్టుకు హ్యాట్రిక్ తో షాకిచ్చాడు. 16వ ఓవర్ తొలి మూడు బంతుల్లో రస్సెల్, నరైన్, శార్దుల్ ఠాకూర్ ను పెవిలియన్ చేర్చి హ్యాట్రిక్ నమోదు చేశాడు. దీంతో కోల్ కతా 16.3 ఓవర్లలో 155 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. ఇక ఆ జట్టు పరాజయం ఖాయమనిపించింది.


రింకూ సింగ్ అద్బుత పోరాటం చేశాడు. చివరి ఓవర్ లో కోల్ కతా విజయానికి 29 పరుగులు కావాలి. యశ్ దయాల్ వేసిన తొలి బంతికి ఉమేష్ యాదవ్ సింగిల్ తీశాడు. దీంతో రెండో బంతికి రింకూ సింగ్ కు స్ట్రైకింగ్ వచ్చింది. ఇక ఈ యువ బ్యాటర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వరుసగా 5 సిక్సులు కొట్టాడు. కోల్ కతా విజయానికి చివరి బంతికి 4 పరుగులు అవసరంగా కాగా.. రింకూ ఆ ఓవర్ లో 5వ సిక్సర్ కొట్టి కోల్ కతాకు విజయాన్ని అందించాడు. రింకూ దెబ్బకు గుజరాత్ బౌలర్ యశ్ దయాల్ 4 ఓవర్లలో 69 పరుగులు సమర్పించుకున్నాడు. రింకూ సింగ్ కే ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇప్పటి వరకు 3 మ్యాచ్ లు ఆడిన కోల్ కతా రెండో విజయం సాధించింది.

Related News

Asia Cup 2025: ఆసియా కప్ కోసం డేంజర్ బౌలర్లను దించుతున్న టీమిండియా.. ఇక ప్రత్యర్ధులకు పీడ కలలే

Harbajan Singh: ఇండియన్ ఆర్మీని చంపిన పాకిస్తాన్ కొడుకులతో క్రికెట్ ఆడుదామా..? బీసీసీఐకి హర్భజన్ వార్నింగ్

Liam Livingstone: 4,6,6,6,4 తో ఊచకోత… రషీద్ ఖాన్ ఇజ్జత్ తీసిన లివింగ్ స్టన్

Women’s ODI World Cup : మహిళల ప్రపంచ కప్ లో కూడా ఆస్ట్రేలియా డామినేట్.. ఈ లెక్కలు చూస్తే వణుకు పుట్టాల్సిందే

Kashish Kapoor : ఒక నైట్ కు వస్తావా? అని అడిగాడు… టీమిండియా క్రికెటర్ పై హాట్ బ్యూటీ సంచలన ఆరోపణలు!

Women’s World Cup 2025 : చిన్నస్వామిలో మ్యాచ్ లు బ్యాన్.. తిరువనంతపురంకు షిఫ్ట్.. షాక్ లో RCB!

Big Stories

×