EPAPER

KKR Vs SRH Qualifier-1 Match: ఐపీఎల్‌లో ఆసక్తి సమరం.. రికార్డుల పరంగా ఆ జట్టుకే ఎక్కువ అవకాశం.. కానీ ఓడిన మరో ఛాన్స్!

KKR Vs SRH Qualifier-1 Match: ఐపీఎల్‌లో ఆసక్తి సమరం.. రికార్డుల పరంగా ఆ జట్టుకే ఎక్కువ అవకాశం.. కానీ ఓడిన మరో ఛాన్స్!

IPL 2024 Qualifier-1 KKR Vs SRH Match Preview: ఐపీఎల్ 2024 టోర్నీలో ఫైనల్‌కు వెళ్లే జట్టు ఏది? సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్.. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టా? ఎవరు ఫైనల్‌లో అడుగుపెట్టబోతున్నారు? మ్యాచ్ ఎవరి వైపు? ఇందులో ఓడినా ఆ జట్టు మరో ఛాన్స్.


అహ్మదాబాద్ వేదికగా మంగళవారం సాయంత్రం క్వాలి ఫైయర్ ఫస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరుజట్లు తమ అస్త్రాలను సిద్ధం చేశాయి. ఎప్పుడూ లేని విధంగా ఈసారి హైదరాబాద్ జట్టు పుంజుకుంది. కెప్టెన్‌గా కమిన్స్ పగ్గాలు అందుకున్నాక ఆ జట్టు చాలావరకు రికార్డులను బద్దలు కొట్టేసింది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ హెడ్ తొలి బాల్‌కు ఔటయినా మిగతా ఆటగాళ్లు దూకుడు కొనసాగించారు.

అభిషేక్‌శర్మ, క్లాసిన్, నితిన్‌కుమార్ రెడ్డి భీకరమైన ఫామ్‌లో ఉండడం జట్టుకు కలిసొచ్చే అంశం. 200పై చిలుకు పరుగులు చేయడమేకాదు ఛేజింగ్ చేసి మరీ గెలిచింది. ఆటగాళ్లకు నిలకడ లేదని అనుకున్నా, చివరు మూడు మ్యాచ్‌ల్లో ఆటగాళ్లు అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఫలితం ప్లేఆప్స్‌లో అడుగు పెట్టింది. రెండుసార్లు ఫైనల్‌కు వెళ్లింది హైదరాబాద్ జట్టు. ఒకసారి కప్ గెలుచుకోగా, మరోసారి ఓటమి పాలైంది. కానీ ఈసారి మాత్రం కప్‌పై కన్నేసింది ఆ జట్టు.


Also Read: ఐపీఎల్ 2024 ప్లే ఆఫ్ లో నాలుగు జట్లు.. ఎవరి బలమెంత?

ఇక కోల్‌కతా విషయానికొస్తే.. ఈ జట్టుకు ప్రధాన ఆయుధం ఓపెనింగ్. సాల్ట్- నరైన్ ఓపెనింగ్ ఆ జట్టుకు కొండంత బలం. అయితే కీలకమైన మ్యాచ్‌లో సాల్ట్ లేకపోవడం పెద్ద లోటు. వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, నితీష్ రాణా, రసెల్, రింకూసింగ్, రమణ్‌దీప్ ఇలా చూసుకుంటే దాదాపు ఎనిమిది మంది వరకు తిరుగులేని బ్యాటింగ్ లైనప్ ఆ జట్టు సొంతం. నరైన్‌కు జోడిగా ఓపెనర్ ఎవరు వస్తారనేది చూడాలి. రసెల్, రింకూ, రమణ్‌దీప్ స్పెషలిస్టు హిట్టర్లు. బౌలింగ్‌లో ఆ జట్టు బలంగా ఉంది. రెండుసార్లు కప్ గెలుచుకుంది కోల్‌కతా జట్టు. మూడుసార్లు ఫైనల్‌కు చేరింది. ఈసారి కప్ గెలుచుకోవాలని ఆటగాళ్లు ఉవ్విల్లూరుతున్నారు.

