EPAPER

KL Rahul: క్రీడలు, వ్యాపారం ఒకటి కాదు: గోయంకాపై.. కేఎల్ రాహుల్ ఫైర్

KL Rahul: క్రీడలు, వ్యాపారం ఒకటి కాదు: గోయంకాపై.. కేఎల్ రాహుల్ ఫైర్

KL Rahul makes bold statement on IPL owners regarding performance: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ ఓనర్లపై టీమ్ ఇండియా ప్లేయర్ కేఎల్ రాహుల్ ఒక రేంజ్ లో ఫైర్ అయ్యాడు. క్రీడలు, వ్యాపారం ఒకటి కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఎప్పుడూ కూల్ గా ఉండే రాహుల్ ఇలా మాట్లాడటంపై నెట్టింట చర్చ జరుగుతోంది.


బహుశా లక్నో సూపర్ జెయింట్స్ ప్రాంఛైజీ సహ ఓనర్ గోయెంకా ను ఉద్దేశించి, ఈ వ్యాఖ్యలు చేశాడని నెటిజన్లు అంటున్నారు. అంటే తనని గోయెంకా వదులుకున్నాడని అంటున్నారు. ఈ క్రమంలో ఒక ఫ్రాంచైజీ నుంచి విఫల కెప్టెన్ గా బయటపడితే, తనకి మార్కెట్ ఉండదని భావించి, చివరికి ఇలా మాట్లాడాడని అంటున్నారు.

అంతకుముందు కోల్‌కతాలోని ఆర్‌పీజీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి గోయెంకాను కలిసిన రాహుల్ రిటెయిన్ అవ్వాలని, జట్టులోనే కొనసాగాలని భావిస్తున్నట్టు చెప్పాడని అంటున్నారు. అయితే రిటెన్షన్‌పై భరోసా లభించలేదని తెలుస్తోంది.


బీసీసీఐ రిటెన్షన్ పాలసీపై పూర్తి స్పష్టత ఇచ్చే వరకు ఎలాంటి ప్రణాళికలు రూపొందించకూడదని మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్టు తెలిసింది. అందుకే కేఎల్ రాహుల్ పై వస్తున్న వార్తలపై లక్నో యాజమాన్యం స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే కేఎల్ ఈ వ్యాఖ్యలు చేశాడని అంటున్నారు.

Also Read: మహిళల టీ 20 ప్రపంచకప్.. ఇదే మన భారత జట్టు

అయితే లక్నో గతంలో నాకౌట్ దశ వరకు చేరుకుంది. అయితే అప్పుడు మెంటార్ గా గౌతంగంభీర్ ఉన్నాడు. అతని ప్లానింగ్ వల్లే అంతదూరం వెళ్లిందనే టాక్ వచ్చింది. 2024 ఐపీఎల్ సీజన్ లో తను కోల్ కతా కి వచ్చేశాడు. దీంతో లక్నో ఘోరంగా విఫలమైంది.

అయితే ఒక్క రాహుల్ వల్ల ఇక లాభం లేదనుకుని, తనని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు చెబుతున్నారు. గత సీజన్ లో లక్నో జట్టు చెత్త ప్రదర్శనతో విసిగిపోయిన గోయెంక గ్రౌండులోనే రాహుల్ ని పట్టుకుని దులిపేశాడు. అంత జరిగినా సరే, రాహుల్ మాత్రం ఇంకా లక్నోతో ఉండాలని అనుకోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×