EPAPER

Jay Shah : ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గా.. మళ్లీ జైషా..

Jay Shah : కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు, బీసీసీఐ సెక్రటరీ జై షా మూడోసారి ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. ఇండోనేషియా బాలిలో జరిగిన ఏసీసీ వార్షిక సమావేశంలో అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Jay Shah : ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గా.. మళ్లీ జైషా..
jay shah news today

jay shah news today(Indian cricket news today)

కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు, బీసీసీఐ సెక్రటరీ జై షా మూడోసారి ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. ఇండోనేషియా బాలిలో జరిగిన ఏసీసీ వార్షిక సమావేశంలో అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.


ఈనేపథ్యంలో జై షాయే ఐసీసీ ప్రెసిడెంట్ అవుతారనే కామెంట్లు నెట్టింట షికార్లు కొడుతున్నాయి. ఈ ఏడాది నవంబర్‌లో ఐసీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ పత్రికల్లో వస్తున్న కథనాలను ఫేక్ వార్తలని కొందరు కొట్టి పారేస్తున్నారు. ఎందుకంటే ఐసీసీ ప్రెసిడెంట్ అయితే బీసీసీఐ, ఏసీఐ పదవులకు జైషా రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఏసీసీ పోయినా పర్వాలేదుగానీ, బీసీసీఐను జైషా వదులుకోరని కొందరు కామెంట్ చేస్తున్నారు.

ఏసీసీ ప్రెసిడెంట్‌గా జై షా హయాంలో ఆసియాలో క్రికెట్ అభివ్రద్ది జరిగిందని బోర్డు సభ్యులు తెలిపారు. ఓమన్, నేపాల్ వంటి దేశాల్లోనూ క్రికెట్ అభివృద్దికి జైషా కృషి చేశారని వారు కొనియాడారు. ఆసియా ఖండమంతా కూడా క్రికెట్ ను విస్తరించాలని, అన్ని దేశాలు క్రికెట్ ఆడాలని ఈ సందర్భంగా జై షా తెలిపారు.


వన్డే ప్రపంచకప్‌ 2023, టీ 20 ప్రపంచకప్, ఇంకా ఆసియాకప్‌ ఇవన్నీ కూడా జై షా ఆధ్వర్యంలో దిగ్విజయంగా జరిగాయి. భారత్, పాకిస్థాన్ నుంచే కాదు, శ్రీలంక, బంగ్లాదేశ్ నుంచి ప్రతిభ కలిగిన ఎంతోమంది యువకులు వెలుగులోకి వచ్చారు. ఆర్థికంగా ఏసీసీని బలోపేతం చేసి, ఆదాయాన్ని పెంచడంలో జై షా సక్సెస్ కావడం వల్ల మూడోసారి కూడా ఎంపికయ్యారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రపంచ క్రికెట్ లో ఆర్థికంగా బలోపేతంగా ఉన్న బీసీసీఐ…అంతా తన కంట్రోల్ లో ఉండటం వల్ల, త్వరగా పనులు అవుతాయనే ఉద్దేశంతోనే జై షాను వరుసగా ఎన్నుకుంటున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఏసీసీ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన జై షాపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది. అంతేకాదు దిగ్గజ క్రికెటర్లతో పాటు బీసీసీఐ అధికారులు, పలువురు ఆటగాళ్లు, అభిమానులు జై షాకు అభినందనలు చెబుతున్నారు. ఇతర దేశాల క్రికెట్ బోర్డు అధ్యక్షులు సైతం జైషాను అభినందిస్తున్నారు.

Tags

Related News

Nindha Movie: ఓటీటీలోనూ దూసుకుపోతున్న ‘నింద’.. ఒక్క రోజులోనే ఇన్ని వ్యూసా..?

Game Changer: ఎట్టేకలకు గేమ్ ఛేంజర్ అప్డేట్ వచ్చేసిందోచ్..

Inaya Sulthana: ఇసుకలో ఇనయా ఆటలు.. మరీ అంతలా అందాలు ఆరబెట్టాలా?

Donations To Flood Victims: ఏపీకి విరాళాల వెల్లువ.. ఎన్నడూ లేనంతగా.. వాళ్ల కోసమేనా!

Mississippi bus crash: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..7 గురి దుర్మరణం..37 మందికి గాయాలు

Pranayagodari: ‘గు గు గ్గు’ పాటను రిలీజ్ చేసిన గణేష్ మాస్టర్

Rare Airbus Beluga: శంషాబాద్ ఎయిర్ పోర్టులో బాహుబలి ఎయిర్ క్రాఫ్ట్ ఎంత పెద్దదో చూశారా?

Big Stories

×