ఐపీఎల్‌లో ఇప్పటివరకు హైదరాబాద్- కోల్‌కత్తా జట్టు 26 సార్లు తలపడ్డాయి. 17 మ్యాచ్‌ల్లో నైట్‌రైడర్స్ గెలవగా, 9 మ్యాచ్‌లో సన్ రైజర్స్ విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఇరుజట్లు ఒక్కసారి మాత్రమే తలపడ్డాయి. కోల్‌కత్తా జట్టు నాలుగు పరుగులతో తేడాతో విజయం సాధించింది. సన్ రైజర్స్‌పై అత్యధిక స్కోరు 208 పరుగులు కాగా, అత్యల్ప స్కోరు 101 పరుగులు మాత్రమే. అదే నైట్ రైడర్స్‌పై అత్యధిక స్కోరు 228 పరుగులుకాగా, అత్యల్ప స్కోరు 116 పరుగులు.

Also Read: ప్లే ఆఫ్ షెడ్యూల్ మ్యాచ్ లు ఇవే..

కోల్‌కతా నైట్ రైడర్స్ ఇప్పటి‌వరకు ప్లే ఆఫ్స్‌లో 13 మ్యాచ్‌లు ఆడింది. అందులో 8 గెలిచింది, మరో మూడు మ్యాచ్‌ల్లో ఓడింది. క్వాలిఫయర్-1లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మంచి రికార్డు ఉంది. నైట్‌ రైడర్స్ జట్టు 2012, 2014 ఏడాది క్వాలిఫయర్-1లో గెలిచి కప్ గెలుచుకుంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటివరకు ప్లే ఆఫ్స్‌లో 11 మ్యాచ్‌లు ఆడింది. అందులో ఐదు గెలిచింది, ఆరు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. సన్‌రైజర్స్ జట్టు 2018లో క్వాలిఫయర్-1 ఆడింది. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది. ఫైనల్‌లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమిపాలైంది.

Also Read: ఈ రోజే మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్.. కోల్ కతా వర్సెస్ హైదరాబాద్.. గెలిచేదెవరు..?

ప్లేఆఫ్స్‌లో డేంజర్ ఎవరు? ఐపీఎల్ చరిత్రలో ఇరుజట్లు రెండుసార్లు మాత్రమే తలపడ్డాయి. ఒకటి హైదరాబాద్, మరొకటి కోల్‌కత్తా గెలిచాయి. ఇప్పుడు జరుగుతున్నది మూడో మ్యాచ్. ఇందులో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి. ఈ రెండు జట్లకు మంచి ఛాయిస్ ఉంది. గెలిచిన జట్టు ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఇప్పుడు ఓడిపోయిన జట్టుకు మరో ఛాన్స్ ఉంది. ఈనెల 22న రాజస్థాన్-బెంగళూరు మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. అందులో ఓడిన జట్టు నేరుగా ఇంటికి వెళ్తుంది. గెలిచిన వాళ్లతో ఇప్పుడు ఓడిన జట్టు తలపడనుంది.

Tags

Related News

Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ.. ఇండియా ‘ఏ’ టీం తొలి విజయం

Neeraj Chopra Diamond League: బ్రసెల్స్ డైమండ్ లీగ్ లో నీరజ్ చోప్రాకు రెండో స్థానం.. 2024లో ఏకంగా నాలుగుసార్లు టైటిల్ మిస్!

Matthew Short: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా ఓపెనర్..13ఏళ్ల రికార్డు బ్రేక్

Virat Kohli: కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ షురూ..!

India vs Bangladesh 1st Test: ఒక్కటి గెలిస్తే చాలు.. 92 ఏళ్ల రికార్డు బ్రేక్

MS Dhoni: ధోనీ.. ఓసారి వాటర్ బాటిల్ తన్నేశాడు.. తెలుసా? : బద్రీనాథ్

Piyush Chawla: గంభీర్‌కి.. కొహ్లీ రికార్డులన్నీ తెలుసు: చావ్లా

Big Stories

×