EPAPER

KL Rahul in 3rd Test: టీమిండియాకు షాక్.. మూడో టెస్టుకు కేఎల్ రాహుల్ దూరం

KL Rahul in 3rd Test: టీమిండియాకు షాక్.. మూడో టెస్టుకు కేఎల్ రాహుల్ దూరం
KL Rahul Out Of Third Test

KL Rahul Ruled Out form Third Test against England: టీమిండియాకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌కు దూరం కాగా తాజాగా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయంతో మూడో టెస్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో కర్ణాటక బ్యాటర్ దేవదత్ పడిక్కల్‌ను ఎంపిక చేశారు.


చివరి మూడు టెస్టులకు జట్టును ఎంపిక చేసేటప్పుడే కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా ఎంపిక ఫిట్‌నెస్ క్లియరెన్స్‌కు లోబడి ఉంటుందని పేర్కొన్న విషయం తెలిసిందే.

అయితే రాజ్‌కోట్‌ వేదికగా జరగనున్న మూడో టెస్టుకు రవీంద్ర జడేజా ఫిట్‌గా ఉన్నాడని బీసీసీఐ తెలిపింది. మరో వారం రోజుల పాటు రాహుల్‌ని పరీక్షించిన తర్వాత మిగతా టెస్టులకు అతనిని ఆడించాలా వద్దా అనేది చెప్పగలమని వైద్య బృందం సెలక్టర్లకు చెప్పినట్లు సమాచారం.


రాహుల్ ఇప్పటికీ NCAలో ఉన్నారు. అతను రాజ్‌కోట్‌కు వెళ్లలేదు. నాలుగో టెస్టు నాటికి రాహుల్ ఫిట్‌గా ఉంటాడని బీసీసీఐ, టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నాయి. కాగా.. హైదరాబాద్‌లో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో రాహుల్ కుడి క్వాడ్రిస్ప్స్ నొప్పితో రెండో టెస్టుకు దూరమయ్యాడు.

Read More: 36 ఏళ్లలో తొలిసారి.. ఓపెనర్ల చెత్త రికార్డ్..!

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో గాయాలు భారత జట్టుపై ప్రభావం చూపుతున్నాయి. అటు విరాట్ కోహ్లీ, ఇటు కేఎల్ రాహుల్, ఫామ్‌లేమి కారణంగా శ్రేయాస్ అయ్యర్ ఇప్పటికే భారత జట్టుకు దూరమయ్యారు.

రాహుల్ స్థానంలో మరో కర్ణాటక బ్యాట్స్‌మెన్ దేవదత్ పడిక్కల్ టెస్టు జట్టులోకి రానున్నాడు. తమిళనాడుతో తాజాగా జరిగిన రంజీ మ్యాచ్‌లో ఈ కర్ణాటక ఆటగాడు 151 పరుగులు చేసి సెలక్టర్లను ఆకట్టుకున్నాడు. విశేషం ఏంటంటే ఈ మ్యాచ్‌ను బీసీసీఐ సెలక్టర్ అజిత్ అగార్కర్ దగ్గరుండి వీక్షించాడు.

ఈ సీజన్‌లో ఈ ఎడమచేతి వాటం ఆటగాడు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఓపెనింగ్ రంజీ గేమ్‌లో పంజాబ్‌పై 193 పరుగులు చేసిన తర్వాత, అతను గోవాపై 103 పరుగులు చేశాడు. పడిక్కల్ ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన రెండు అనధికారిక టెస్టుల్లో భారత్ A తరపున మూడు ఇన్నింగ్స్‌లలో వరుసగా 105, 65 & 21 పరుగులు చేశాడు.

Related News

India vs Bangladesh 1st Test: భారత్ 376 ఆలౌట్: బంగ్లాదేశ్ 26/3

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Big Stories

×