EPAPER
Kirrak Couples Episode 1

Kapil Dev : అన్నీ గెలిచి.. చివర్లో ఓడిపోయేసరికి బాధనిపించింది: కపిల్ దేవ్

Kapil Dev : అన్నీ గెలిచి.. చివర్లో ఓడిపోయేసరికి బాధనిపించింది: కపిల్ దేవ్

Kapil Dev : క్రికెట్ అనేది ఒకటుంది, దానికి వరల్డ్ కప్ అనేది ఒకటుంది.. అని భారతదేశానికి తొలిసారి పరిచయం చేసింది మాత్రం కపిల్ దేవ్ బృందం అనే చెప్పాలి. 1983లో ప్రపంచకప్ సాధించి ఇండియాకు తీసుకొచ్చిన కపిల్ దేవ్ బృందానికి భారతదేశంలో ఘన స్వాగతం లభించింది. అయితే ఆరోజున కపిల్ దేవ్ తెచ్చింది ప్రపంచకప్ ని కాదు.. క్రికెట్ పై ప్రేమ, అభిమానాలను కూడా తీసుకొచ్చాడు.


భారతదేశంలో అలా క్రికెట్ పై ప్రేమ వేళ్లూనుకోవడమే కాదు, భారతీయుల రక్తంలోకి వెళ్లిపోయింది. అంతే కాదు అదొక మతంలా మారిపోయింది. అంటే క్రికెట్ ని అభిమానించేవాళ్లందరూ ఒకవైపు, అభిమానించని వాళ్లు, ఇతర ఆటలను ఇష్టపడేవాళ్లందరూ ఒకవైపునకు వెళ్లిపోయేంతగా నాటుకుపోయింది.

అలాంటి కప్ సాధించిన మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 2023 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో టీమ్ ఇండియా ఓటమిని చూసి చాలా బాధపడ్డానని తెలిపాడు. కానీ ముందుగా ఆస్ట్రేలియాని అభినందించాలి. ఆడాల్సిన ఒక్కమ్యాచ్ లో పక్కా ప్రొఫెషనల్స్ గా ఆడారని అన్నాడు.


అయితే మనవాళ్లు ఓడిపోయినందుకు బాధగా ఉన్నా, అంత గొప్ప క్రికెట్ ఆడినందుకు అభినందించాల్సిందే. నాన్ స్టాప్ గా 10 మ్యాచ్ ల్లో గెలిచిన మనవాళ్లు ఒక్క మ్యాచ్ లో ఓడిపోయినంత మాత్రాన వాళ్లని నిందించడం కరెక్టు కాదని తెలిపాడు.

అయితే బాధ ఉంటుంది. అన్ని గెలిచి చివర్లో ఓడిపోయామే అనిపిస్తుంది. కానీ తప్పదని అన్నాడు. కానీ దీని నుంచి గుణపాఠాలు నేర్చుకుని ముందుకెళ్లాలి. వచ్చే వరల్డ్ కప్ సాధించడానికి ఇప్పటి నుంచి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని తెలిపాడు.

వరల్డ్ కప్ లో ఓటమి పాలైనప్పటికి…ఈ అంశం ఇప్పటికిప్పుడు ఆరేలా లేదు. ఏదొక రోజు ఎవరొకరు స్పందిస్తూనే ఉన్నారు. తమ అభిప్రాయాలను చెబుతూనే ఉన్నారు. ఇప్పటివరకు ఇండియా రెండుసార్లు మాత్రమే వరల్డ్ కప్ గెలిచింది. 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో ఒకసారి, 2011లో ధనాధన్ ధోనీ కెప్టెన్సీలో ఒకసారి కప్ సాధించింది.

ఆరోజు క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ క్రికెట్ నుంచి రిటైరైన రోజు కూడా అదే కావడం యాధ్రచ్చికంగా జరిగింది. అలాంటి సచిన్ కి ఘనమైన వీడ్కోలు కూడా ఇచ్చినట్టయ్యింది. అయితే భారత క్రికెట్ లో అదృష్టవంతుల్లో సచిన్ ముందుంటాడని అంటుంటారు. అన్ని రకాల రికార్డ్స్ కొట్టడమే కాదు, క్రికెట్ లో కూడా ఎనలేని హైట్స్ కి చేరుకున్నాడు.

 భారతదేశంలో క్రికెట్ పై ఈరోజున ఇంతటి ప్రేమ, ఆదరణ, అభిమానం పెరగడానికి ఆరోజున ప్రధాన కారకుల్లో కపిల్ దేవ్, సచిన్ టెండుల్కర్ మాత్రమేనని చెప్పాలి. ఎందుకంటే ఇది ఎవరూ కాదనలేని సత్యం. చరిత్ర మరువని సత్యం.

Related News

Women’s T20 World Cup 2024: నేటి నుంచే మహిళల టీ20 ప్రపంచకప్..ఎక్కడ ఫ్రీగా చూడాలంటే ?

Team India: క్రికెట్‌ లోకి కొత్త రూల్‌ తెచ్చిన టీమిండియా..బజ్‌బాల్ కాదు..ఇకపై గమ్‌బాల్ !

WTC 2025: బంగ్లా చిత్తు.. WTC ఫైనల్‌కు చేరాలంటే టీమిండియా ఎన్ని మ్యాచ్‌లు గెలవాలంటే?

IPL 2025: కోహ్లీకి ఎసరు..RCB లోకి టీమిండియా కెప్టెన్‌ ?

Ind Vs Ban: రెండో టెస్టులో టీమిండియా గ్రాండ్ విక్టరీ… సిరీస్ మనదే.. బంగ్లా నాగిని డాన్స్ కు బ్రేకులు!

IND vs BAN: కుప్పకూలిన బంగ్లాదేశ్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..?

Team India: టీ20 అనుకుని రెచ్చిపోయారు…147 ఏళ్ల టెస్టు క్రికెట్‌లో టీమిండియా ‘ఫాస్టెస్ట్‌’ రికార్డులు

Big Stories

×