EPAPER

IPL 2024 36th Match – KKR Vs RCB: థర్డ్ కి లాస్ట్ కి మధ్య పోరు.. నేడు కోల్ కతా వర్సెస్ ఆర్సీబీ!

IPL 2024 36th Match – KKR Vs RCB: థర్డ్ కి లాస్ట్ కి మధ్య పోరు.. నేడు కోల్ కతా వర్సెస్ ఆర్సీబీ!

IPL 2024 36th Match: KKR Vs RCB IPL Preview and Prediction: ఐపీఎల్  ప్రారంభంలో ఇలా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. అప్పుడే ఆర్సీబీ అమ్మాయిలు 2024 ఉమన్ ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకున్నారు. ఇక అబ్బాయిలు కూడా గెలిస్తే డబుల్ ధమాకా అని అంతా అనుకున్నారు. అమ్మాయిలు పరువు నిలబెట్టారు. మనం కూడా ఆడాలని ఆర్సీబీ దృఢ నిశ్చయంతో అడుగుపెట్టింది. కానీ అనుకున్నదొక్కటి, అయినది ఒక్కటిగా అయిపోయింది. ఇప్పటికి 7 మ్యాచ్ లు జరిగిపోయాయి. ఒకే ఒక్కటి గెలిచారు.


నేడు కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ రాత్రి 3.30కి ప్రారంభం కానుంది.

ఇప్పటి నుంచి ఆర్సీబీ వరుసపెట్టి గెలిస్తేనేగానీ టాప్ 4 లో నిలిచేలా లేరు. ఆరు మ్యాచ్ లు ఓడిపోయినోళ్లు, ఇంక ఇప్పుడు వరుసపెట్టి ఏం గెలుస్తారని నెట్టింట అందరూ ఆటపట్టిస్తున్నారు. విరాట్ కొహ్లీ టీమ్ కి ఇంతటి గడ్డు పరిస్థితి దాపురించడం నిజంగా విచారించదగ్గ విషయమే. అటు బ్యాటింగు, ఇటు బౌలింగు, ఫీల్డింగ్ అన్నింటా వైఫల్యాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉండిపోయింది.


Also Read: అదే హైదరా‘బాదుడు.. 67 పరుగుల తేడాతో ఢిల్లీ ఓటమి

ఇకపోతే కోల్ కతా నైట్ రైడర్స్ మాత్రం బ్రహ్మాండంగా ఆడుతున్నారు. ఓడినా పోరాడి ఓడిపోతున్నారు. 6 మ్యాచ్ లు ఆడి 4 గెలిచారు. 2 ఓడిపోయారు. ఒకరు ఆడకపోతే ఒకరు అందుకుంటున్నారు, పుంజుకుంటున్నారు. బ్యాటింగులో విఫలమైతే బౌలింగులో ఆకట్టుకుంటున్నారు. అలాగే ఫీల్డింగ్ లో కూడా చురుగ్గా కదులుతూ ఎన్నో పరుగులని ఆపుతున్నారు. ఇలా విజయాలను అందుకుంటున్నారు. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్నారు.

ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 33 మ్యాచ్ లు జరిగాయి. వాటిలో బెంగళూరు 14 మ్యాచ్ ల్లో విజయం సాధిస్తే కోల్ కతా 19 మ్యాచ్ ల్లో గెలిచి పై చేయిగా ఉంది.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×