EPAPER

Vimal Kumar Revealed details: ఆరోజు విమానంలో కొహ్లీ, రోహిత్ ఏమన్నారంటే?

Vimal Kumar Revealed details: ఆరోజు విమానంలో కొహ్లీ, రోహిత్ ఏమన్నారంటే?

Journalist Vimal Kumar Revealed details: విరాట్ కొహ్లీ ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉంటాడు. క్రీజులో ఎంత సీరియస్ గా ఉంటాడో, క్రీజు బయట అంత హుషారుగా ఉంటాడు. భావోద్వేగాలను నియంత్రించుకోవడంలో ఇటీవల మరింత పరిణితి సాధించాడు. ఇంతకీ విషయం ఏమిటంటే, టీ 20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత… టీమ్ ఇండియా జట్టు తుఫాను ధాటికి అక్కడే ఉండిపోయింది.


తర్వాత స్పెషల్ ఫ్లయిట్ లో అందరూ బయలుదేరారు. వీరితో పాటు కొందరు జర్నలిస్టులు కూడా ఉన్నారు. వారిలో విమల్ కుమార్ అనే జర్నలిస్టు, ఆ రోజు విమానంలో జరిగిన అనుభవాలను ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఫ్లయిట్ బయలుదేరిన తర్వాత క్రికెటర్లందరిలో మంచి ఉత్సాహం కనిపించిందని అన్నాడు.

కొందరు క్రికెటర్లు ఫ్యామిలీలతో వచ్చారు. కానీ క్రికెటర్లందరూ ఒక దగ్గర కూర్చుని నదాగా జోక్స్ వేసుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో అందరూ మంచి జోష్ లో ఉన్నారు. రాహుల్ ద్రవిడ్ అయితే, తనకిచ్చిన బిజినెస్ క్లాస్ నుంచి వచ్చేసి, ఎకానమీలో పడుకుండిపోయాడు. మొత్తం ఫ్లయిట్ లో 60 మంది వరకు ఉంటామని విమల్ కుమార్ అన్నాడు.


రోహిత్, విరాట్, హార్దిక్ కళ్లల్లో ఇంకా నీళ్లు తగ్గలేదు. కప్పుని చూస్తూ మురిసిపోయారు. ఈ సమయంలో అక్కడికి సూర్య కుమార్ వచ్చి, ఏం జరుగుతుంది? నాక్కూడా చెప్పండని అన్నాడు. ఆ జోకేంటో చెబితే నేనూ నవ్వుతాను కదాని అన్నాడు. అయితే అంతకుముందు ఏం జరిగిందంటే…

క్రెకెటర్లందరూ నవ్వుతుంటుంటే, ఏం జరుగుతుందో చూద్దామని వాళ్ల దగ్గరకు వెళ్లాను. .నన్ను చూసిన వెంటనే రోహిత్ అన్నాడు… నీ కెమెరా ఏది? అది తీసుకురా అన్నాడు.

Also Read: వరదల్లో చిక్కుకుంటే.. ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడారు

ఆ వెనుక సీట్లో ఉన్న కొహ్లీ అన్నాడు. తనెక్కడికి వెళ్లినా కెమెరా ఉండాల్సిందేనని అన్నాడు. అలా వారిద్దరూ కలిసి నన్ను ఆటపట్టించడం మొదలుపెట్టారు. ఏమైనా పిచ్చిపిచ్చిగా రాస్తే, మేం ఇద్దరం ఓపెనర్లం తెలుసు కదా…బాదేస్తామని నవ్వుతూ అన్నాడు.

ఇలా జరుగుతుండగా సూర్యకుమార్ వచ్చి చేరాడు. మొత్తానికి తనకి విషయం చెప్పలేదు. తనని కూడా ఆటపట్టించారు. అలా జరిగిన తర్వాత, నేను వెళ్లి కొహ్లీ పక్కన కూర్చున్నానని విమల్ కుమార్ తెలిపాడు.

అప్పుడు తనని చూసి సరదాగా అన్నాను. నువ్వు నాకు అండర్ 19 నుంచి తెలుసు…అప్పటికి ఇప్పటికి ఏమీ మారలేదని అన్నాను. దానికతడు…నేనెందుకు మారలేదు…చూడు నా గెడ్డం అప్పుడే నెరిసిపోయిందని అన్నాడు. దీంతో అక్కడున్నందరం హాయిగా నవ్వుకున్నాం. మళ్లీ మేం నవ్వుకుంటుంటే సూర్యకుమార్ మా వైపు చూశాడు. తననింకా ఆట పట్టిస్తూ కొహ్లీ…ఇక్కడేం జరిగిందో…సూర్యాకి చెప్పొద్దు…చెప్పొద్దు అంటూ యాక్షన్ చేసేసరికి అందరం మరోసారి నవ్వుకున్నాం. అలా విమానంలో మా ప్రయాణం ఆనందంగా సాగిపోయిందని విమల్ కుమార్ తెలిపాడు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×